మత్స్య యంత్ర అవతరణ వెనుక దాగివున్న రహస్యాలు

మత్స్య యంత్రం గురించి తెలుసుకునే ముందు విష్ణు మూర్తి మత్స్య అవతారం గురించి తెలుసుకోవాలి. మహా విష్ణువు పది అవతారాలలో మత్స్య అవతారం మొదటిది. అది ఎలా సంభవించింది అంటే… ఒకానొకనాడు బ్రహ్మదేవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని నోటినుండి వేదాలు జారి క్రింద పడగా, “సొమకాసురుడు” అనే రాక్షసుడు నాలుగు వేదాలని అపహరించి, భుజించి సముద్రగర్భంలోకి వెళ్ళిపోయాడు. విషయం తెలిసిన మహా శివుడు ఆవేశంతో ప్రళయం సృష్టిస్తాడు. ప్రళయం భూమిని నాశనం చేసే లోగ వేదాలను మరియు ధర్మాన్ని కాపాడాలని విష్ణు మూర్తి మత్స్య అవతారం గావిస్తాడు.

మత్స్య యంత్ర అవతరణవరాహకల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు, విష్ణు భక్తుడు. ఒకరోజు అతను కృతమాలా నదికి వెళ్లి స్నానం చేసి, సూర్యునికి అర్ఘ్యం ఇస్తూండగా దోసిటలో చేపపిల్ల పడుతుంది. రాజు దానిని నీటిలోనికి జారవిడిచి, మళ్ళీ నీటిని దోసిలలోకి తీసుకున్నప్పుడు మళ్లీ చేతిలోనికి చేప వచ్చి చేరుతుంది. రాజు చేపను నీటిలోకి వదిలే ప్రయత్నం చేస్తుండగా అది ఈ విధంగా పలికింది “రాజా ! నేను ఇక్కడే ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి, దయచేసి నన్ను రక్షించు” అని ప్రార్థించినది. వెంటనే రాజు ఆ చేపపిల్లని ఒక పాత్రలో వేసాడు. మరుసటి రోజుకి ఆ చేపపిల్ల పాత్రపట్టనంత పెద్దది అయ్యింది. అప్పుడు రాజు దానిని చెరువులో వదిలిపెట్టాడు. ఆ మరుసటిరోజుకి ఆ చేపపిల్లకి చెరువు కూడా సరిపోలేదు. అ రాజు … ఆ చేపపిల్లని సముద్రంలో విడిచిపెట్టాడు.

మత్స్య యంత్ర అవతరణఆ మత్స్యం (చేప) శతయోజన ప్రమాణానికి విస్తరించింది. అంతట ఆ మత్స్యం “తాను శ్రీమన్నారాయణుడుని అని, ప్రళయం రానున్నదని, సర్వజీవరాశులు నశించిపోతాయి అని, ఈ లోకమంతా మహాసాగరమవుతుంది అని, నీవంటి సత్యవ్రతుడు నశింపరాదని” పలికింది. ఒకపెద్ద నౌకను నిర్మించి, అందులో పునఃసృష్టికి అవసరమగు ఔషధములు, బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండమని, సప్తఋషులు కూడా ఈ నౌకలోనికి వస్తారని చెప్పింది. అలాగే మత్స్య రూపంలో నారాయణుడు జలనిధిని అన్వేషించి సోమకాసురునితో పోరాడి,, అతని కడుపుని చీల్చి …… వేదాలను – దక్షిణావర్త శంఖాన్ని సంరక్షించి నౌకలో భద్ర పరుస్తాడు.

మత్స్య యంత్ర అవతరణమీనరూపంలో ఉన్న నారాయణుడు మహాసర్ప రూపమైన శేషనాగును తాడుల నావకు కట్టి, ప్రళయాంతం వరకు రక్షిస్తాడు. తరువాత సత్యవ్రతుడు సూర్యునికి మనువుగా జన్మిస్తాడు. అప్పుడే మయ బ్రహ్మచే మహిమగల బీజాక్షర మంత్రాలను సమన్వయంచి ప్రత్యేకించి తయారు చేయబడినది ఈ మత్స్య యంత్రం.

నాటి నుండి నేటి వరకు గృహంలో వాస్తు దోషాలు ఏమయిన ఉంటే మత్స్యయంత్ర స్థాపనతో ఆ దోషాలు సమసిపోతాయి. అన్ని రకాలుగా శ్రీ మహావిష్ణువు కాపాడుతాడు అని నూతన గృహా నిర్మాణ సమయంలో,పాత ఇండ్లకు వాస్తు లోప నివారణకు,వ్యాపార సంస్థలలో వ్యపార అభివృద్ధి కోరకు వీటిని నలుదిక్కులలో స్థాపించుకుని సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. అత్యంత మహిమాన్వితమైన ఈ మత్స్యయంత్రం సమస్త వాస్తు దోషాలను నివారించే శక్తినికలిగి మానవులకు ఉపయోగకరమైన శుభ ఫలితాలు ఇస్తుంది.

మత్స్య యంత్ర అవతరణపునాది బెందడు నింపుట కొరకు మొరం మట్టిని మాత్రమే వాడినచో దోషం వర్తించదు,కాని ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం.మనం ఇల్లు కట్టక ముందు,కొనకముందు ఆస్థలం ఏలా ఉండేదో ఎవ్వరికి తెలవదు,అక్కడ ఏ పోలాలో లేదా పాడు పడ్డ పెంటల స్థలమో,స్మశానమో ఎలా ఉండేదో ఎవరికి తెలియదు.ప్రస్తుత కాలంలో కొన్ని ఇండ్లు,అపార్టమ్ంట్స్ కట్టేవారు ఈ నియమం తెలియక అనేక కష్టాలు పడుతున్నారు. వాస్తు చూపించే ఇల్లు కట్టాము అయినా ఇబ్బందులు వస్తున్నాయి అని వాపోతుంటారు. దానికి కారణం శల్యదోషం అయ్యి ఉండవచ్చు. ఇలాంటి విషయాలకు పంచలోహతో చేయబడిన మత్స్యయంత్రం “భూ”స్థాపితం చేస్తే అనేక దోషాలను నివారిస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR