కైలాస పర్వతాన్ని ఎందుకు అధిరోహించలేకపోతున్నారు?

పార్వతి పరమేశ్వరులు నివాసం కైలాస పర్వతం అని చాల పురాణాలు చెబుతున్నాయి.  హిమాలయాల్లో వున్న అనేక పర్వతాలలో  ఈ కైలాస పర్వతానికే ఎన్నో విశిష్టతలు వున్నాయి. సమస్త మానవాళికి అర్థంకాని రహస్యాలు ఇక్కడెన్నో వున్నాయి. హిందూమతం ప్రకారం  శివుడు, పార్వతీ సమేతుడై ఇక్కడే కొలువై వున్నాడని పురాణాలలో కొన్ని కథలు కూడా వున్నాయి.

kailasa parvathamమొత్తం ఆసియాలోనే పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర, సింధూ, సట్లజ్, గంగానదికి ఉపనది అయిన కర్నాలి మొదలైన నదుల మూలాలు ఈ పర్వత ప్రాంతంలోనే వున్నాయి. కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో కనిపిస్తూ  నాలుగు రంగుల్లో దర్శనమిస్తుంటుంది.

kailasa parvathamహిందూ మతప్రకారం  శివుడు ఈ కైలాస పర్వత శిఖరంలో నివసిస్తున్నాడు. పార్వతీ సమేతుడై నిరంతరం ధ్యాన స్థితిలో వుంటాడు. విష్ణుపురాణం ప్రకారం కైలాస పర్వత నాలుగు ముఖాలు స్ఫటిక, బంగారం, రుబి, నీలం రాయితో రూపొందించినట్లు తెలుపబడింది. తామరు పువ్వు ఆకారంలో వున్న ఆరు పర్వతాల మధ్య ఈ కైలాస పర్వతం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

kailasa parvathamఅంతేకాకుండా కైలాస పర్వతానికి నాలుగు రూపాలు కూడా వున్నాయి. ఒకవైపు సింహం, రెండోవైపు గుర్రం, మూడోవైపు ఏనుగు, నాలుగోవైపు నెమలిలాగా ఈ పర్వతశిఖరం కనిపిస్తుంది. అందులో గుర్రం హయగ్రీవ రూపంలోను, సింహం పార్వతి దేవి వాహనం, నెమలి కుమారస్వామికి వాహనం కాగా ఏనుగు విఘ్నేశ్వరునికి ప్రతీకగా వుంటాయి.

kailasa parvathamనలువైపులా మంచుతో కపబడివున్న ఈ పర్వతం  పౌర్ణమినాడు మిలమిల మెరుస్తూ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. దీని మొత్తం చుట్టుకొలత 52 కిలోమీటర్లు. ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ ఈ కైలాస పర్వతాన్ని  అధిరోహించలేదు. ఎవరికి సాధ్యం కాలేదు కూడా. పూర్వం కొంతమంది సాధువులు  అధిరోహించేందుకు ప్రయత్నించి, మధ్యలోనే అదృశ్యమయ్యారు. నాలుగు మతాలవారు ఎంతో ఆధ్యాత్మికంగా పూజించే ఈ పర్వత వాలుపై కాలుపెట్టడం మహాపాపమని ప్రతిఒక్కరు విశ్వసిస్తారు. అయితే ఈ మూఢవిశ్వాసాన్ని పోగొట్టేందుకు చైనా ప్రభుత్వం వారు దీనిపై పరిశోధనలు కూడా చేశారు. రెండుసార్లు ఈ పర్వతంపైకి  పంపించిన హెలికాప్టర్లు మధ్యలోనే కూలిపోయాయి కూడా. దాంతో అప్పటినుంచి ఈ పర్వతం జోలికి ఎవ్వరు వెళ్లలేదు. ఈ పర్వత ఉపరి భాగంలో ఏముందో తెలుసుకోవడం  సైన్స్ కి కూడా ఇంతవరకు అంతపట్టడం లేదు. యోగశాస్త్రంలో ఈ పర్వతాన్ని షమస్ర చక్రంగా పేర్కోవడం జరిగింది.

kailasa parvathamమరొక కథనం ప్రకారం  పూర్వం రావణాసురుని తల్లి వ్యాధితో బాధపడుతుండుగా ఎంతో ఆధ్యాత్మికంగా పూజించే శివుని దర్శనం కల్పించడానికి రావణుడు తన వీపు మీద ఈ కైలాస పర్వతాన్ని పెట్టుకుని తల్లి దగ్గరకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తాడు. శివుడు అతని ధైర్యానికి మెచ్చి  అతనికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. రావనుడికి కూడా ఈ పర్వతాన్ని ముట్టుకోవడం సాధ్యపడలేదు అని పురాణాలు చెబుతున్నాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR