పార్వతి దేవి శివుడిని ఆలింగనం చేసుకున్న ఈ ఏకైక దేవాలయం

మన దేశంలో అత్యంత పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క ఆలయానిది ఒక్కో ప్రత్యేకత. కొన్ని దేవాలయాలు మానసిక ప్రశాంతతకు చిహ్నంగా ఉంటే…మరికొన్ని కోరికలను నెరవేర్చేవిగా ఉన్నాయి. అయితే కుంభకోణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుశక్తిమట్టం అనే గ్రామంలో శక్తివనేశ్వర దేవాలయం ఉంది.

Sakthivanesvara Templeమహిమాన్వితమైన శివుడు తాము ప్రేమించిన వారినే జీవిత భాగస్వామిని అందిస్తాడు. ఈ విధంగా ప్రేమించిన వారినే భాగస్వామిగా పొందిన ఎన్నో ఉదాహరణలు ఇక్కడున్నాయి. తాము అనుకున్నది జరుగుతుందని విశ్వాసం వల్ల అనేకమంది భక్తులు ఈ స్వామిని పూజించటానికి దేవాలయాన్ని సందర్శిస్తారు. ఇంతకీ ఈ దేవాలయం జీవితాన్ని కరుణించటానికి కారణం ఏమిటి? ఇక్కడ వున్న రహస్యం ఏమిటి? అనేటటువంటి ప్రశ్నలకు జవాబులు ఇక్కడ వున్నాయి.అదేమిటో తెలుసుకుందాం.

Sakthivanesvara Templeదేశంలో ఎన్నో ప్రశస్తి పొందిన దేవాలయాలున్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో సుమారు 1500 దేవాలయాలకు మించి ఉండటం విశేషం. ఒక్కో దేవాలయానికి దానికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే శక్తివనేశ్వర దేవాలయంలో శివుడు పార్వతి కలిసి శివలింగాకారంలో ఉంటారు. ఈ శివలింగం చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ దేవాలయం మాత్రం ఎక్కువ మంది భక్తులను ఆకర్షించే ఆలయంగా ప్రసిద్ది చెందింది. మామూలుగా శైవక్షేత్రాల్లో కంటే వైష్ణవ క్షేత్రాలకే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే శక్తివనేశ్వర ఆలయం మాత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది.

Sakthivanesvara Temple ఎందుకు తాకిడి ఎక్కువగా ఉంటుందని ఆలోచిస్తే, దానికి కారణాలున్నాయి. ప్రేమ విషయానికొస్తే ప్రేమికులు అనేక దేవాలయాలకు వెళ్లి తాము ప్రేమిస్తున్న వారితోనే వివాహాన్ని కరుణించు అని వేడుకోవడం సహజం. ఆ దేవాలయంలో స్వామి మనం ప్రేమించే వారితోనే, మనం ఇష్టపడే వారితోనే వివాహభాగ్యాన్ని ప్రసాదిస్తాడట. ఈ దేవాలయం స్థలపురాణం చూస్తే.. పార్వతి పెరిగి పెద్దదవుతుంది. ఒక రోజు శివుడిని చూస్తుంది. అతనే తన భర్త అని భావించి ప్రతి క్షణం మహాశివుని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పార్వతి శివుని ప్రేమలోనే తన్మయత్వంతో అతనినే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. పార్వతి శివుని పెళ్లి చేసుకోవాలని ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది. ఆ పార్వతి దేవి తపస్సు చేసిన స్థలమే ఇక్కడున్న దేవాలయంగా వెలసింది.

Sakthivanesvara Templeఆ తల్లి చేసిన తపస్సు యొక్క ఫలితమే ఆ స్థలం ఇంత ప్రసిద్ధిగాంచుటకు కారణమైంది. క్రమంగా తపస్సు తీవ్రత మరింత పుంజుకుంది. ఒకే కాలిపై నిలిచి కఠినమైన తపస్సును ఆచరిస్తుంది. ఇది గమనించిన శివుడు ప్రసన్నుడవుతాడు. ప్రసన్నమైనా కూడా ప్రత్యక్షం కాలేదు. పార్వతీ దేవి మాత్రం కదలకుండా అలాగే వుంది. చివరికి శివుడు తేజోమయమైన అగ్నిరూపంలో దర్శనమిస్తాడు.

Sakthivanesvara Temple శివుణ్ణి అలా దర్శించిన పార్వతి కొంచెం కూడా భయపడకుండా ఆ అగ్నిరూపాన్నే కౌగిలించుకుంటుంది. పార్వతీ దేవి ప్రేమకు మెచ్చిన మహాశివుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమై పార్వతిదేవిని వివాహం చేసుకుంటాడు.ఈ విధంగా ఆదిశక్తియైన పార్వతి దేవి తాను ఇష్టపడిన శివుని తన పతిగా దక్కించుకుంటుంది.

Sakthivanesvara Templeఅదే విధంగా ఈ దేవాలయానికి వచ్చి శ్రద్ధ, భక్తితో శివుని ఆరాధించినవారికి వారు ఇష్టపడి ప్రేమించినవారిని ప్రసాదిస్తారు. ఇక్కడి శివలింగం కథలో చెప్పినట్లుగానే కనపడుతుంది. అంటే ఇక్కడున్న శివలింగాన్ని పార్వతీదేవి గట్టిగా కౌగిలించుకున్నట్లుగా కనిపిస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR