Home Unknown facts నాస్తికుడు బాబాకి ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం వెనుక గల కారణాలు తెలుసా ?

నాస్తికుడు బాబాకి ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం వెనుక గల కారణాలు తెలుసా ?

0

సాయిబాబా వెలసిన ఆలయాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. అయితే సాయిబాబా వెలసిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆలయం ఇదే అని చెబుతున్నారు. ఇంకా ఒక నాస్తికుడు బాబాకి ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం విశేషం. మరి ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఒక నాస్తికుడు బాబాకి ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం వెనుక గల కారణాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sai Babaముంబై మరియు పూనెలకు మధ్య ఉన్న రైలు మార్గంలో కనిపించే ఒక చిన్న గ్రామం భివ్‌పురి. ఈ గ్రామంలోనే సాయిబాబా వెలసిన మొట్టమొదటి ఆలయం ఉంది. ఇక్కడ 1916 లో ఈ ఆలయం నిర్మించినట్లు తెలుస్తుంది. కేశవ్‌ రామచంద్ర ప్రధాన్‌ అనే ఒక నాస్తికుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు.

ఇక కేశవ్‌ రామచంద్ర ప్రధాన్‌ అనే అతను, ఒక సాధారణ గుమాస్తా. ఈయన ముంబైలో నివసించే ఒక పార్శీ వర్తకుని వద్ద పనిచేస్తుండేవాడు. రామచంద్రకి ఒక స్నేహితుడు ఉండేవాడు. ఇక రామచంద్ర స్నేహితుడు తనతో కలిసి షిరిడీకీ రమ్మని ఎప్పుడు ప్రాధేయ పడుతుండేవాడు. కానీ చిన్నప్పటి నుంచి దేవుళ్లన్నా, మహత్యాలన్నా నమ్మకం లేని ప్రధాన్‌, స్నేహితుడి మాటలను లెక్కచేసేవాడు కాదు. అయితే చివరికి ఒకసారి షిరిడీకి వెళ్లేందుకు ఒప్పుకున్నాడు రామచంద్ర. కాకపోతే తాను సత్రంలోనే ఉండిపోతాననీ, బాబా ఉన్న మసీదులోకి అడుగుపెట్టననీ షరతు పెడతాడు. షరతుకి అంగీకరించిన స్నేహితుడు రామచంద్రని సత్రంలోనే ఉంచి తాను మాత్రం హారతి వేళ బాబాను దర్శించుకునేందుకు వెళ్ళిపోతాడు.

హారతి మొదలైంది. మధురమైన హారతి పాట, లయబద్ధమైన సంగీతమూ మసీదు నుంచి వినిపిస్తోంది. ఆ శబ్దాలకు అతని కాలు నిలువలేదు.అప్పుడు రామచంద్ర తనకు తెలియకుండానే నడుచుకుంటూ మసీదులోకి అడుగుపెట్టాడు . అడుగుపెట్టడమే కాకుండా అక్కడ ఉన్న బాబాని చూసి మైమరచిపోయాడు. ఆ మరపులోనే ఆయన వద్దకు వెళ్లి నిల్చొన్నాడు. రామచంద్రని చూసిన బాబా తన అలవాటు ప్రకారం దక్షిణను అడిగారు. ఆ సమయంలో తన యజమాని కోసం వసూలు చేసిన 2,500 రూపాయలను తీసి మారు మాట్లాడకుండా బాబా చేతిలో ఉంచాడు.

ఆ తరువాత రామచంద్ర తిరిగి తన సత్రానికి చేరుకున్నాక అసలు ఎం జరిగిందో అయన మనసుకి తోచలేదు. ఇక యజమానికి డబ్బు ఎలా ఇవ్వాలి, ఇప్పుడు ఎం చేయాలి అనే ఆలోచనల పడిన అయన ఒంట్లో బాగోలేదనీ, ఆరోగ్యం కుదుటపడగానే వచ్చి కలుస్తాననీ యజమానికి కబురు పంపాడు. కానీ అప్పుడు యజమాని నుంచి ఒక చిత్రమైన జవాబు తిరిగి వచ్చింది. కావల్సినంత విశ్రాంతి తీసుకుని ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తరువాతే రమ్మనీ, ఎందుకంటే ఏ రుణాన్ని వసూలు చేసేందుకు అయన తిరుగుతున్నాడో, దానికి రెట్టింపు వసూలు అయ్యిందనీ ఒక సందేశాన్ని పంపుతాడు.

ఆ జవాబు విన్నరామచంద్ర ఆశ్చర్యానికి గురై ఇదంతా కూడా బాబా మహిమేనని తెలిసొచ్చింది. ఈ సంఘటన జరిగిన తరువాత రామచంద్ర తరచూ షిరిడీ వెళ్లి వస్తుండేవాడు. ఇలా బాబా మహిమలు అన్ని అర్ధం చేసుకుంటూ బాబా కి భక్తుడిగా మారి తన స్వగ్రామంలో ఆలయాన్ని నిర్మించాడు.

ఇలా ఒక నాస్తికుడు బాబా భక్తుడిగా మారి భివ్‌పురి గ్రామంలో మొదట గా ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయమే బాబా వెలసిన మొదటి ఆలయంగా చెబుతుంటారు.

Exit mobile version