శుభకార్యాలను ‘శ్రీ’కారంతో ఎందుకు మొదలుపెడతారు?

శ్రీకారం శుకారకం! శ్రీకారంతో ప్రారంభించిన ఏ కార్యమైనా జయం పొందుతుంది. క్షేమం కలుగుతుంది. ఏ కార్యక్రమమైనా ప్రారంభించడాన్ని శ్రీకారం చుట్టారు అని అంటూ ఉంటాం. శ్రీ అనే శబ్దానికి శోభ, శాంతి, లక్ష్మి మొదలైన అర్ధాలున్నాయి. మంత్రసాధనలో కూడా శ్రీం బీజానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. శ్రీ అనేది గౌరవ పురస్పరంగా వాడే శబ్దంగా గుర్తించాలి. అలాగే శ్రీని స్త్రీవాచకంగా గుర్తిస్తారు. సీతతో కూడిన రాముణ్ణి శ్రీరాముడు అనాలని కొందరు చెబుతారు.

శ్రీకారంఅయితే నిజానికి ఇది స్త్రీ శబ్దంగా వాడుతున్నాం కాని అది స్త్రీ, పురుష శబ్దాలకు అతీతమైనది. సర్వజగత్తు దేనితో నడుస్తుందో, ఏది తెలిస్తే మిగిలినవి ఏవి అవసరం లేదో అదే శ్రీ. ఆనందం, తేజస్సు, బ్రహ్మశక్తి కలయికనే శ్రీ. అంటే విశ్వంలో ఏది అంతిమమో, ఏది అనాదియో అదే శ్రీ. దాని గురించి తెలుసుకునే విద్యనే శ్రీ విద్య అంటారు.

శ్రీకారంశ్రీ విద్య అంటే అమ్మవారి ఉపాసకులు కూడా. అందరికీ ఆశ్రయాన్నిచ్చే శక్తి,లేదా అందరూ అంటే త్రిమూర్తులకు సైతం ఆశ్రయమిచ్చే శక్తిని శ్రీ అని అంటారు. ప్రస్తుతం సాధారణంగా గౌరవవాచకంగా, శుభప్రదమైనదిగా మాత్రమే శ్రీ కారాన్ని ఉపయోగిస్తున్నాం. కానీ ఇది ఒక బీజాక్షరం.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR