భక్తులు తెచ్చిన ప్రసాదం దేవుడు స్వీకరించడం ఎప్పుడైనా చూసారా?

దేవుని ముందు పెట్టిన ప్రసాదాన్ని దేవుడు తింటే అది చూసి పులకించని భక్తులు ఉండరు.కానీ అల ఎక్కడైనా జరుగుతుందా అంటే ఆ ప్రశ్నకు సమాధానము మంగళగిరి శ్రీ పానకాల నరసింహ స్వామి. ఈ విషయాన్ని వివరంగ తెలుసుకునే ముందు ఇక్కడి స్థల పురాణాన్ని తెలుసుకుందాము.

Panakala Narasimha Swamy Templeస్థల పురాణం:

మహిషాసుర వధ జరిగిన తరువాత దుర్గమ్మ ఆగ్రహాగ్నితో రగిలిపోయింది. అప్పుడు ఆమె అగ్ని తన రెండవ కంటి ద్వార ఒక కొండపైకి వదిలి ఆ కొండను పెళ్ళగించి గాలిలోకి విసిరివేసింది. అదియె ఇప్పటి నరసింహ స్వామి కొలువైన కొండ. కాని దుర్గమ్మ నుంచి వెలువడిన ఆ అగ్నిజ్వాలలు మాత్రం ఆ కొండ నుండి అలాగే వెలువడుతున్నాయి.తరువాతి కాలంలో నరసింహ స్వామి హిరణ్యకసిపున్ని చంపిన తరువాత అలాంటి అగ్నిజ్వాలల తోనే రగిలిపోయాడు.

Panakala Narasimha Swamy Templeఅప్పుడు ప్రహ్లాదుడు ఆయనను స్తుతించగా ప్రసన్నుడై తన నుంచి వెలువడుతున్న అగ్నిజ్వలను తను అదుపుచేసుకోదలచి అనువైన ప్రాంతాన్ని వెతకుతున్న సమయంలో అప్పటికే అగ్నితో రగులుతున్న ఈ కొండ కనిపించి అక్కడే తనకు అనువైన ప్రాంతo అని తలచి నరసింహ స్వామి ఇక్కడే కొలువైయ్యాడు. కాని అగ్ని జ్వాలలు మాత్రం చల్లారలేదు. బ్రహ్మదేవుడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామిని పానకంతో అభిషేకించగా అగ్నిజ్వాలలు పూర్తిగా ఆరిపోయాయి. అప్పటినుంచి ఇక్కడ పానకంతో అభిషేకించడం ఆనవాయితీగా మారింది.

Panakala Narasimha Swamy Templeఇక్కడ చెప్పుకోతగ్గ విశేషం ఏమిటంటే స్వామి భక్తులు ఇచ్చిన పానకాన్ని అర్చకులు స్వామి నోటిలో పోస్తే నరసింహుడు ఆ పానకాన్ని గుటకలు వేస్తూ సంతోషంగా స్వీకరిస్తాడు.గుటకలు వేసిన శబ్దం కూడా స్ఫష్టంగా వినిపిస్తుంది.స్వామికి భక్తులు ఇచ్చిన పానకాన్ని అర్చకులు స్వామి కి అందివ్వగా స్వామి దానిని త్రాగి మరల కొంత పానకాన్ని బయటకు వదులుతాడు.దానినే భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు.మరియొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ నిరంతరం పానకం నైవేద్యం వల్ల అక్కడ పానకం నేలపై పడినా అక్కడ ఒక్క చీమ కూడా ఉండదు మరియు ఒక ఈగ కూడా వాలదు. భగవంతుడుకి ఇచ్చిన ప్రసాదాన్ని భగవంతుడే తింటే వచ్చే అలౌకిక ఆనందాన్ని భక్తులు సొంతం చేసుకుంటారు. ఇది ప్రతి తెలుగువాడు ఖచ్చితంగా దర్శించాల్సిన ప్రాంతం.

Panakala Narasimha Swamy Templeఈ క్షేత్రం విజయవాడ మరియు గుంటూరు కు దగ్గరలో ఉంది. విజయవాడ నుంచి ప్రతి 10 నిమిషాలకు గుంటూరు కు బస్సు సౌకర్యం కలదు. ఆ మార్గ మధ్య లోనే ఈ ఆలయం కలదు. మన రాష్ట్రము లోని అన్ని ప్రధాన పట్టణాల నుండి బస్సు లేదా రైల్ ప్రయాణం ద్వారా ఈ ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR