మొహందీపూర్ ఆలయానికి నిజంగా దెయ్యాలను ఒదిలించే శక్తి ఉందా?

0
225

దెయ్యాలు ప్రేతాత్మలు ఉన్నాయి అంటే కొంతమంది నవ్వుకుంటారు. అయితే దేవుడ్ని నమ్మినప్పుడు.. దెయ్యాలున్నాయన్నది కూడా నమ్మాలి’.. అనేది కొంతమంది వాదన. ఇప్పటికీ కొందరు దెయ్యాలను వొదిలించుకోవాలని చాల డబ్బు వృధా చేస్తారు కానీ రాజస్థాన్ లోని ఒక ఆలయంలో నిజంగా దెయ్యాలను వొదిలిస్తారట. ఆ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాజస్థాన్లోని ‘మెహందీపూర్ బాలాజీ’ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. దెయ్యాలు పీడిస్తున్నాయని భావించేవారితో ఈ ఆలయం భయం గొలుపుతూ ఉంటుంది. రాజస్థాన్లోని అరావళీ పర్వాతల నడుమ దౌసా అనే జిల్లాలో ఉందీ ఈ ఆలయం. అవడానికి చాలా చిన్న ఆలయమే కానీ ఎక్కడా సమాధానం దొరకని దుష్టశక్తుల నుండి కాపాడడానికి ఈ ఆలయమే శరణ్యం అంటారు.

Mehandipur Balaji Templeవెంకటేశ్వర స్వామికి ఉన్న చాలా పేర్లలో బాలాజీ ఒకటి. కానీ, ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో బాలాజీ అంటే హనుమంతుడు. బాల హనుమాన్‌‌ రూపంతో హనుమంతుడిని పూజిస్తారు. కాబట్టే ‘బాలాజీ’ అనే పేరు వచ్చింది. అలాంటి ఆలయాలు చాలానే ఉన్నాయి. కానీ, రాజస్తాన్‌‌లోని మెహందీపూర్‌‌ బాలాజీ మందిర్‌‌ మాత్రం అన్నింటికీ బిన్నం. భూతవైద్యానికి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి దేశం నలుమూలల నుంచి రోజూ వేలల్లో జనాలు తరలి వస్తుంటారు. ‘దేవుడ్ని నమ్మినప్పుడు.. దెయ్యాలున్నాయన్నది కూడా నమ్మాలి’.. ఈ సూత్రం మెహందీపూర్‌‌ బాలాజీ ఆలయంలో గోడలపై అక్కడక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంది. ఆలయం బయటే కాదు.. లోపలి ప్రాంగణంలో కూడా జనాలతో ఎప్పుడూ రద్దీ ఉంటుంది ఈ ఆలయం. భక్తుల హనుమాన్‌‌ చాలీసా పఠనం, బ్యాండ్‌‌ మేళాలతో ఆ గుడి ప్రాంగణం మారుమోగుతుంటుంది. ‘దెయ్యాల్ని తరిమే గుడి’ అనే పేరుండటంతో ఫారిన్‌‌ టూరిస్టులు కూడా ఆసక్తిగా ఆ గుడి గురించి తెలుసుకునేందుకు వస్తుంటారు. దీంతో టూరిజం పరంగా కూడా ఆ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.

Mehandipur Balaji Templeసాధారణంగా గుడి అంటే ప్రశాంత వాతావరణాన్ని ఊహించుకుంటాం. కానీ.. ఈ ఆలయంలో అలాంటివి ఊహించుకోవడం కష్టం. ఎందుకంటే ఇక్కడ దెయ్యాల్ని వదిలించేందుకు వింత పూజలు జరుగుతుంటాయి. బాధితుల్ని ఓ స్పెషల్ చాంబర్‌‌లో గొలుసులతో కట్టేసి ఉంచుతారు. అరుపులు, బ్యాండ్‌‌ల సౌండ్లతో ఆ ఆలయంలో ఎప్పుడూ గోల గోలగా ఉంటుంది. పూజ సమయంలో పండితులు మంత్రాలు చదవడం ప్రారంభించాక అసలు వ్యవహారం మొదలవుతుంది. హనుమాన్‌‌ చాలీసా చదువుతూ బ్యాండ్ బాజాలు వాయిస్తుంటారు కొందరు. ‘సియా కే రామ్‌‌’ జపంతో ఆ ప్రాంతం దద్దరిల్లుతుంది. ఆ శబ్దాలకు అక్కడున్న అందరూ పరవశంతో ఊగిపోతారు. చివరికి ఎవరైతే స్పృహ తప్పి పడిపోతారో.. వాళ్లు ‘దెయ్యం బాధితులు’అని గుర్తించాలి. అర్జి, సావామణి, దర్కస్త్‌‌.. పద్ధతులు ఒకదాని వెంట ఒకటి జరిపి ఇక్కడ దెయ్యాన్ని వదిలిస్తారు.

Mehandipur Balaji Templeఅంతేకాదు ఈ గుడి ఆవరణలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అది ఏమిటంటే ‘ఎవరేం ఇచ్చినా తినకూడదు.. తాగకూడదు. అసలు కొత్తవాళ్లతో మాట్లాడకూడదు. గుడి బయటకు వచ్చాక వెనక్కి తిరిగి చూసినా నష్టమే. వీటిల్లో ఏ ఒక్కటి చేసినా దుష్టశక్తుల్ని మీ వెంట ఆహ్వానించినట్లే’ అని పెద్ద బోర్డుపై రాసి ఉంటుంది. అందుకే ఈ ఆలయ వాతావరణంలో ఎక్కువసేపు ఎవరూ ఉండలేరు. ఒకప్పుడు ఈ ప్రాంతం దట్టమైన అడవి. శ్రీ మహంత్‌‌ జీ అనే వ్యక్తికి బాల హనుమాన్‌‌ కలలో కనిపించి తనను పూజించమని చెప్పాడట. కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా విగ్రహం కనిపించిందట. దీంతో గుడి కట్టి ఆయన కుటుంబం బాలాజీకి పూజలు నిర్వహిస్తోంది. అంతేకాదు బాలాజీ విగ్రహం ‘స్వయంభు’ అని చెప్తుంటారు. గతంలో కొందరు ఈ విగ్రహాన్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తే.. ఎంత తవ్వినా బయటికి రాలేదనే కథ ప్రచారంలో ఉంది.

ఈ ఆలయం కాంప్లెక్స్‌‌లో బాలాజీ ఆలయంతో పాటు భైరవ బాబా గుడి, అంజనా మాతా, కాళీ మాతా, పంచముఖి హనుమాన్‌‌జీ, వినాయకుడి ఆలయాలు ఉన్నాయి. నార్త్‌‌ ఇండియాలో భూతవైద్యానికి ఫేమస్‌‌గా, ఫస్ట్‌‌ ప్లేస్‌‌లో ఉంది ఈ గుడి. రాజస్తాన్‌‌ క్యాపిటల్ జైపూర్‌‌ సిటీకి 110 కిలోమీటర్ల దూరంలో దౌసా జిల్లాలో ఉంది ఈ గుడి. అయితే జైపూర్‌‌ మెయిన్ బస్టాండ్‌‌ నుండి మెహందీపూర్‌‌ విలేజ్‌‌కి బస్సులు విరివిగా ఉంటాయి. రైల్‌‌, రోడ్డు, ఫ్లైట్‌‌ రూట్స్‌‌లో జైపూర్‌‌కి చేరుకోవచ్చు.

SHARE