హిందూపురాణాలలో నాగుపాముకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పరమశివుడు తన మెడలో నాగుపాముని ధరించగా, శ్రీ మహావిష్ణువు సర్ప రాజైన ఐదు తలలు కలిగిన ఆదిశేషువుపై పవళిస్తాడు. ప్రతి సంవచరం నాగులచవితి నాడు భక్తులు నాగుపాముని పూజించి వారి భక్తిని చాటుకుంటారు. మన దేశంలో ఎన్నో నాగక్షేత్రాలు అనేవి ఉండగా ఈ ఆలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద నాగేంద్రుని విగ్రహం ఉన్నది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న మరిన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరు – మైసూర్ హైవే దారిలో ముక్తినాగక్షేత్రం ఉంది. దేశంలో ఉన్న అత్యంత ప్రసిద్దిగాంచిన నాగక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఆలయ గర్భగుడిలో 16 అడుగుల ఎత్తు, 36 టన్నుల బరువు కలిగి ఉండి, ఏడు పడగలతో చుట్ట చుట్టుకొని, ఏకశిలా నాగేంద్రుడి విగ్రహం భక్తులకి దర్శనమిస్తుంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద నాగేంద్రుడి విగ్రహం ఇదేనని చెబుతారు.
ఈ ఆలయంలో సర్పదోష నివారణ పూజలు నిర్వహిస్తుంటారు. ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులచే ప్రతిష్టించబడిన కొన్ని వందల నాగప్రతిమలు దర్శనమిస్తుంటాయి. అయితే శివుడు ఆయన మెడ చుట్టూ 3 సార్లు చుట్టబడిన ఒక పామును ధరిస్తారు. పాము యొక్క 3 చుట్టలు భూత,వర్తమాన,భవిష్యత్తు కాలాలను సూచిస్తాయి. సుబ్రహ్మణ్యస్వామి కుండలిని స్వరూపుడు అందుకు సంకేతంగానే సర్పరూపంలో దర్శనమిస్తుంటాడు. శ్రీ మహావిష్ణువు సర్ప రాజైన ఐదు తలలు కలిగిన ఆదిశేషువుపై పవళిస్తాడు. అందుకే హిందువులు పవిత్రమైన ప్రాణిగా పాముని పూజిస్తుంటారు.
ఈ ఆలయం చిన్నదైనప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద నాగదేవుని విగ్రహం ఉండటం, సర్పదోష నివారణ పూజలు నిర్వహించే ఈ ఆలయానికి భక్తుల రద్దీ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఆలయంలో నిత్యపూజలతో పాటు ప్రత్యేక రోజులలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.