మద్యానికి బానిసలైన వారిని మద్యం మాన్పించే దేవుడు

మద్యానికి బానిసలైన వారు ఒక్కసారి ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే మద్యం మానేస్తారట.. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది.. ఇక్కడి స్వామి వారి విశేషాలేంటి మనం ఇపుడు తెలుసుకుందాం.. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన కవి గా, ‘వికటకవి’ గా ఖ్యాతికెక్కిన తెనాలి రామకృషుడు పాండురంగ భక్తుడు. ఈయన పాండురంగ మహాత్మ్యము గురించి కావ్యాలను వ్రాసాడు. పాండురంగ మహాత్మ్యము చదివితే, దుర్వ్యస నాలకు గురైన వ్యక్తిని పాండురంగడు ఏవిధంగా తప్పించాడో మనకు బోధపడుతుంది. అలాగే మద్యం అలవాటుకు బానిసలైన వారిని ఆ బారి నుండి తప్పించే దైవం మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. అనంతపురం జిల్లా, రాయదుర్గంలోని బొమ్మనహాళ్ సమీపంలో గల ఉంతకల్లు గ్రామంలో కొలువైన ఆ పాండురంగ స్వామే.. మద్యాన్ని మాన్పించే దేవుడు.

Panduranga Swamy Templeఉంతకల్లు లో కొలువైన పాండురంగ దేవాలయం ఎంతో మహిమకలది. గ్రామస్తులందరూ భక్తి శ్రద్దలతో పూజా కార్యాక్రమాలను నిర్వహిస్తుంటారు. సాధారణంగా గ్రామంలో నివసించే వారు ఒక్కో దేవుణ్ణి పూజిస్తుంటారు. కానీ ఈ గ్రామం డిఫెరెంట్. అందరూ పాడురంగ భక్తులే. కొన్ని శతాబ్దాల క్రితం ఈ ఊరు ప్రజలు తరచూ మహారాష్ట్ర లోని పుణ్యక్షేత్రమైన ‘పండరీపురం’ వెళ్లివచ్చేవారు. ఆతర్వాత ఇక్కడే ఒక దేవాలయాన్ని నిర్మించుకొని పాండురంగ స్వామి దేవాలయం గా పేరుపెట్టుకున్నారు. మద్యానికి బానిసైనవారు ఒక్కసారి ఈ దేవాలయాన్ని దర్శించి పాండురంగ మాల ధరిస్తే మళ్ళి జన్మలో దాని జోలికి పొరనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. మాల ధరించిన ఏ ఒక్కరూ మళ్ళి ఇప్పటివరకు మద్యం జోలికి వెళ్లలేదని దాఖలాలు ఉన్నాయి అని స్థానికులు చెబుతారు. ‘పాండురంగ మాల’ ఎప్పుడు పడితే అప్పుడు, ఏ రోజుపడితే ఆరోజు వేసుకోకూడదు. మాలాధారణ నిర్వహణ నెలలో కేవలం రెండు రోజుల మాత్రమే ‘శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి’ రోజుల్లోనే మాల ధరించాలి.

Panduranga Swamy Templeఆ రోజులలో రాష్ట్రం నలుమూలల నుంచే కాక పక్కనున్న కర్ణాటక, తమిళనాడు మరియు మహారాష్ట్ర ప్రాంతాల నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో హాజరవుతుంటారు. పాండురంగ మాల ధరించాలనుకొనేవారు ముందురోజు అర్ధరాత్రి నుంచి మాలను స్వామి వారి సన్నిధిలో ఉంచి పూజలు, భజనలు చేస్తారు. మాల ధరించేవారు ఉదయాన్నే నిద్ర లేచి స్నానాలు ఆచరించి ఆలయానికి చేరుకోవాలి. వీరికి ఆలయ ప్రధాన పూజారి వచ్చి మెడ లో మాల వేస్తారు. మాలధారణ చేసిన వారు వరుసగా మూడు ఏకాదశ రోజులలో ఇక్కడికి వచ్చి ఆలయ ప్రాంగణంలో నిద్రపోవాలి. కావాలనుంటే ఆ మూడు ఏకాదశ రోజులు అయిపోయినాక మాల తీసేయవచ్చు.

Panduranga Swamy Temple

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR