శని దేవుడు శనీశ్వరుడు ఏ విధంగా అయ్యాడో తెలుసా ?

మనం శివాలయానికి వెళ్ళినపుడు బిల్వ దళం తీసుకువెళ్లడం సాంప్రదాయం శివపూజలో బిల్వ దళం ఎంతో ముఖ్యమైనది, శివుడికి ఇష్టమైనది. అలాంటి బిల్వ దళంతో శని దోషం ఉన్నవారు శివుడిని పూజిస్తే దోషనివారణ జరుగుతుందని సాక్షాత్తు ఈశ్వరుడే వరం ఇచ్చాడు. శని పట్టకుండా ఉండేందుకు ఈశ్వరుడు సైతం బిల్వ వృక్షాన్ని ఆశ్రయించాడు. ఒకనాడు శనిదేవుడు, శివుని దర్శించడానికి కైలాసానికి వెళ్లి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో స్తుతించాడు. అంతట శివుడు శనిదేవుని విధి ధర్మమును పరీక్షించాలని నీవు నన్ను పట్టగలవా? అని ప్రశ్నించాడు. అందుకు శని మరుసటి సూర్యోదయము నుండి సూర్యాస్తమయ కాలము వరకూ శివుని పట్టి ఉంచగలనని చెప్పాడు. అప్పుడు శివుడు మరుసటి రోజు ఉదయం బిల్వవృక్ష రూపం దాల్చి, ఆ బిల్వ వృక్షం లో ఇమిడిపోయి నివసించాడు.

Saneeswaruduమహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరు ముల్లోకాలను గాలించారు. వారెవ్వరికి ఆ మహేశ్వరుని జాడగానీ, శనిదేవుని జాడగానీ తెలియలేదు. వెతుకుతూ ఉండగానే సూర్యాస్తమయం అయింది. ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలం గడచిన తరువాత మహేశ్వరుడు బిల్వ వృక్షం నుండి సాకార రూపంగా బయటికి వచ్చాడు. మరుక్షణమే శనిదేవుడు అక్కడ ప్రత్యక్షమైయ్యాడు. “నన్ను పట్టుకోలేకపోయావే?” అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి “నేను పట్టడంచేతనే కదా, లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్ష రూపంలో ఇందులో దాక్కొని నివసించారు” అన్నాడు.

Saneeswaruduశనిదేవుని విధి నిర్వహణకు, భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు “ఈశ్వరుడినైన నన్నే కొద్దికాలం పట్టి, నాలోపలే నీవు నివసించి ఉండడం చేత నేటినుండి నీవు ‘శనీశ్వరుడు’ అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు. అప్పటి నుండి శని దోషమున్న వారు, ఆ దోషపరిహారార్ధము నన్ను బిల్వ పత్రాలతో పూజించిన దోష నివృత్తి జరుగుతుంది. బిల్వ పత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు’ అని అభయమిచ్చాడు.

Saneeswaruduబిల్వ పత్రానికి బోళా శంకరుడి పూజ కీ చాలా సన్నిహిత సంబంధం ఉంది! బిల్వ వృక్షం (మారేడు చెట్టు) అంటేనే వృక్ష రూపంలో ఉన్న పరమశివుడు అని పురాణాలు చెబుతున్నాయి. మూడు విభూతి రేఖలు నుదుటి మీద ధరించకుండా, రుద్రాక్ష మాల లేకుండా, బిల్వ పత్రం లేకుండా సాంప్రదాయం తెలిసిన పండితులు శంకరుడిని పూజించరు! అంటుంది శివ పురాణం. బిల్వ వృక్ష దర్శనం, దర్శించడం మాత్రం చేతనే పాపక్షయం అవుతుందనీ, బిల్వ వృక్షాన్ని పూజలో చందనాది ద్రవ్యాలతో పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుందనీ శ్రద్ధాళువుల నమ్మకం. మారేడు చెట్టు కనిపించినప్పుడు, దాని ఆకులు కోసి, వాటితోనే ఆ వృక్షాన్ని పూజించినా పుణ్యమే అంటారు.

Saneeswaruduమారేడు దళాన్ని సోమవారం , మంగళ వారం , ఆరుద్రానక్షత్రము, సంధ్యాసమయము, రాత్రి వేళలో, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు. కాబట్టి ఈ దళాలను ముందు రోజు కోసి, భద్రపరచిన దళాలతో పరమశివుని పూజిస్తారు. ఓ విశ్వాసం ప్రకారం చంద్రదర్శనం మరియు పౌర్ణమి రోజులలో బిల్వపత్రాలను తెంపకూడదు. ఈ రోజులలో వచ్చే ప్రకృతి సంబంధమైన మార్పులు బిల్వ వృక్షంపై తమ ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఇలాంటి నిషేధం ఉంది.

Saneeswaruduనిజానికి మారేడు చెట్టు చాలా సాధారణమైన వృక్షంగానే కంటికి కనిపిస్తుంది. మర్రి,, రావి చెట్ల లాగా మహావృక్షమూ కాదు. చెప్పుకోదగ్గ అందమైన పూలూ కనబడవు. తియ్యటి రుచికరమైన ఫలాలూ కాయవు. పోనీ అరుదైన వృక్షమా అంటే అదీ కాదు, ఆసియా ఖండంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ, అన్ని శీతోష్ణస్థితులు తట్టుకొని పెరిగే చెట్టు, నిరాడంబరతా, సాదాతనం, శీతోష్ణాలను ఓర్చుకోగల సహనం మొదలైన లక్షణాలలో మహాదేవుడికీ మారేడు చెట్టును శివాలయాలలో, దేవీ మందిరాల ప్రాంగణాలలో తప్పక పెంచుతారు. సాధారణంగా ఈ చెట్టును ఇళ్లలో పెంచరు. మారేడు ఆకులకూ, ఫలాలకూ ఓషధీ లక్షణాలున్నాయని, కఫ వాత సంబంధమైన దోషాలను ఇవి నివారిస్తాయనీ ఆయుర్వేద వైద్యవేత్తలు అంటారు.

Saneeswaruduబిల్వ పత్రాలు మూడు దళాల రూపంగా ఉండటం ఒక విశేషం అని చెప్పవచ్చు. ఆ త్రిదళ రూపం వల్ల వీటిని సత్వ రజస్తమోగుణాలకూ, సృష్టి స్థితి లయాలకూ, అకార ఉకార మకార సంయోగమైన ఓంకారానికీ, శివుడి త్రినేత్రాలకు, ఆయన త్రిశూలానికి ప్రతీకలుగా భావించుతారు. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ, త్రియాయుధం, / త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అంటూ ఆరంభమౌతుంది. మారేడు దళాల ప్రశస్తిని ఉగ్గడిస్తూ చెప్పిన బిల్వా ష్టకం. ఇలా ఒక వృక్ష జాతి ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే అష్టకం మారేడు గురించి తప్ప, మరే చెట్టు గురించీ కనబడదు.

Saneeswarudu‘మారేడు దళాన్ని శివ లింగానికి తాకిస్తే, ఆ స్పర్శ వల్ల కలిగిన స్పందనల ప్రభావం ఆ దళంలో చాలా సేపు నిలిచి ఉంటుంది. అలాంటి మారేడు దళం మీరు రోజంతా మీ జేబులో, హృదయానికి దగ్గరగా ఉంచుకొని చూడండి. అది మీ శారీరక స్థితినీ, మానసిక స్థితినీ కూడా ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంచుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR