శుభకార్యాలలో మామిడి ఆకులకు ఎందుకు అంత ప్రాధాన్యత ?

0
3719

మన హిందూ సంప్రదాయంలో పండుగలు, శుభకార్యాలు జరుపుకునేటప్పుడు ఇంటికి తోరణాలు కట్టడం ఆనవాయితి. ఏదైనా ఓ శుభకార్యం ప్రారంభించారంటే చాలు.. వెంటనే గుమ్మానికి తోరణాలు కట్టేస్తుంటారు. ఆ తోరణాలు కట్టడానికి ఎక్కువగా ఉపయోగించేది మామిడి ఆకులు మాత్రమే. మామిడి ఆకులు లేకుండా ఏ శుభకార్యం జరగదు కూడా.

Mamidi thoranam
అయితే అసలు ఇంటికి తోరణాలు ఎందుకు కట్టాలి? వాటిని కడితే.. ఏం ప్రయోజనమని కొందరి అంటుంటారు. ప్రతి శుభకార్యంలోను మామిడి ఆకులను ఎందుకు ఉపయోగిస్తాం అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Mamidi thoranamమామిడి ఆకుల గురించి రామాయణ,మహాభారత గ్రంధాలలో కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రతి శుభకార్యంలోను మంగళ తోరణాలు కట్టటానికి మామిడి ఆకులను తప్పనిసరిగా ఉపయోగిస్తాం. ఎందుకంటే మామిడి ప్రేమకు, సంపద, సంతానాభివృద్ధికి సంకేతం. అందుకే పూజకు ముందు ఉంచే కలశంలో కూడా తప్పనిసరిగా మామిడి ఆకులను ఉపయోగిస్తాం.

Mamidi thoranamమామిడి ఆకులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు. అందువల్ల ఆ ఆకులతో గుమ్మానికి తోరణం కడితే ఇంటిలోకి ధనం చేరి ఆ ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది. ఇంటి ప్రధాన గుమ్మానికి మామిడి తోరణం కడితే ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చి అన్ని శుభాలే జరుగుతాయి.ఇంట్లో ఏమైనా దుష్ట శక్తులు ఉంటే పోతాయి. అలాగే దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది.

Lakshmi Deviఈ తోరణాలు ఇంట్లో కట్టితే నిద్రలేమిని పోగొడుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడితే ఇంట్లో ఉండే గాలి శుభ్రమవుతుందట. ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది. తద్వారా చక్కని ఆరోగ్యం కలుగుతుందట.