Home Unknown facts శ్రీ రాఘవేంద్ర స్వామి గురించి చాలామందికి తెలియని కొన్ని నిజాలు

శ్రీ రాఘవేంద్ర స్వామి గురించి చాలామందికి తెలియని కొన్ని నిజాలు

0

హిందువులలో ఓ ప్రముఖమైన గురువు శ్రీ రాఘవేంద్ర స్వామి. ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. భక్తులు రాఘవేంద్రస్వామిని శ్రీరాయలు అని పిలుచుకుంటారు. ఈ స్వామి వారు శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ హనుమంతుడి యొక్క పరమ భక్తుడు. బృందావనం నుంచే సజీవుడిగా వుండి భక్తుల మొర ఆలకిస్తున్న దేవుడు రాఘవేంద్రస్వామి. మరి ఈ స్వామి బాల్యం నుండి జీవసమాధి వరకు జరిగిన కొన్ని సంఘటనల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sri Raghavendra Swamy

రాఘవేంద్ర స్వామి తమిళనాడు రాష్ట్రంలోని భువనగిరి గ్రామంలో క్రీ.శ.1595 సంవత్సరం, మన్మనాథ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సస్తమీ మృగశిరా నక్షత్రంలో తిమ్మన్నభట్టు, గోపాంబ దంపతులకు జన్మించాడు. ఈయనకు తల్లిదండ్రులు వెంకటనాధునిగా నామకరణం చేసారు. విజయనగర సామ్రాజ్యము లోని ఒక పండిత కుటుంబానికి చెందినవారు రాఘవేంద్రులు . విజయనరగర సామ్రాజ్య పతనము తరువాత వీరి పూర్వీకులు కావేరీ తీరములోని కుంభకోణానికి చేరారు. అక్కడి మఠాధిపతి సురేంద్రతీర్ధులు వీరి కుటుంబ గురువులు. బాల్యములోనే ప్రతిభ కలవాడుగా గుర్తింపు పొందారు. వ్యాకరణము , సాహిత్య , తర్క , వేదాంతాలనన్నింటినీ అధ్యయనం చేశారు. సంగీత శాత్రము అభ్యసించి స్వయముగా కృతులను కన్నడ భాషలో రచించారు. చిన్నతనంలోనే సరస్వతి అనే యువతితో వివాహం జరిగింది. వివాహం అనంతరం కూడా ఉన్నత విధ్యను అభ్యసించడానికి కుంబకోణానికి వెళ్ళి అక్కడ శ్రీ సుదీంద్రతీర్ధుల వద్ద విధ్యను అభ్యసించారు. అక్కడే శ్రీ మాన్‌ న్యాయసుధ, పరిమళ అనే గ్రంధాలను రచించారు. మహభాష్య వెంకటనాధచార్య, పరిమళచార్య అనే బిరుదులను పొందారు.

తంజావురిలో యజ్‌క్షానారాయణ దీక్షీతులకు ఆయనకు మధ్వద్వైత సిద్దాంతలపై జరిగిన వాదానలో వెంకటనాధుడే విజయం పొంది భట్టచార్యులు అనే బిరుదును కైవసం చేసుకున్నారు. ద్వైత మధ్వ మహాపీఠానికి అస్ధాన విద్వాంసులుగా నియమితులయ్యారు. దేశ సంచారం ముగించుకొని స్వగ్రామానికి చేరిన ఆయనకు లక్ష్మీనారాయణ అనే కుమారుడు జన్మించారు. సుధీంద్రతీర్ధస్వామి మఠం ప్రతిష్టను వెంకన్నభట్టు నిలిపేవారు. సుధీంద్రతీర్ధస్వాములకు వయసు పైబడింది. ఆయన వారసుడుగా మఠం కీర్తిని నిలిపే ఉత్తరాధికారిగానియమించే ఆలోచన మొదలై సుధీంద్రతీర్ధస్వామి వారి దృష్టి వెంకణ్ణభట్టు మీద ఉండేది. కానిఆయన సంసారి. సన్యాస దీక్షకు సిద్ధము గాలేడు . అయినా తగిన వారసుడు వెంకన్నభట్టు అనే నిర్ణయానికి వచ్చి తంజావూరు తీసుకువెళ్ళి భార్యకు తెలియకుండా వెంకన్నభట్టుకు సన్యాసదీక్ష ఉప్పించి రాఘవేంద్రతీర్ధులు గా నామకరణము చేశారు. భర్త సన్యాసదీక్ష తీసుకున్న వార్త విన్న భార్య సరస్వతి ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఎన్నో కష్టాలను అనుభవించి బావిలో దూకి బలవన్మరణము చెందింది.

తంజావురు రాజు రాఘునాధ్‌ నాయకుడి ఆధ్వర్యంలో 1623 పాల్గుణ శుద్ద విదియనాడు మద్వపీఠ సంప్రదాయ ప్రకారం సన్యాస ఆశ్రమం స్వీకరించారు. గురుప్రణవ మంత్రం భోదించి శ్రీ సుదీంద్ర తిర్తులవారు ఆయనకు 1621 ధుర్మతినామ సంవత్సరంలో శ్రీ రాఘవేంద్ర యోగి దీక్షా నామాన్ని ఇచ్చారు. నాటి నుండి వెంకటనాధుడు శ్రీ రాఘవేంద్ర స్వామిగా మారారు. ఆ తరువాత మఠ సంప్రదాయల ప్రకారం ఉత్తరదేశ యాత్రకు వెళ్ళి ఎన్నో మహిమలను చూపారు. పలువురిని పాపవిముక్తులను చేశారు. కొన్నేళ్ళ తరువాత శ్రీ రాఘవేంద్రులు పవిత్ర తుంగభద్ర నది తీరాన కీ.శ.1671 విరోధినామ సంవత్సరం శ్రావణ బహుళవిధియ గురువారం సూర్యోదయంకు ముందు మూల రాముణ్ణ అధ్భూత గాణంతో పూజించి మంత్రాలయం బృందవనంలో సజీవ సమాది అయ్యారు. ఆ గానానికి ఆలయంలోని వేణుగోపాల స్వామి విగ్రహాలు సైతం నాట్య చేశాయి. అప్పటి నుండి స్వామి బృందవనం నుండి అనేక మహిమలను చాటుతూ కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా ,కొరికలు తీర్చే గురు సార్వభౌముడిగా దేశవ్యాప్తంగా పేరుపోందారు.

ఇలా రాఘవేంద్ర స్వామి నిత్యం భక్తుల పూజలందుకుంటూ భక్తుల హృదయాల్లో కొలువై ఉన్నాడు.

Exit mobile version