Home Unknown facts రాముడికి, హనుమంతుడికి నారదుడు ఎందుకు గొడవ పెట్టాడు?

రాముడికి, హనుమంతుడికి నారదుడు ఎందుకు గొడవ పెట్టాడు?

0

భక్తి గురించి మాట్లాడుకోవలసి వస్తే హనుమంతుడిని ఉదాహరణగా చెప్పుకుంటాం. అంతటి రామభక్తుడు కాబట్టే సాక్షాత్తు రాముడు తన గుండెల్లో కొలువున్నాడు అని గుండెని చీల్చి చుపించాడు. తన అణువణువునా రాముడు కొలువై ఉన్నాడు. రాముడు కూడా తన సోదరుడైన భరతుడితో సమానంగా అబిమానించాడు. వీరిద్దరి మధ్య ఉన్న భక్తి, ప్రేమ గురించి ఎన్ని గ్రంథాలు రాసిన తక్కువే!

Hanumanహనుమంతుడి ఆలయాల్లో చాలాసార్లు చూసుంటాం. అయితే నిశితంగా పరిశీలిస్తే ఆంజనేయుడు దేహమంతా సిందూరం ధరించినట్లు గమనించవచ్చు. ఇలా ఉండటానికి ఓ కథ ఉంది. ఓ రోజు సీతమ్మ తల్లి తన తలపై సిందూరం పెట్టుకుంటుంటే వీరంజనేయుడు చూస్తాడు. సిందూరం ఎందుకు పెట్టుకున్నారని సీత దేవిని అడుగగా.. శ్రీ రాముడికి ఎలాంటి ఆపద కలగకుండా దీర్ఘకాలం జీవించేందుకు గాను ఇలా చేస్తున్నానని సీత దేవి బదులిచ్చింది. అప్పటి నుంచి ఆంజనేయుడు కూడా శ్రీ రాముడిపై అపారమైన భక్తితో తాను కూడా దేహమంతా సిందూరం ధరించడం మొదలుపెట్టాడు. ఇంతటి భక్తి రాముడి మీద. అయితే హనుమంతుడు- రాముడితో గొడవపడిన సంగతి మీకు తెలుసా…?

రామాయణంలో హనుమంతుడి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న ఈ పవనపుత్రుడు శ్రీ రాముడునే తన హృదయంలో బంధించి భక్తిలో ఎవరికీ సాటిరానంత ఎదిగాడు. ముఖ్యంగా సముద్రాన్ని దూకి లంకను చేరి సీతమ్మ జాడను రాముడికి చేరవేశాడు. శ్రీ రాముడు.. రావణుడిని వధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ వీరాంజనేయుడు.. యుద్ధంలో లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోగా సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణుడు ప్రాణాలు నిలిపిన మాహా ధీశాలి. రాముడి పట్ల తనకున్న అపారమైన భక్తితో చిరంజీవిగా ప్రజల గుండెల్లో నిలిచాడు.

వీరిద్దరి ఆప్యాయత చూసి నారదుడు వీరిద్దరికి గొడవ పెట్టాలనుకున్నాడు. ఒకరోజు కాశీకి చెందిన ఓ రాజు శ్రీరాముడిని కలిసేందుకు వెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న నారద మహర్షి ఆ రాజుతో తనకు ఓ సహాయం చేయమని అడిగాడట. ఏమి సహాయం చేయాలని నారదునిని అడిగితే, మీరు ముందు మాట ఇవ్వండి చెప్తాను అంటాడు. ఆ కాశీ రాజు అప్పుడు సరే అంటాడు. ఆ కాశీరాజుకి ఇలా చెప్పాడు. మీరు అయోధ్య రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఒక్క విశ్వామిత్రుడిని తప్ప అందరినీ గౌరవించండి. నారదునికి ఇచ్చిన మాట ప్రకారం ఆ కాశీరాజు అక్కడికి వెళ్లాక.. అందరినీ గౌరవించి విశ్వామిత్రుడిని ఏ మాత్రం పట్టించుకోడు. దీంతో విశ్వామిత్రుడు అవమానాన్ని తట్టుకోలేక.. సూర్యస్తమయం ముగిసేలోపు ఆ కాశీరాజు తల నా కాళ్ల మీద ఉండాలని రాముడిని ఆదేశిస్తాడు.

శ్రీ మహా విష్ణువు అవతారమైన రాముడిని తన హృదయంలో నిలుపుకున్న హనుమంతుడు.. ఏకంగా తన స్వామితోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే స్వతహాగా రామభక్తుడైన యయాతి తాను ఎలాంటి పాపం చేయలేదని వీరంజనేయుడిని శరణు కోరతాడు. యయాతిని రక్షిస్తానని ఆంజనేయుడు అభయమిస్తాడు. మహర్షి ఆజ్ఞ ప్రకారం యయాతిని తనకి అప్పగించాలని హనుమంతుడిని శ్రీరాముడి ఆదేశిస్తాడు. యయాతికి మాటిచ్చానని, అవసరమైతే తన ప్రాణాన్ని అర్పిస్తానని యయాతిని మాత్రం ఇవ్వలేనని రాముడిని వేడుకుంటాడు పవనసుతుడు. ఇందుకు ఆగ్రహించిన శ్రీరాముడు.. హనుంతుడిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. అయితే ఆంజనేయుడు మాత్రం ఎలాంటి ఆయుధం లేకుండా రాముడిపై తనకున్న భక్తినే ఆయుధంగా చేసుకొని తన స్వామికి ఎదురునిలుస్తాడు.

ఎన్ని అస్త్రాలు సంధించినా.. చివరికి రామబాణాన్ని ప్రయోగించిన రామభక్తి ముందు నిలువలేకపోతుంది. ఈ విధంగా శక్తి కంటే భక్తికే ఎక్కువ బలముందని హనుమంతుడు నిరూపించాడు. చివరికి రాముడు, హనుమంతుడు కలిసి కాశీరాజుని కలిసి తనను విశ్వామిత్రుడి కాళ్ల దగ్గర పడేస్తారు. దీంతో శాంతించిన విశ్వామిత్రుడు తనని వదిలేస్తాడు. ఇదంతా తెలుసుకున్న నారదుడు వారి వద్దకు వెళ్లి.. ఇదంతా తానే చేశానని, రామ బాణం గొప్పదా.. రామ నామం గొప్పదా తెలుసుకునేందుకు ఇలా చేసానని చెప్పాడు.

 

Exit mobile version