కోరిన కోరికలు తీర్చే కురుడుమలె గణపతి ఆలయం ఎక్కడ ఉందొ తెలుసా

కర్ణాటక రాష్ట్రంలో సూర్యుడు మొట్టమొదట ఉదయించే పట్టణంగా ముళబాగిలు ప్రసిద్ధి చెందింది. కోలారు జిల్లా కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముళబాగిలు అటు ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులను పంచుకుంటుండడంతో తెలుగు-కన్నడ సంస్కృతులు,భాషలు మిళితమై ఉంటాయి. అక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరంలోని కురుడుమలె వినాయకుడి ఆలయానికి ప్రసిద్ధి.

కురుడుమలె గణపతిచోళుల కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లుగా భావిస్తారు. సుమారు 14అడుగుల ఎత్తు ఉన్న ఈ భారీ విగ్రహం, ఏక సాలగ్రామ శిల. ఈ విగ్రహాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుడు కలిసి స్వయంగా ప్రతిష్టించారని ఇతిహాసం చెబుతుంది. విగ్రహం చాలా ఏళ్ల పాటు బహిరంగ ప్రదేశంలోనే పూజలు అందుకొనేది. ఆ తర్వాత ఈ విగ్రహానికి విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు దేవాలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారం ద్వారా రుజువైంది.

కురుడుమలె గణపతిఈ విగ్రహానికి విజయనగర రాజులు దేవాలయాన్ని నిర్మించారు. మరి ఈ దేవాలయ చరిత్ర ఏంటో..దేవాలయంలో కొలువైన గణపతి యొక్క మహిమలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం… త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతిని పూజించి కార్యవిఘ్నాలు తొలగించుకున్నారని, త్రేతాయుగంలో ఈ స్వామిని సేవించి రాముడు లంకకు పయనమయ్యాడని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు స్వామిని సేవించాడని, పాండవులు స్వామిని సేవించారని అక్కడ స్థల పురాణం చెబుతోంది.

కురుడుమలె గణపతికౌండిన్య మహాముని ఆ ప్రాంతంలో నేటికీ ఉంటారని, ప్రతీ రాత్రి వచ్చి స్వామిని సేవించుకుంటారని అక్కడ నమ్మకం. దానికి ఆధారంగా కొన్ని రాత్రులు అక్కడ స్తోత్రాలు వినబడతాయని, ఓంకారం ప్రతిధ్వనిస్తుందని పర్వదినాలలో దేవతలు స్వామిని సేవించుకుంటారు అని అక్కడ పెద్దలు చెబుతారు. ఇక్కడ ప్రాశస్త్యం ఏమిటంటే అనుకున్న పనులు జరగక విఘ్నాలు విసిగిస్తుంటే స్వామి దర్శన మాత్రం చేత ఆ అడ్డంకులు తొలగిపోయి మంచి జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అక్కడ ఉన్న శక్తి మనకున్న దోషాలను, అరిష్టాలను పారద్రోలి మంచి సమయం మొదలవుతుందని ప్రశస్తి.

కురుడుమలె గణపతికొత్త పని మొదలు పెట్టేముందు, బాధలతో సతమతమయ్యేవారు తప్పక దర్శించి ఆశీస్సులు తీసుకుంటే వారి పనులు నిర్విఘ్నంగా అద్భుతంగా పనులు జరుగుతాయని చరిత్ర. అందుకే నిత్యం వందల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ గుడికి ఒక వంద మీటర్ల దూరంలో కౌండిన్యమహర్షి ప్రతిష్టితమైన 1600 ఏళ్ళ సోమేశ్వరస్వామి, అమ్మవారిని కూడా దర్శించి వారి అనుగ్రహం పొందవచ్చు. వీరు తమ కుమారుని బాగోగులు దగ్గరుండి చూసుకుంటారని అక్కడ అనుకుంటారు.

కురుడుమలె గణపతిఅలాగే ముళబాగిలు పట్టణంలో మరికొన్ని సందర్శించదగిన ఆలయాలు ఉన్నాయి.

విరూపాక్షస్వామి ఆలయం :

కురుడుమలె గణపతిముళబాగిలు పట్టణం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న విరూపాక్షస్వామి దేవాలయం సుమారు 13వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించినట్లు ఇక్కడి శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. దేవాలయం శైలి కూడా విజయనగర రాజుల శిల్పకళావైభవాన్ని చాటుతుంది. విరూపాక్షస్వామి దేవాలయంలో విరూపాక్ష లింగాన్ని గురు దత్తాత్రేయ తండ్రి అట్రి మహర్షి ప్రతిష్టించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ లింగం సూర్యోదయం,సూర్యస్తమయ సమయాల్లో రంగులు మారుతుండడం మరో విశేషం. అంతేకాదు చాలా అరుదుగా కనిపించే బగల్ముఖి దేవాలయం కూడా ఈ విరూపాక్ష దేవాలయంలో నిర్మించిడం గమనార్హం..

పాదరాజ మఠం:

కురుడుమలె గణపతిముళబాగిలు పట్టణం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో బెంగళూరు-తిరుపతి రహదారిపై ఉన్న పాదరాజ మఠానికి శతాబ్దాల చరిత్ర ఉంది. పాదరాజ మఠంలో వెలసిన యోగ నరసింహస్వామిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడి కోనేరులో అన్ని రుతువుల్లోనూ నీటిమట్టం ఒకేవిధంగా ఉండడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక ప్రతిఏటా పాదరాజ మఠంలో నిర్వహించే ఆరాధన ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. గురు రాఘవేంద్ర స్వామి నరసింహ తీర్థంలోనే విద్యాభ్యాసం చేసినట్లు ఇక్కడి స్థానికులు చెబుతుంటారు.

గరుడ ఆలయం :

కురుడుమలె గణపతిరాష్ట్రంలోనే కాదు దేశంలోనే చాలా అరుదుగా కనిపించే గరుడ దేవాలయాల్లో ఒకటి ముళబాగిలు పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో కొలదేవి అనే గ్రామంలో ఉంది. ఇక్కడ గరుడ ఆలయం శ్రీ రామానుజాచార్య నేతృత్వంలో నిర్మించబడిందని స్థానిక చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ గరుడ ఆలయానికి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఖాండవ వనం దహనం సమయంలో మరణించిన పాములు పెట్టిన శాపం నుంచి విముక్తి పొందడానికి అర్జునుడు కొలదేవిలో గరుడ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు.మరొకటి రామాయణంలో సీతను రావణాసురుడు అపహరించి తీసుకెళుతున్న సమమంలో జటాయువు అడ్డుకోగా రావణుడు కత్తితో జటాయువును సంహరిస్తాడు.సదరు జటాయువు కొలదేవిలో మరణించిందని అందుకే ఇక్కడ గరుడ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు..

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR