లోటస్ టెంపుల్ లో ఏ దేవుడిని ఆరాధిస్తారో తెలుసా ?

0
2548

లోటస్ టెంపుల్ కట్టడానికి ప్రేరణ పద్మము అని అంటారు. ఈ కట్టడం లోని శిల్పకళా వైభవం గురించి మరియు ఈ టెంపుల్ లో అసలు ఏ దేవుడిని ఆరాధిస్తారు అనే విషయాల ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం.

lotus templeఢిల్లీ నగరంలో,బాహాపూర్ అనే చిన్న గ్రామంలో 1986 లో నిర్మించిన ఈ ఆలయం ప్రపంచ సందర్శకులకు ఒక ఆకర్షణీయ స్థలమైంది. దీని శిల్పకళా వైభవానికి ఎన్నో అభినందనలు మరియు ఈ కట్టడానికి లెక్కకు మించిన అవార్డులు వచ్చాయి. అయితే మిగతా అన్ని బహాయీ గుడులువలే ఈ గుడిలో కూడా బహాయీ గ్రంథాలు తెలియచేసినట్లు అన్ని మతాలవారికి ప్రవేశం కల్పిస్తుంది. కానీ ఎవరు కూడా తమ మత ప్రవచనాలను వల్లివేయుట కానీ, తమ మతానికి సంబంధించిన కర్మలను ఆచరించుట కానీ అనుమతించరు.

lotus templeలోటస్ టెంపుల్ ప్రతి ఏటా 40 లక్షల సందర్శకులకు కనువిందు చేస్తుంది. బహాయీ శిల్ప కళ ప్రకారం అబ్దుల్ బహ అనే అతను భాయి మత వ్యవస్థాపకుడు బహ ఉల్లకి కుమారుడు. తండ్రి యొక్క కోరిక ప్రకారం ఒక ప్రార్థన స్థలాన్ని తొమ్మిది వృత్తాకార భుజాలతో విగ్రహాలు, చిత్ర పటాలు ప్రదర్శనికి ఉంచకుండా, ఎటువంటి అగ్నికుండాలు లేకుండా మిగితా అన్ని “బహాయీ” గుడివలె ఇక్కడ కూడా ఒక లోటస్ టెంపుల్ నిర్మించబడింది. ఈ కట్టడానికి ప్రేరణ పద్మము అంటారు.

lotus templeఇక ఈ కట్టడం, 27 పాలరాయి పలకలని పద్మరేకులుగా చెక్కారు. ఈ రేకులని మూడు మూడు చొప్పున కలపడంతో 9 వృత్తాకార భుజాలు ఏర్పడ్డాయి. ఈ కట్టడానికి 9 ద్వారాలు ఉన్నాయి. ఏ ద్వారం నుండి ప్రవేశించిన మధ్య హాలులోకి వస్తారు. ఈ హాలులో ఒకేసారి 25 వేల మంది కూర్చునే అవకాశం ఉంది. ఇంకా 26 ఎకరాల స్థలంలో 40 మీటర్ల పొడువు గల,ఈ హాలు చుట్టూ 9 కొలనులు ఉన్నాయి. భారతదేశంలోని ముఖ్య కట్టడాల చరిత్రలో ఈ టెంపుల్ కూడా ఒకటి అందుకే ఈ కట్టడం చిహ్నంగా ఒక తపాలా బిళ్ళని కూడా విడుదల చేసింది. అంతేకాకుండా 2011 వ సంవంత్సరంలో ఎక్కువ మంది దర్శించే ప్రార్థన మందిరంగా గిన్నిస్ పుస్తకంలో చోటు సంపాదించింది.

lotus templeఈ టెంపుల్ కేవలం ప్రార్థన మందిరంగానే చెలామణి అవుతుంది. అన్ని రకాల మతాల వారికీ ఈ ఆలయం అనేది ఉపయోగపడుతుంది. మానవులంతా ఒక్కటే అని నినాదం ఇక్కడ వినిపిస్తుంది. ఫరబోజ్ సహాబా అనే కెనడా శిల్పి ఈ మందిరానికి రూపకల్పన చేసాడు. లోటస్ అంటే కమలం. ఈ పుష్పం ద్వారా మానవులు అంత ఒక్కటే అనే సూక్తిని వ్యక్తం చేసేదుకు ఈ మందిరానికి పద్మాకారాన్ని నిర్ణయించినట్లు తెలుస్తుంది.

lotus templeఇన్ని విశేషాలు ఉన్న ఈ పాలరాతి కట్టడం ప్రార్థన మందిరంగా, యాత్ర స్థలంగా అందరిని చాలా ఆకట్టుకుంటుంది.

lotus temple

SHARE