Home Unknown facts కుమారస్వామి జన్మ రహస్యం గురించి ఆశ్చర్యకర నిజాలు !

కుమారస్వామి జన్మ రహస్యం గురించి ఆశ్చర్యకర నిజాలు !

0

శివపార్వతుల కుమారుడు, వినాయకుని తమ్ముడు కుమారస్వామి. ఈ స్వామి దేవతలందరికీ సేనాధిపతి. ఈ స్వామి వాహనం నెమలి. పురాణాలలో ఈ స్వామి జననం గురించి ఒక కథ ఉంది. మరి కుమారస్వామి ఎలా జన్మించాడు? అయన జన్మ రహస్యం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Subramanya Swamy

పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కుమారుడి చేతిలోనే మరణం ఉండేలా వరాన్ని పొందుతాడు. అప్పుడు దేవతలందరు కూడా భయంతో బ్రహ్మ దగ్గరికి వెళ్లి పరిష్కారం అడుగగా, అప్పుడు బ్రహ్మ ఆలోచించి, హిమవంతుడు – మనోరమల కుమార్తైనా గంగ – పార్వతులకు తేడా లేదు కనుక ఆ శివతేజస్సును గంగలో విడిచిపెట్టాలని చెబుతాడు.

అప్పుడు దేవతలంతా కూడా గంగ దగ్గరికి వెళ్లి దైవ కార్యం కనుక నీవు అగ్ని దగ్గర నుండి శివతేజస్సును స్వీకరించాలి అని అనగా ఇది దైవ కార్యం కనుక దానికి గంగాదేవి సరే అని ఒక స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది. ఆ శివ తేజస్సును తట్టుకోలేని గంగ ఏం చేయాలనీ అగ్ని దేవుడిని ప్రార్ధించగా, కైలాస పర్వతం నుండి ఆ అగ్నిని భూమిమీదకు వదలమని చెప్పగా, ఆలా భూమి మీద పడిన తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం బంగారం, వెండి, రాగి, ఇనుము వంటి గనులు అన్ని ఏర్పడగా, అక్కడే ఒక తటాకంలో ఒక బాలుని ఏడుపు కూడా వినపడింది.

ఈవిధంగా జన్మించిన బాలునికి పాలు ఎవరు పడతారని దేవతలు చూస్తుండగా, పార్వతి అంశ అయినా కృత్తికలు ఆ బాలుడిని మా కుమారుడిగా పిలవాలని అడుగగా దానికి దేవతలు సరేనన్నారు. అప్పుడు ఆనందంతో ఆ పిల్లవాడికి కృత్తికలు పాలు పట్టారు. ఆరు ముఖాలతో పుట్టిన ఆ పిల్లవాడు ఆరుగురు కృత్తికల దగ్గర ఏకకాలంలో ఆరు ముఖాలతో పాలు త్రాగాడు. అందుకే ఈ స్వామికి షణ్ముఖుడు అనే పేరు వచ్చింది.

అంతేకాకుండా పరమశివుడి కుమారుడు కనుక కుమారస్వామి అని, శివుడికి ప్రణవర్దాన్ని వివరించాడు కనుక స్వామిమలై అనే పేరు వచ్చినది అని చెబుతారు. ఇలా జన్మించి శివుడి అజ్ణానుసారం కుమారస్వామి వెళ్ళి తారకాసురుని ఎదిరించాడు. ఈ విధంగా వారిద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుండగా, కుమారస్వామి తారకాసురుని మీద ప్రయోగించిన అస్త్రాలన్నీ విఫలం అవ్వడంతో కారణం ఏంటని అలోచించి ఆత్మలింగాన్ని కలిగి ఉన్నాడు కనుక శివుని ప్రార్ధించి ఒక దివ్యాస్త్రముని సంధించి తారకాసురుని మీద ప్రయోగించి సంహరించాడని పురాణం.

Exit mobile version