గుడి మధ్యలో స్తంభం దానంతట అదే తిరిగే దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?

కర్ణాటకలోని అతిపురాతమైన ఆధ్యాత్మిక చరిత్ర ఉన్న పట్టణాల్లో బేలూరు ప్రముఖమైనది.యగాచి నది ఒడ్డున దక్షిణకాశీగా కీర్తి గడించిన బేలూరు పట్టణం హొయ్సళ రాజులకు రాజధానిగా విరాజిల్లింది.ఎన్నో ప్రాచీనమైన, ప్రముఖ దేవాలయాలకు బేలూరు పట్టణం కేంద్రంగా నిలుస్తోంది.ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పట్టణంలో హొయ్సళ రాజులు నిర్మించిన చెన్నకేశవ స్వామి దేవాలయం నాటి రాజుల కళాపోషణకు,శిల్పుల అత్యద్భుత ప్రతిభకు తార్కాణంగా నిలుస్తోంది.దేవాలయం నిర్మాణం,శిల్పాల సౌందర్యం చూపుతిప్పుకోనివ్వదంటే అతిశయోక్తి కాదేమో

Rotating pillarచోళులపై తన విజయానికి చిహ్నంగా హోయసల రాజు విష్ణువర్ధనుడు కట్టించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.వైష్ణవ దేవాలయమైన చెన్నకేశవ స్వామి దేవాలయం ఎత్తైన గాలిగోపురం చాలా ప్రసిద్ధి చెందింది.శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడే విధంగా అత్యంత అందంగా అద్భుతంగా నయనమనోహరంగా ఉండే ఈ గాలిగోపురం నిర్మాణానికి పదేళ్ల సమయం పట్టిందంటే ఈ గోపురం విశిష్టత ఏంటో తెలుస్తున్నది. పురాణాల్లోని అనేక గాథలను, ఉపనిషత్తులను, ఏనుగులు, రామాయణ మహాభారతాలలోని అనేక శిల్పాలను ఇక్కడ చూడవచ్చు. వీటితో పాటు నవ యవ్వన పడతుల చిత్రాలు మరియు సువర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. ఆలయం ప్రవేశద్వారం వద్ద మెట్లబావిగా పిలువబడే పుష్కరిణి, అంతర్భాగంలోనే కప్పే చేన్నిగరాయ ఆలయం, మరియు లక్ష్మి దేవీకి అంకితం చేసిన ఒక చిన్న కట్టడము కూడా ఉన్నాయి.

Rotating pillarఆలయంలో ‘దర్పణ సుందరి’గా ప్రసిద్ది పొందిన శిల్ప౦ తప్పక తిలకించాల్సిన ఆకర్షణలలో ఒకటి. ఈ శిల్పం ఈ ప్రఖ్యాత దేవాలయ గోడలపై చెక్కబడి ఉంది.ఆధ్యాత్మిక, ఖగోళ చిత్రాలను, నృత్య , గానాలు చేస్తున్న మదనికల చిత్రాలను చూడవచ్చు. విష్ణువర్ధన రాజు భార్య రాణి శంతల దేవి అద్భుతమైన అందం ఈ శిల్పాలకు ప్రధాన ప్రేరణ అని స్థానిక చరిత్ర. దీంతోపాటు అదే ఆవరణలో వీరనారాయ, సౌమ్యనాయకి, రంగనాయకి, శ్రీదేవి, భూదేవిల కోసం నిర్మించిన ఆలయాలను సందర్శించవచ్చు.

Rotating pillarఆలయంలో నరసింహ రాయల కాలంలో నిర్మించిన విష్ణు సముద్రంగా ప్రసిద్ధి చెందిన పెద్ద సరస్సును కూడా తప్పకుండా చూడాల్సిందే. విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన టెంపుల్ ట్యాంక్ కూడా తప్పక చూడాల్సిన ప్రదేశం.చతురాస్రా ఆకారంలో సరస్సు ఉత్తరపు మెట్లను నిర్మించి, మూడు వైపులా మరి కొన్ని మెట్లను జోడించారు.

Rotating pillarబేలూరు ఆలయంలో అత్యంత ప్రధాన ఆకర్షణల్లో ఒకటి గ్రావిటీ పిల్లర్.42 అడుగుల ఎత్తుతో నిర్మించబడ్డ ఈ రాతి స్తంబం ఈ స్థూపం దాని స్వంత బరువుపై మూడు వైపుల నిలబడి, నాలుగో వైపు నేలకు ఆనకుండ కాగితం ముక్కను దూర్చినా దూరే విధంగా ఖాళీ తో నిరాధారంగా నిలబడేలా చెక్కడం విజయనగర పాలన లోని వాస్తుశిల్పుల సమర్థతకు,శిల్పుల నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ స్థంభం అప్పట్లో దానంతట అదే రొటేట్ అయ్యే విధంగా అమర్చబడి వుండేదని, తర్వాత దానిని ఆర్కియాలజీవారు ఆపేయటం జరిగిందని చారిత్రాత్మక కధనం.

Rotating pillarఇక ఆలయంలోని హిరణ్యకశపుడిని సంహరించే దృశ్యం విగ్రహం,నారాయణ విగ్రహం,గరుడ విగ్రహంతో పాటు 37 స్తంబాలతో మంటపానికి ఇరువైపులా నిర్మించిన రెండు దేవాలయాలు కూడా ప్రధాన ఆకర్షణ.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR