Home Unknown facts జూన్ 21 ఏర్పడే సూర్యగ్రహణం గురించి సంచలన విషయాలు

జూన్ 21 ఏర్పడే సూర్యగ్రహణం గురించి సంచలన విషయాలు

0

జూన్ 21న ఏర్పడనున్న సూర్యగ్రహణం 2020 లో తొలి సూర్యగ్రహణం. 2019 డిసెంబరు 26న సూర్యగ్రహణం ఏర్పడింది.. ఆ గ్రహణం వల్ల కొన్ని కీలక ప్రభావాలు ఏర్పడ్డాయి.. కరోనా వ్యాధి ప్రభలటం.. దేశాల మధ్య ఒకింత వైర వాతావరణం ఏర్పడ్డాయి.. ఇపుడు రానున్న సూర్యగ్రహణం వలన కూడా అలాంటి ఫలితాలే ఉంటాయని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు.. మరి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Surya Grahanamహిందు క్యాలెండర్ ప్రకారం ఈ సూర్యగ్రహణం జూన్ 21న మిథున రాశిలో ఏర్పడనుంది. ఇది జ్యేష్ఠమాసం కృష్ణపక్షం రోజు అవుతుంది… సూర్యగ్రహణం అనేది విశ్వంలో జరిగే ఖగోళ సంఘటన. భూమి, సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యగ్రహణానికి రాహువు కారణమవుతాడని చెబుతారు. శాస్త్ర పరంగా రాహువు, కేతువులను ఖగోళ వస్తువులుగా కాకుండా ఛాయ గ్రహాలుగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం రాహువు.. సూర్యుడిని మింగడం ద్వారా ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుందని చెపుతారు. ఈ గ్రహణ ఫలితంగా గ్రహాలు బలహీన పడి ఆ ప్రభావం మనుషులపై ఉంటుంది.. ఇది మానవుల యొక్క భౌతిక, మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది.. అంతే కాదు ఈ గ్రహణం వలన శుభ ఫలితాలు కూడా కలుగుతాయి..

జూన్ 21 న ఈ సూర్య గ్రహణం సంభవించినప్పుడు, శని, బృహస్పతి మరియు శుక్రుడు తిరోగమన కదలికలో ఉంటారు. గ్రహణం సమయంలో, తొమ్మిది గ్రహాలలో ఎనిమిది గ్రహాలు మిథున రాశిని ప్రభావితం చేస్తాయి. గ్రహణం వలన సూర్యుడు, చంద్రుడు, బుధుడు మూడు ప్రధాన గ్రహాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది… ఇవి చాలా సమస్యలను కలిగిస్తాయి. సూర్యుడు, చంద్రుడు అధికారంలో ఉన్న ప్రభత్వం, ప్రజలు, మత పెద్దలపై, బుధుడు కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారిపై ప్రభావాన్ని చూపిస్తారాణి చెప్తున్నారు పండితులు..

ఈ సూర్యగ్రహణం అమెరికా, కెనడా, నైరుతి ఇంగ్లాండ్, బెల్జియం, ఇటలీ, వేల్స్, దిగువ ఈజిప్టు, అర్మేనియా లాంటి దేశాల్లో మిథున రాశిలో ఏర్పడనుంది. స్పెయిన్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ధనుస్సు రాశిలో ఏర్పడనుంది… ఈ గ్రహణం వల్ల ప్రతికూల శక్తి ఉద్భవిస్తుంది. జూన్ 21 మధ్యాహ్నం 1.00 గంటల నుంచి 2.30 గంటల మధ్య ఈ నెగిటీవ్ ఎనర్జీ ఎక్కువ ప్రభావం చూపుతుంది. భారత్, చైనా, అమెరికా దేశాల్లో ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా అమెరికాలో రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతను పెంచుతుందని చెప్తున్నారు జ్యోతిష్యులు.. . అమెరికా అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ కుండలి సింహ రాశి అవటంతో ఇది మరింత తీవ్ర ప్రభావాల్ని చూపనుంది.. జూన్ 15-30 మధ్య కాలంలో అమెరికా అంతర్గత, బాహ్య సంఘర్షణలను ఎదుర్కొంటుంది. స్థానిక స్థాయిలో నేరాలు పెరుగుతాయి.. సాయుధ దళాల మోహరింపులకు దారితీస్తుంది.. అమెరికా ప్రభుత్వం సరిగ్గా పరిష్కరించకపోతే విస్తృతమైన జాతీయ సంక్షోభం తలెత్తుతుంది. ఈ సూర్యగ్రహణం అమెరికా-చైనా సంబంధాలపైనా ప్రభావాన్ని చూపనుంది.. ..

జ్యోతిషశాస్త్రం ప్రకారం చైనా జాతక పరిశీలనలో ఆరవపాదంనందు ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చైనా, అమెరికా రెండు దేశాలు శని ప్రభావానికి లోనవుతాయి. ఇది ఆర్థిక, రాజకీయ సంబంధాలకు అనుకూలంగా ఉండదని తెలుస్తుంది. ఇది సాధారణ ప్రజలకు సమస్యలను కలిగిస్తుంది. ఇక జూన్ 15 నుంచి అక్టోబరు చివరి మధ్య కాలంలో చైనా,అమెరికా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొననున్నాయి.

ఇక భారత్ లో సూర్యగ్రహణం ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే.. ఎక్కువగా భారత్ కోశాగారం ప్రభావం చూపే అవకాశముంది. నిధులకు సంబంధించిన వివరాలకు సంబంధించి, అభివృద్ధి, పరిమితులకు చెందిన కీలకాంశాలపై సమస్యలు వచ్చే అవకాశముంది. భారత కరెన్సీ రూపాయి విలువ మరింత తగ్గవచ్చని, ఇది బ్యాంకింగ్ పరిశ్రమకు ఎదురుదెబ్బని అంటున్నారు పండితులు.. ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ రాజకీయ నాయకుల ఆరోగ్యం క్షీణించే అవకాశముంది.

భారత్ లో ఈ సూర్యగ్రహణం మిథున లగ్నంలో ఏర్పడుటవలన వరదలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతుందని, అలాగే అమెరికా, కెనడా, ఇటలీ, ఈజిప్టు దేశాల్లో కూడా ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనవచ్చు అని చెప్తున్నారు.

 

Exit mobile version