ఆకాశంలో ఉత్తరం వైపున నేటికీ కనిపించే ధ్రువ నక్షత్రం గురించి తెలుసా ?

ఆకాశంలో ఉత్తరం వైపున నేటికీ కనిపించే ధ్రువ నక్షత్రం గురించి తెలుసుకుందాం.. ఉత్తానుపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు వారిపేర్లు సునీత, సురుచి, రాజుగారికి సురుచి అంటే అమితమైన ప్రేమ. ఆమె కొడుకు ఉత్తముడు, పెద్దభార్య అయిన సునీత కొడుకు ధ్రువుడు. ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకునేవాడు. కాని తండ్రి పినతల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు. అందువల్ల ధ్రువునికి తండ్రి ప్రేమ కరువైంది. ఒక రోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్ళాడు.

ధ్రువ నక్షత్రంతండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చొని ఉన్నాడు. ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి ధ్రువుణ్ని చీదరించుకున్నాడు. తండ్రి చీదరించుకునేసరికి ధ్రువునికి దుఃఖం ఆగలేదు. అది చూసి పినతల్లి కఠినంగా ‘‘ధ్రువా! నీవు నా కడుపున పుడితే మీ తండ్రిగారి తొడపై కూర్చొనే అదృష్టం దక్కేది. ఇప్పుడైనా ఈ సురుచి కడుపున పుట్టించమని శ్రీహరిని ప్రార్థించు అప్పుడు నీకు ఉత్తముని స్థానం లభిస్తుంది’’ అంది పినతల్లి సురుచి.

ధ్రువ నక్షత్రంజరిగిన విషయం అంతా తల్లితో చెప్పాడు ధ్రువుడు. అప్పుడు తల్లి ‘‘ నాయానా ధ్రువా! నీ పిన తల్లి నిజమే చెప్పింది. తండ్రిప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకొని శ్రీహరిని గురించి తపస్సు చెయ్యి ఫలితముంటుంది. అని చెప్పింది. తల్లిమాటలకు ధ్రువుడు తపస్సు చేయడానికి బయలుదేరాడు. ధ్రువునికి మార్గ మధ్యలో నారధమహార్షి ఎదురయ్యాడు. విషయం తెలసుకొని నవ్వుతూ ఇలా అన్నాడు. నాయానా ధ్రువా! పసివాడివి. పినతల్లి మాటలకు ఇంత పట్టింపా ? తపస్సు అంటే మాటలు కాదు. చాలా కష్టం నీ నిర్ణయం మార్చుకో’’ అన్నాడు. నారుధుని మాటలకు ధ్రువుడు, మహార్షీ… పినతల్లి మాటలు నాలో రేపిన బాధ అంతా ఇంతా కాదు. ఉత్తముని కన్న నేను గొప్ప స్థానం సంపాదించాలి. అది పొందటానికి నేను ఎంత కఠోర తపస్సు అయినా చేస్తాను అన్నాడు.

ధ్రువ నక్షత్రంనీ పట్టుదల గట్టిది. ఆ శ్రీ మహావిష్ణువును మనసులో తలచుకొని నిశ్చలమైన మనసుతో తపస్సు చెయి నీ కోరిక తప్పక నెరవేరుతుంది. అని ఆశీర్వదించి నారుధుడు వెళ్ళిపోయాడు. ధ్రువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి శ్రీహరిని మనసులో తలచుకుంటూ ఒంటికాలిపై కొన్ని సంవత్సరాలు కఠోరతపస్సు ఆచరించాడు. అతని తపస్సుకు మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు ఆనందంతో పొంగిపోయి శ్రీహరిని స్తుతిస్తూ ఎన్నో స్త్రోత్రాలు చేసాడు. అప్పుడు విష్ణుమూర్తి ధ్రువా నీ మనసులో ఉన్న కోరిక నెరవేరుస్తున్నాను.

ధ్రువ నక్షత్రంఇంతవరకు ఎవరికి దక్కని ఉన్నత స్థానాన్ని నీవు పొందుతావు. మహారాజువై గొప్పగా రాజ్యమేలుతూ, సుఖసంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై, ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు. లోకమంతా ఆ నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అని పిలుస్తారు. అని వరమిచ్చి అదృశ్యమైనాడు. నేటికి కనబడే ఉత్తర దృవం పై ఉన్న నక్షత్రమే ధ్రువ నక్షత్రం.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR