రామాయణంలో పుష్పక విమానం గురించి చెప్పిన విశేషాలు ఏమిటి ?

రామాయణంలో సుందర కాండ ఎనిమిదవ, తొమ్మిదవ సర్గలలో పుష్పక విమానం గురించి పూర్తిగా వర్ణించబడింది. పుష్పక విమానం భారతీయ పురాణాలలో ప్రస్తావించబడ్డ గాలిలో ఎగరగలిగే ఒక వాహనం. ఎంతమంది ఇందులో కూర్చున్నా మరొకరికి చోటు ఉండటం దీని విశేషం.

Pushpaka Vimanamరామాయణంలో పుష్పక విమానం గురించిన క్లుప్తమైన వర్ణన ఉంది. యుద్ధానంతరం సీతా, లక్ష్మణ సమేతంగా వనరులతో పాటుగా సకాలంలో అయోధ్య చేరడానికి రాముడు దీనిని ఉపయోగించాడు. సీతాదేవిని అన్వేషిస్తూ వెళ్లిన సమయంలో హనుమంతుడు పుష్పక విమానాన్ని చూశాడు.

Pushpaka Vimanamనిజానికి ఇది బ్రహ్మ దేవుడి కోసం విశ్వకర్మ సర్వవిధ రత్నములతో ‘పుష్పకం’ అనే పేరుగల ఒక దివ్య విమానాన్ని స్వయంగా నిర్మించాడు. ఒకసారి బ్రహ్మ దేవుని దర్శనం కోసం వెళ్లిన కుబేరుడు పుష్పకాన్ని చూసి అది ఎలాగైనా తన సొంతం కావాలని అనుకున్నాడు. ఐతే కుబేరుడు తీవ్రమైన తపస్సు చేసి, బ్రహ్మను మెప్పించి ఆ విమానాన్ని బ్రహ్మ అనుగ్రహంతో కానుకగా పొందాడు. తరువాత రావణుడు, తన సోదరుడైన కుబేరుని జయించి స్వర్ణ లంకను స్వాధీనం చేసుకున్నట్టుగానే ఆ పుష్పక విమానాన్ని తన స్వంతం చేసుకున్నాడు.

Pushpaka Vimanamమనకు తెలిసిన విమానాల్లో కేవలం కూర్చోవడానికి ఆసనాలు మాత్రమే ఉంటాయి. కానీ ఆ విమానంలో మనం ఉహించినట్టుగా కేవలం ఆసనాలు మాత్రమే ఉండవు. ఎందుకంటే మన హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు, రావణుడు కానుకగా పొందిన పుష్పకాన్ని పరిశీలించాడు. లోపల చూడగానే సాక్షాత్తు స్వర్గలోకమే అవతరించిందా? అన్న భ్రాంతి కలిగిందట. అంతే కాదు ఆ పుష్పకము యజమాని మనసుని అనుసరించి మనో వేగంతో ప్రయానిస్తుందట.

Pushpaka Vimanamఅసలు శత్రువులకు దొరికే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. అంతే కాదు ఆ విమానానికి బయట లోపలివైపున విశిష్టమైన శిల్ప రీతులు గోచరిస్తాయట. కర్ణ కుండలాలతో శోభిస్తున్న ముఖాలు ఉన్న వారు, పెద్ద శరీరం ఉన్న వారు, ఆకాశంలో విహరించే రాక్షసులు తమ ప్రభువుకు అనుకూలంగా ప్రవర్తించే వారు, విశాల నేత్రాలు గల వారు, అతి వేగంగా సంచరించ గల వేలాది భూతగణాల వారు ఆ విమానాన్ని మోస్తున్నట్టుగా దాని బయట భాగంలో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి.

Pushpaka Vimanamఅదంతా చూసిన హనుమంతుడు ఈ విమానం రావణుడి స్థాయికి తగినట్టు దర్పంగా ఉంది అనుకున్నాడట. ఇంకా చెప్పాలంటే మెరుపు తీగల్లాంటి నారీ మణులు ఎందరెందరో ఆ విమానంలో ఉండటమే గాక అనేక సుందర దృశ్యాలు చిత్రీకరించబడి ఉన్నాయట. వాటిలో అవి భూమి మీద పర్వత శ్రేణులా? అన్నట్టుగా చిత్రించిన చిత్రాలు ఆ పర్వతాల మీద వృక్ష సమూహాలు పుష్పాలు వాటి కేసరాలు, పాత్రలు స్పష్టంగా చిత్రీకరించబడి ఉన్నాయట. ఇలా ఎన్నో రకాల రహస్యాలు, అద్భుతాలు పుష్పకంలో దాగి ఉన్నాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR