ఓంకారం ఎలా ఉద్భవించింది? ప్రతి ఒక్కరి దేహంలో ఓంకారం ఉంటుందా?

మ‌న‌లో చాలామంది ప్ర‌శాంత‌త కోసం నిశ్శ‌బ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎంద‌రో శ్ర‌వ‌ణానందం క‌లిగించే శ‌బ్దాన్ని సంగీతం రూపంలో ఆశ్వాదిస్తారు. పంచ‌భూతాల్లో శ‌బ్దం అన్నింటిక‌మే ముందు ఉంటుంద‌ని పండితులు చెబుతారు. ఆ శ‌బ్దం ఆకాశం నుంచి వ‌స్తుంది. శ‌బ్దానికి ఆధారం ఓంకారం. నిజానికి ఓంకారం ప్ర‌తి దేహంలో ఉంటుంది. ‘ఓం’ అని శబ్దం చేయగానే, ఆ తరంగాలతో దేహం పులకితమవుతుంది.

omkaramఓం కారం ప్రణవనాదం. మొట్ట మొదట శూన్యంలోంచి ఓ శబ్దం పుట్టింది. ఆ శబ్దం ఓంకారం. ఓంకారం లోంచి ప్రకంపణలవలన శూన్యమంతా ఆవరించిన శక్తిలో చలనం మొదలైంది. ఆ చలనం ఈ బ్రహ్మాండ విశ్వాన్ని, గ్రహ,నక్షత్రాల్ని సృష్టించింది. శబ్దమే శక్తి యొక్క తొలి వ్యక్త రూపం. ఓంకారం లో అ ,ఉ, మ అనే అక్షరాలున్నాయి.

omkaramలోకంలో ప్రతి శబ్దం అ-మ ల మద్యే జనిస్తుంది. ఇలా అన్ని శబ్దాలూ ఓమ్ లోంచే పుడుతాయి కనుక ఓం మూల బీజం. అ, ఉ, మ శబ్దాలను కల్గిఉన్న అక్షరాలను బీజాక్షరాలని అంటారు. ఉదాహరణకు శ్రీ అనేది మ తో కలిసి శ్రీమ్ గా ఏర్పడినప్పుడు అది బీజాక్షరం అవుతుంది. గ అనేది మ తో కలిసి గం అనే బీజాక్షరం అవుతుంది. ఇలా మనకు బీజాక్షరాలు ఉద్భవిస్తాయి.

omkaramఓం అంటే శబ్దం. అదే మూల శక్తి. ఓం అనే శబ్దంలోంచి పుట్టిన ప్రతి శబ్దమూ శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఆ,ఉ, మ లతో కలసిన ప్రతి బీజాక్షరానికీ శక్తి ఉంటుంది. బీజాక్షరాలుగా ఉద్భవించి ఆ అక్షరాలను మనం ఉచ్చరించి నప్పుడు మన శరీరంలో శక్తి జనిస్తుంది. ఇలా జనించిన శక్తితో మన సంకల్పాలు నెరవేరుతాయి. బీజం అంటే విత్తనం. బీజాక్షరం అంటే అక్షరమే శక్తి గా ఉంటుంది.

omkaramఓం’ అన్న‌ది మంత్రం కాదు.. మ‌త సంబంధ‌మైన‌ది అస‌లే కాదు. వేదాల‌లో నిక్షిప్త‌మైన ఓంకార నాదం మానవ ఆరోగ్య ర‌హ‌స్యానికి ఒక సూత్రం. ప్రాచీన కాలంలో రుషులు వాత‌వార‌ణ ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను త‌ట్టుకుని ఉప‌వాస దీక్ష‌ల‌లో కూడా ఆరోగ్య‌వంతంగా ఉండ‌టం వెనుక ఓంకార నాద‌మే ర‌హ‌స్యం. విదేశాల్లోని విశ్వ‌విద్యాల‌యాల్లో జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో సైతం ఓంకారం మృత్యుంజ‌య జ‌పం అని బ‌య‌ట‌ప‌డింది. ఓంకారాన్ని మ‌తాన్ని ముడిపెట్ట‌డం వ‌ల్ల ఓంకారం చేసే మేలు ప‌రిమిత‌మ‌వుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR