Home Unknown facts రాత్రి సమయాలలో అమ్మవారు గుర్రం పైన పర్యటిస్తూ భక్తులని రక్షిస్తుందని భక్తుల నమ్మే ఆలయం తెలుసా...

రాత్రి సమయాలలో అమ్మవారు గుర్రం పైన పర్యటిస్తూ భక్తులని రక్షిస్తుందని భక్తుల నమ్మే ఆలయం తెలుసా ?

0

మజ్జిగౌరమ్మ తల్లి వెలసిన ఈ ఆలయంలో ఎన్నో ఆచారాలు నమ్మకాలు అనేవి ఉన్నాయి. ఈ ఆలయానికి ఒకసారి వచ్చిన భక్తులు తిరిగి మళ్ళీ మళ్ళీ ఈ ఆలయంలో ఆ తల్లి దర్శనానికి వస్తుంటారు. ఎందుకంటే ఈ తల్లి భక్తుల కోరికలు నెరవేరుస్తూ భక్తులని చల్లగా చూస్తుంది. మరి ఈ ఆలయ స్థల పురాణం ఏంటి? ఇక్కడ ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

majjigourammaఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో మజ్జిగౌరమ్మ తల్లి ఆలయం ఉంది. అయితే ఒక కోటలో మధ్యలో అమ్మవారు వెలిశారని స్థల పురాణం అందుకే ఈ ఆలయానికి మజ్జి గౌరమ్మ అనే పేరు వచ్చినది అని చెబుతారు. ఈ ఆలయాన్ని మొదట్లో మజ్జిగరియాణి అని పిలిచేవారు. అంటే మధ్య గదిలో వెలసిన అమ్మవారు అని అర్ధం. అయితే ఇక్కడ తెలుగు సంప్రదాయాలు కూడా ఎక్కువ ఉండటం వలన మజ్జిగరియాణి అమ్మవారు మజ్జిగౌరమ్మతల్లి అని కూడా పిలువబడుతుంది.

ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఇక్కడ సింహద్వారం దాటగానే ఒక వెండి గుర్రం అందరిని ఆకట్టుకుంటుంది. రంకెలేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించే ఈ గుర్రాన్ని ఐదు క్వింటాళ్ల ఇత్తడితో తయారుచేసారు. అయితే రాత్రి సమయాలలో అమ్మవారు ఈ గుర్రం పైన పట్టణం చుట్టూ పర్యటిస్తూ భక్తులని రక్షిస్తుందని భక్తుల నమ్మకం.

ఇంకా ఈ ఆలయంలో ఉన్న ఒక వింత ఆచారం ఏంటంటే, అక్కడ ఉన్న రాయజానీ మందిరం వద్ద భక్తులు రాళ్ల పూజ చేస్తారు. అయితే ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు ఈ రాయజానీ మందిరం వద్దకి వచ్చి ఒక్కొక్కరు ఒక రాయిని వేస్తారు. ఇలా వేసిన రాళ్ళని ప్రతి సంవత్సరం విజయదశమి తరువాత దగ్గరలో ఉన్న ఒక లోయలో వేస్తారు.

ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, పదిహేనో శతాబ్దంలో నందపూర్ మహరాజ్ రాజా విశ్వనాథ్‌దేవ్ రాయగడలో ఓ కోట నిర్మించుకొని పాలనా కొనసాగిస్తుండేవాడు. అయితే ఆయ‌న దుర్గా మాత కి పరమ భక్తుడు. ఈ రాజుకి 108 మంది రాణులు ఉండేవారు. ఇది ఇలా ఉంటె ఆ రాజు దుర్గామాత పైన ఉన్న భక్తితో తన కోట మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేస్తుండేవాడు. ఇక గోల్కొండ పాలకుడు ఇబ్రహీం కుతుబ్‌షా సేనాధిపతి రుతుఫ్‌ఖాన్ రాయగడపై దండెత్తి విశ్వనాథ్ దేవ్‌ని సంహరిస్తాడు. రాజు మరణ వార్త తెలిసిన ఆ 108 మంది రాణులు ఆ కోటలోనే ఆత్మహుతి చేసుకుంటారు.

ఆ తరువాత కాలంలో బ్రిటీష్ వారు విజయనగరం నుండి రాయగడ ప్రాంతానికి రైలు మార్గం నిర్మించేందుకు ఈ ఆలయం ఉన్న జంఝావతి నది పైన కొంత దూరం వంతెన నిర్మించగా ఒక రోజు ఆ వంతెన కూలిపోయింది. అదేరోజు ఆ బ్రిటిష్ అధికారి కలలో అమ్మవారు కనిపించి తనకి ఒక ఆలయాన్ని నిర్మించమని అప్పుడు వంతెనకు ఎలాంటి ఆటంకం కలుగదని చెప్పడంతో ఆ అధికారి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు.

ఇలా ఇక్కడ వెలసిన ఈ తల్లి ని దర్శించుకోవడానికి ఉత్త‌రాంధ్ర‌, ఒడిస్సా వాసులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version