Home Unknown facts సంవత్సరానికి ఒకసారి గిరిజనులు జరుపుకునే అతిపెద్ద నాగోబా జాతర ఎక్కడ ?

సంవత్సరానికి ఒకసారి గిరిజనులు జరుపుకునే అతిపెద్ద నాగోబా జాతర ఎక్కడ ?

0

గిరిజనులు కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి సర్పదేవతని ఆరాధిస్తూ సంవత్సరానికి ఒకసారి జరుపుకునే అద్భుత జాతర నాగోబా జాతర. ఈ జాతర గిరిజనులు జరుపుకునే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందింది. మరి ఈ జాతర ఎలా మొదలైంది? ఈ జాతర ఎక్కడ జరుపుకుంటారు? ఈ జాతర విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Nagoba Jatara

తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం, కేస్లాపూర్ అనే గ్రామంలో నాగోబా అనే సర్పదేవాలయం ఉంది. నాగోబా దేవత గిరిజనుల ఆరాధ్యదైవంగా పూజలను అందుకుంటుంది. ఆదివాసీ గిరిజనులలో గోండు జాతికి చెందిన వారు ఈ జాతరను జరుపుకుంటారు. అయితే గోండు జాతిలోని మెస్రం వంశానికి చెందిన వారు జాతర వేడుకలను నిర్వహిస్తారు. ఇక్కడ నాగోబా జాతర ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజు నుండి మూడు రోజుల పాటు పూజలను నిర్వహిస్తారు.

ఇక ఈ జాతర ఎలా మొదలైందనే విషయానికి వస్తే, పూర్వం ఒక నాగభక్తుడు నాగరాజుని దర్శనం చేసుకోవడానికి నాగలోకానికి వెళ్ళాడు. అయితే నాగలోక ద్వారపాలకులు ఆ భక్తుడిని అడ్డుకోగా నిరాశతో వెనుతిరుగుతుండగా ఆ భక్తుడి చేతులు పొరపాటున నాగలోకద్వారాన్ని తాకుతాయి. ఒక సామాన్య మానవుడు నాగలోకద్వారాన్ని తాకినందుకు నాగరాజు ఆగ్రహానికి గురవ్వడంతో, ఆ భక్తుడు తనకి తెలిసిన పండితుడి దగ్గరికి వెళ్లి నాగరాజుని ఎలా శాంతిప చేయాలని అడుగగా, ఏడు కడువల ఆవు పాలు, ఏడు రకాల నైవేద్యాలు, 125 గ్రామాల నుండి పయనిస్తున్న పవిత్ర గోదావరి నీటిని తీసుకువచ్చి అభిషేకం చేయమనగా ఆలా చేయడంతో అతడి భక్తికి మెచ్చిన నాగరాజు ఈ గ్రామంలో శాశ్వతంగా నివాసం ఏర్పాటుచేసుకోగా, అప్పటినుండి ప్రతి సంవత్సరం నాగరాజుకు అభిషేకం చేయడం జరుగుతుందని పురాణం.

ఇక జాతర సందర్భంగా మోస్త్రం వంశానికి చెందినవారు ఈ గ్రామం నుండి కొన్ని గ్రామాల మీదుగా పాదయాత్ర చేస్తూ అక్కడ ప్రవహిస్తున్న గోదావరి నదికి చేరుకొని నదిలో పూజలు చేసి, నదిలోని నీటిని తీసుకొని తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఆ నీటితో ఆలయంలో నాగరాజుకు అభిషేకం చేయడంతో జాతర అనేది మొదలువుతుంది. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఇక్కడ గిరిజనుల సమస్యల కోసం దర్బార్ నిర్వహిస్తుంటారు. అయితే స్వాత్యంత్రం రాకముందు 1942 లో మొదటిసారిగా గిరిజనుల సమస్యలకొసం దర్బార్ నిర్వహించారు.

ఇక జాతరలో మేస్త్రం వంశానికి చెందిన వారు ఎన్ని వేలమంది వచ్చినప్పటికీ వారు వంట చేసుకోవడానికి మాత్రం 22 పొయ్యిలను మాత్రమే ఉపయోగిస్తారు. ఈ పొయ్యిలు కూడా ఆలయ ప్రాంగణంలోనే ఉంటాయి. మేస్త్రం వంశానికి చెందినవారు కాకుండా వేరే వంశస్థులు ఎక్కడైనా వంట చేసుకోవడానికి ఉంటుంది. ఇలా ఎంతో అద్భుతంగా పూర్తిగా గిరిజనుల సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు ఇక్కడి గిరిజనులే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, చత్తీ్‌సగడ్‌, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకి చెందిన గిరిజనులు వేల సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version