శ్రీరాముడు పూజ చేసి రామసేతుని ప్రారంభించిన అద్భుత ఆలయం

0
9492

శ్రీరాముడు బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకొనుటకై కొన్ని చోట్ల శివలింగాలు ప్రతిష్టించి పూజలు చేసాడని పురాణాలూ చెబుతున్నాయి. ఇక్కడి ఆలయం లో విశేషము ఏంటంటే ఒకే ఆలయంలో రెండు శివలింగాలు, ఇంకా రామసేతు సైన్యం ఇక్కడే ప్రారంభం అయిందని స్థలం పురాణం చెబుతుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? అక్కడ రెండు శివలింగాలు ఎందుకు ఉన్నాయనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

shivalayaluతమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని రామేశ్వరంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వర లింగం ఇక్కడ ఉంది. హిందూ ఇతిహాసాల ప్రకారం శ్రీ రాముడు సేతువుని ఇక్కడే నిర్మించాడని తెలుస్తుంది. రామేశ్వరం శైవులకు, వైష్ణవులకు పుణ్యక్షేత్రం.

shivalayaluఇక ఆలయ పురాణానికి వస్తే, బ్రహ్మహత్య పాతకానికి ప్రాయోశ్చితంగా శ్రీరాముడు శివ పూజ చేయాలని నిర్ణయిస్తాడు. వెంటనే ఆంజనేయుడిని హిమగిరుల నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని కోరుతాడు. అయితే ఆంజనేయుని రాక ఆలస్యం కావడంతో సీతాదేవి సముద్ర ఇసుకతో సైకత లింగాన్ని తయారుచేసి పూజలు నిర్వహిస్తారు. ఆ కొంత సమయానికి హనుమంతుడు శివలింగాన్ని తీసుకురావడంతో దానికి పూజలు నిర్వహిస్తారు. ఈ విధంగా రెండు లింగాలు ఆలయంలో వుండటం విశేషం. హనుమ తీసుకువచ్చిన లింగాన్ని విశ్వలింగం అంటారు. మొదట దర్శనంతో పాటు పూజలను ఈ లింగానికి చేయాలని రామచంద్రుల వారి ఆదేశమని పురాణాలు వెల్లడిస్తున్నాయి.

shivalayaluఇక ఆలయ విషయానికి వస్తే, ఈ రామేశ్వరాలయాన్ని క్రీ.శ. 12 వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది. సింహద్వారం సుమారు 100 అడుగుల ఎత్తున ఉంటుంది. అయితే ఇచట సముద్రం లోతు చాలా తక్కువగా ఉంటుంది. మొదటగా సముద్ర స్నానం చేసిన తరువాత గుడిలో ఉన్న 22 బావులలో స్నానం చేయాలనీ చెబుతారు. ఈ ఆలయాన్నిద్రవిడ సంప్రదాయరీతిలో నిర్మించారు. ఆలయం చుట్టూ పెద్దదైన ప్రహారీ గోడ వుంది. గోపురాలు కూడా ఎక్కువ ఎత్తులో వున్నాయి. ఆలయంలోపల కారిడార్ లు వున్నాయి. ప్రపంచంలోనే అతిపొడవైన కారిడార్‌గా వీటికి విశిష్టమైన గుర్తింపు వుంది. ఆలయంలో ఉత్సవ మూర్తులను వుంచే మండపాన్ని చొక్కటన్‌ మండపం అంటారు. చదరంగం పట్టిక ఆకారంలో వుండటంతో దీనికి ఈ పేరు వచ్చింది.

shivalayaluరామేశ్వరం ద్వీపంలో అనేక తీర్థాలున్నాయి. రామనాథస్వామి ఆలయంలోనే 22 తీర్థాలున్నాయి. వీటిలో స్నానం చేయడం ఎంతో పుణ్యదాయకమని ఆలయచరిత్ర పేర్కొంటుంది. ఈ తీర్థాలు చిన్న చిన్న బావుల్లాగా వుండటం విశేషం. ఈ జలాలతో పుణ్యస్నానం చేస్తే తపస్సు చేసిన ఫలం వస్తుంది. ఆలయం బయట నుంచి కొంతదూరంలోనే సముద్రతీరం కనిపిస్తుంది. ఇక్కడ అలలు లేకుండా ప్రశాంతంగా వుండటం విశేషం. కాశీ యాత్రకు వెళ్లి అక్కడి గంగాజలాలను తీసుకువచ్చి రామేశ్వరంలోని సముద్రంలో కలిపితే కానీ కాశీయాత్ర పూర్తిచేసినట్టు అని పెద్దలు పేర్కొంటారు.

shivalayaluఈవిధంగా రాముడు పూజలు చేసిన ఈ శ్రీ రామనాధస్వామి ఆలయాన్ని సందర్చిండానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.

6 oke chota rendu shivalingalu akkade ramasethu prarbam mari ekkada a alayam