ఉదయం ఎరుపు, మధ్యాహ్నం నలుపు, సాయంత్రం తెలుపు రంగులోకి మారుతున్న శివలింగం దర్శించారా ?

మన దేశంలో ఎన్నో గొప్పగొప్ప ఆలయాలు, ఆ ఆలయాలకు గొప్ప చరిత్ర. ఇప్పటికీ కొన్ని దేవాలయాల గురించి ఎన్నో అంతుపట్టని రహస్యాలు. అటువంటి వాటిలో కర్ణాటకలోని తలకాడు పుణ్యక్షేత్రం ఒకటి. రాణి శాపం కారణంగా ఆ ప్రాంతం ఎడారిగా మారిందని కథనం.

Unknown Facts About Thalakadu Templeతలకాడు పట్టణం క్రీ.శ. 16 వ శతాబ్దానికి ముందు ఎంతో ఆకర్షణీయ ప్రదేశంగా ఉండేది. సుమారుగా 30 పైచిలుకు ఆలయాలు ఉండేవి. అందులో ఐదు ప్రఖ్యాత శివాలయాలు ప్రత్యేకమైనవి. మైసూర్ ఒడయార్ల పాలనలో ఈ ప్రదేశం నాశనం చెందిందని చరిత్రకారుల అభిప్రాయం. తలకాడు ప్రారంభంలో గంగ వంశస్థులు, ఆ తర్వాత చోళులు పరిపాలించారు. చోళులను ఓడించి హోయసుల రాజు విష్ణు వర్ధనుడు రాజ్యాధికారం చేపట్టి పరిపాలనను గాడిలో పెట్టాడు.

Unknown Facts About Thalakadu Templeఆ తర్వాత వచ్చిన విజయనగర రాజులు కూడా చక్కటి పాలనను అందించారు. చివరగా మైసూర్ ఒడయార్ల పాలనలో ఈ ప్రాంతం చివరి దశ కు చేరుకొంది. 400 ఏళ్ల క్రితం మైసూరు రాజ్యాన్ని విజయనగర రాజులు పాలించేవారు. వారిలో ‘శ్రీ రంగరాయ’ ఒకరు. ఆయన ఏదో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ ఉండేవారట. ఆ వ్యాధి ఎలాంటి చికిత్సలకీ లొంగకపోవడంతో… శ్రీరంగరాయ, తలకాడుకి వెళ్లి అక్కడ వైద్యానాథుని ఆలయంలో ప్రార్థనలు నిర్వహించసాగారు. కానీ విధిలిఖితం! ఆయన వ్యాధి ఉపశమించకపోగా, ఆఖరి క్షణాలు దగ్గరపడ్డాయి. ఈ విషయం తెలిసిన ఆయన భార్య అలమేలమ్మ తను ఉంటున్న ‘శ్రీరంగపట్నం’ని వీడి, తలకాడుకి బయల్దేరింది. వెళ్తూ వెళ్తూ శ్రీరంగపట్నాన్ని ‘రాజా ఒడయార్‌’ అనే నమ్మకస్తునికి అప్పగించింది.

Unknown Facts About Thalakadu Templeరాణిగారి దుస్థిని గమనించిని ‘రాజాఒడయార్’, శ్రీరంగపట్నాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. అంతేకాదు! రాణిగారి వద్ద ఉన్న బంగారం మొత్తాన్నీ తీసుకురమ్మంటూ తన సైన్యాన్ని పంపాడు. రాజాఒడయార్‌ సైన్యం తన వెంటపడటం చూసిన రాణికి పట్టరాని ఆవేశం వచ్చింది. అటు భర్తనీ, ఇటు రాజ్యాన్నీ దక్కించుకోలేని దయనీయ స్థితిలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కావేరీ నదిలోని ‘మాలంగి’ అనే ప్రాంతంలో దూకుతూ… తన బాధనంతా ఒక శాపంగా మార్చిందని చెబుతారు.

Unknown Facts About Thalakadu Templeఇక మీదట తలకాడు క్షేత్రం ఇసుకలో మునిగిపోతుంది, నేను చనిపోయే మాళంగి ప్రదేశం ఒక సుడిగుండంగా మారిపోతుంది, రాజా ఒడయార్‌ వంశం నిర్వంశంగా మారిపోతుంది,’ అన్నదే ఆ రాణి పెట్టిన శాపం. ఆశ్చర్యకరంగా రాణి అలమేలమ్మ శాపం అని చెప్పే ఆ మూడు ఘటనలూ జరిగితీరాయి. చరిత్రలో ఓ వెలుగు వెలిగిన తలకాడు, ఇసుకతో మునిగిపోయి ఎడారిని తలపించసాగింది. పక్కనే కావేరీ నది ప్రవహిస్తున్నా, తలకాడులో ఉష్ణోగ్రతలు భరించలేనంతగా ఉంటాయి. ఇక మాలంగి అనే ప్రాంతంలో విపరీతంగా సుడిగుండాలు కనిపిస్తాయట. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన అంశం… ఒడయార్‌ రాజవంశం నిర్వీర్యం కావడం.

Unknown Facts About Thalakadu Templeదాదాపు 400 ఏళ్లుగా ఒడయార్ రాజవంశం సంతానలేమితో బాధపడుతూనే ఉంటోంది. ప్రతి రెండు తరాలకి ఒక తరంలో పిల్లలు కలగకపోవడం విభ్రాంతిని కలిగిస్తుంది. ఎప్పటికప్పుడు మైసూరు మహారాజులు తమ బంధువుల బిడ్డలను దత్తతు తెచ్చుకోవాల్సిన పరిస్థితి! ఒక పక్క వేల ఏళ్ల చరిత్ర, మరోపక్క రాణి అలమేలమ్మ గాథ… ఈ రెండింటినీ ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు తలకాడుకి చేరుకుంటూ ఉంటారు. అక్కడ ఇసుకమేడల మధ్య ఠీవిగా నిలబడిన వైద్యనాథుని ఆలయాన్ని దర్శిస్తారు.
వైద్యనాథ ఆలయంతో పాటుగా తలకాడులో మరో నాలుగు శివాలయాలనీ కలిపి పంచలింగాలని పిలుస్తారు. వీటిలో పాతాళేశ్వర లింగానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ లింగం ఉదయం వేళల్లో ఎరుపు రంగులో, మధ్యాహ్నం నల్లగా, సాయంవేళల తెల్లగా కనిపించడం విశేషం.

Unknown Facts About Thalakadu Templeతలకాడులోని ఐదు లింగాలనీ పూజించేందుకు ‘పంచలింగ దర్శనం’ పేరుతో ఘనంగా ఉత్సవాలని నిర్వహిస్తారు. కార్తీకసోమవారం, వైశాఖ నక్షత్రం రెండూ కలిసి వచ్చే సందర్భంలో పండితులు ఈ పంచలింగ దర్శనాన్ని ప్రకటిస్తారు. కర్ణాటకలోని మైసూరుకు 45కి.మీ ల దూరంలో వున్న తలకాడు పుణ్యక్షేత్రం వుంది. కావేరీనది ఒడ్డున ఈ ఆలయం కలదు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR