శకటాసురుడు శ్రీకృష్ణుడి చేతిలోనే ఎందుకు మరణించాడు?

శ్రీ మహావిష్ణువు అవతారాలలో శ్రీకృష్ణావతారం ఒకటి. కృష్ణుడు చిన్నతనం నుండి చూపించిన లీలలు ఎన్నో ఉన్నాయి. మరి చిన్ని కృష్ణుడు శకటాసురుడిని ఎందుకు సంహరించాడు? ఆ రాక్షసుడికి ఉన్న శాపం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sri Krishnaపూర్వం హిరణ్యలోచనుడి కుమారుడు ఉత్కచుడు. ఇతడు చాలా భయంకర రాక్షసుడు. ఒక రోజు లోమశ మహర్షి ఆశ్రమంలోకి వెళ్లి ఈ రాక్షసుడు చెట్లను అన్నిటిని వేర్లతో సహా పికి పడేయడంతో ఇది చుసిన లోమశ మహర్షి ఆగ్రహం చెంది నీవు పాము కుబుసం విడిచిపెట్టినట్లు నీవు నీ శరీరాన్ని వదిపెడతావు అంటూ శపిస్తాడు. దీంతో గర్వం అణిగిన ఆ రాక్షసుడు తప్పు తెలుసుకొని క్షమించమని ఆ మునిని ప్రార్ధించగా అప్పుడు ఆ ముని వచ్చే జన్మలో జకటాసురుడిగా జన్మిస్తావు, అప్పుడు శ్రీమహావిష్ణువు పాద స్పర్శతో శాపం తొలగిపోతుందని చెబుతాడు.

Sri Krishnaఈ విధంగా మరు జన్మలో జకటాసురుడిగా జన్మించిన అతడిని కంసుడు శ్రీకృష్ణుడిని సంహరించమని ఆదేశిస్తాడు. అప్పుడు కంసుడి ఆజ్ఞతో గోకులంలోకి ప్రవేశించిన జకటాసురుడు బాలుని రూపంలో ఊయలలో ఆడుకుంటున్న శ్రీకృష్ణుడి పైన బండిని తోస్తాడు. అప్పుడు చిన్ని క్రిష్నయ్య తన కాలితో ఆ బండిని ఒక తన్ను తన్నడంతో ఆ బండి వెళ్లి జకటాసురుడికి తగిలి మరణిస్తాడు. ఇలా పూర్వం జనంలో శాపానికి గురైన ఆ రాక్షసుడు ఈ జన్మలో శ్రీకృష్ణుడి చేతిలో మరణించి మోక్షాన్ని పొంది వైకుంఠానికి చేరుకుంటాడు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR