నాగమణి ఎక్కడ దొరుకుతుంది ? నాగినీలు, నాగమణిల గురించి ఆసక్తికర విషయాలు

0
356

నాగమణికి కాపలాగా నాగిని ఉంటుంది. ఎవరైనా స్వార్ధంతో నాగమణిని దొంగిలించాలని అనుకుంటే వారిని చంపేస్తుంది. ఇవి మనకు సినిమాల్లో కనిపించే దృశ్యాలు. అసలు నాగు పాములో నాగమణి ఎలా ఏర్పడుతుంది నాగపాములో రత్నం ఏర్పడే శక్తి నిజంగానే ఉంటుందా ? ఇంతటి శక్తివంతమైన నాగమణి ఎక్కడ దొరుకుతుంది. అసలు, నాగినీలు, నాగమణిలు ఈ కాలంలో కూడా ఉంటాయా? నాగినీలు, నాగమణిల గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Unknown Facts About NagaManiహిందువులు నాగు పాములను దేవతలుగా భావించి పూజలు చేస్తారు. నాగుల చవితి నాడు విశేష పూజలు నిర్వహిస్తారు. పుట్టలో పాలు పోసి ప్రదక్షణలు చేస్తారు. హిందూపురాణాల ప్రకారం నాగుపాము తలపై ఆభరణంగా ఉండే దాన్ని మణి అని పిలుస్తారు. ఈ నాగమణి గురించి.. వాయు, అగ్ని, విష్ణు, బ్రహ్మ పురాణాల్లో ప్రస్తావించారు. ఇది అత్యంత శక్తివంతమైనది, విలువైనది, మంత్ర శక్తులు కలిగిన మణి అని హిందువుల నమ్మకం.

Unknown Facts About NagaManiస్వాతి నక్షత్రం రోజు.. వర్షం పడినప్పుడు.. ఆ వర్షపు బిందువు నాగు పాము నోట్లోకి వెళ్లడం ద్వారా మణి రూపొందడం మొదలవుతుందట. ఇతిహాసాల ప్రకారం.. మణి కేవలం నాగు పాముల్లోనే రూపొందుతుంది. ఎందుకంటే.. నాగుపాము మాత్రమే వంద ఏళ్లు భూమ్మీద ఉండగలుగుతుంది. ఒకసారి పాములో నాగమణి రూపొందింది అంటే.. ఆ పాము అద్భుతమైన శక్తిసామర్థ్యాలు సొంతం చేసుకుంటుంది. అప్పుడు మాత్రమే.. ఆ పాము ఏ రూపంలో అయినా మారగలుగుతుంది. అలా నాగు పాము మనిషి రూపంలోకి మారితే వాసుకి అని అంటారు. దీని ప్రకారం మణి కలిగిన నాగు పాము మనిషి రూపంలోకి మారగలదు.

Unknown Facts About NagaManiనాగమణి నాగు పాము యొక్క తల భాగంలో ఉంటుంది. చందమామలా మెరిసిపోతూ ఉండే నాగమణికి లేత నీలిరంగు ఉంటుంది. ఇది కేవలం చీకట్లో మాత్రమే బాగా మెరుస్తుంది. ఈ నాగ మణి మన దగ్గర ఉండటం.. అదృష్టం అంటారు. ఈ మణి ఉన్న వ్యక్తి సిరిసంపదలు పొందగలుగుతాడట. ఎప్పుడైతే.. మణిని పాము నుంచి తొలగిస్తారో.. అప్పుడు ఆ నాగుపాము మరణిస్తుంది.

Unknown Facts About NagaManiవజ్రాల కంటే విలువైన నాగమణి మన దగ్గర ఉంటే.. పాము కాటు వేయడానికి కూడా రాదని, కలిసి వస్తుందని అలాగే ధనవంతులు అవుతారని ఒక నమ్మకం ఉంది. అలాగే నాగమణి చాలా విలువైనదే కాదు.. మంత్ర శక్తులు కూడా కలిగి ఉంటుందని హిందువుల నమ్మకం. దీర్ఘ కాలిక వ్యాధులు నాగమణి ద్వారా నయం అవుతాయని కొన్ని ఔషధ శాస్త్రాలు చెబుతున్నాయి.

SHARE