శివుడు బాబా వైద్యనాథ్ గా దర్శనమిచ్చే ఆలయ విశేషాలు

హిందూ దేవాలయాలు అత్యంత పురాతనమైనవి. వాటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు చెప్పుకోదగినవి. దక్ష యజ్ఞం సరంభానికి పిలవని పిలుపుగా పుట్టింటికి వెళ్ళిన సతీ దేవి అవమానానికి గురై యజ్ఞ గుండంలో దూకి ప్రాణత్యాగం చేసింది. దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తరువాత సర్వేశ్వరుడు సతీ దేవి శరీరాన్ని భుజాన వేసుకొని విరాగిగా తిరగ సాగారు.

వైద్యనాథ్ ఆలయం లయకారుని తిరిగి ఇలలోనికి తేవడానికి శ్రీ మహా విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీ దేవి శరీరాన్ని ఖండించారు. ఆ శరీర భాగాలు భువిలోని వివిధ ప్రాంతాలలో పడినాయి. అవే శక్తి పీఠాలుగా పేరొందాయి. వైద్యనాధ్ ధామం కాకుండా జ్యోతిర్లింగాలతో పాటు శక్తి పీఠాలుగా గుర్తింపు పొందిన క్షేత్రాలు వారణాశి మరియు శ్రీశైలం. ఇక్కడ అమ్మ వారి హృదయ భాగం పడింది. అందువలన గతంలో ‘హర్ష పీఠ’గా పిలిచేవారు. ఇక్కడ శ్రీ జయ దుర్గా దేవి అమ్మవారి ఆలయం శ్రీ వైద్యనాధ స్వామి ఆలయానికి ఎదురుగా ఉంటుంది.

వైద్యనాథ్ ఆలయం గతంలో ఇవి అరవైనాలుగు ఉండేవి. కలియుగానికి పన్నెండుగా మిగిలాయని తెలుస్తోంది. వీటినే ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పిలుస్తుంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు వరుసగా సోమనాథ్(గుజరాత్), శ్రీశైలం (ఆంధ్రప్రదేశ్), మహాకాలేశ్వరం (ఉజ్జయిని, మధ్య ప్రదేశ్), ఓంకారేశ్వర్ (మధ్య ప్రదేశ్), కేదారనాథ్ (ఉత్తరా ఖండ్), భీమేశ్వరం(పూణే, మహారాష్ట్ర), వారణాశి (ఉత్తర ప్రదేశ్), త్రయంబకేశ్వరం (నాసిక్, మహారాష్ట్ర), నాగేశ్వరం (ద్వారకా, గుజరాత్), రామేశ్వరం (తమిళనాడు ), గృహ్నేశ్వరం (ఎల్లోరా, మహారాష్ట్ర), మరియు వైద్యనాధ్ ధామం ( దేవ ఘర్, ఝార్ఖండ్). మిగిలిన పదకొండు క్షేత్రాలలో లేని కొంత సందిగ్థ పరిస్థితి వైద్యనాథ్ ధామం స్థల నిర్ణయం విషయంలో నెలకొని ఉంది.

వైద్యనాథ్ ఆలయం మహారాష్ట్రలోని పర్లిలో గల ఆలయాన్ని వైద్యనాథ్ ధామంగా పిలుస్తారు. దానినే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటని స్థానికులు వాదిస్తుంటారు. అయితే శివపురాణం , భవిష్యపురాణం , మత్సపురాణం, దేవీ భాగవతంతో పాటు జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆది శంకరులు రచించిన శ్లోకాల ఆధారంగా ఝార్ఖండ్ లో ఉన్న దానినే సరి అయిన ఆలయంగా నిర్ణయించడం జరిగింది.

వైద్యనాథ్ ఆలయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరో బైద్యనాథ్ ఆలయం ఉండటం విశేషం. అక్కడి వారు దానిని ద్వాదశ లింగ రూపంగా భావిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో భాగం కాకపోయినా ఈ రెండూ కూడా మహిమాన్విత క్షేత్రాలే. ఝార్ఖండ్ మరియు మహారాష్ట్రలలోని ఈ రెండు ఆలయాల పురాణ గాథ ఒకటే కావడం మరో విశేషం.

వైద్యనాథ్ ఆలయం బైద్యనాథ్ పుణ్యక్షేత్రం జార్ఖండ్ మరియు మహారాష్ట్రలో ‘దియోఘ్’ లో ఉంది. కట్నీపూర్ దగ్గరలో ఉన్న ఈ క్షేత్రంలో శివుడు ‘బాబా బైద్యనాథ్’ గా దర్శనమిస్తాడు. ఈ రెండింటి నేపథ్యమూ రామాయాణాంతర్గత రావణాసురిడి కథతో ముడిపడి ఉంది. ఈ లింగాన్ని పూజించే వారికి వ్యాధులు నయం కావడం వల్ల శ్రీ వైధ్యనాథేశ్వరుడిగా పిలుస్తున్నారు. వైధ్యనాథుడే ,అమృతేశ్వరుడు . అమృతమధనానంతరము ధన్వంతరిని, అమృతమును ఈ లింగములో దాచారని, ఈ లింగాన్ని స్పృశించిన భక్తులకు అమృతము లభించుననే నమ్మకం భక్తులలో ఉంది.

వైద్యనాథ్ ఆలయం జ్యోతిర్లింగాల్లో ఒకటైన బైద్యనాథ్ ఆలయం ఒక రాత్రిలోనే నిర్మించారట. ఈ ఆలయానికి ఉత్తరదిశలో ఉన్న శివగంగ చెరువులో స్నానాలు ఆచరించి శ్రీ వైద్యనాథున్ని దర్శించుకుంటారు. శ్రీ వైద్యనాథ్ ఆలయం ఎత్తుగా రాతితో నిర్మించి ఉంది. లోపలికి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంటుంది. ఈ ఆలయం శిఖరం అంతా బంగారు తొడుగుతో మెరుస్తుంటుంది. బైద్యనాథ్ ఆలయ ప్రాంగణమంతా చాలా విశాలంగా ఉంటుంది.

వైద్యనాథ్ ఆలయం గిధవుర్’ వంశ రాజు ‘రాజా పురాణ సింగ్’ ప్రస్తుత ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు. నివాస, వ్యాపార సముదాయాల మధ్యన ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటు ఇక్కడ 21 దేవాలయాలు కలిసి ఒక సముదాయంగా వున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్యులవారు , ద్వజస్తంభం, నంది మండపం, కేదారేశ్వర, ఓంకారేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, భీమశంకరుడు, కుబేరుడు నరసింహస్వామి, దత్తాత్రేయ స్వామివారు, నాగనాద్ మందిరం కూడా ఉన్నాయి. నాగనాద్ మందిరం సమీపంలో శ్రీ వీరభద్ర స్వామి మందిరం కూడా ఉంది.

వైద్యనాథ్ ఆలయం గర్భాలయం బయట వినాయకుడు, కుడివైపు తుల్జాభవానీ, రేణుకామాత దర్శనమిస్తారు. గర్భగుడిలో జయదుర్గ త్రిపుర సుందరీదేవీ అమ్మవారుగా దర్శనమిస్తారు. ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఒక్కడ సతీదేవి హృదయం పడిందని అంటుంటారు. గర్భగుడిలో రెండు అడుగుల శివలింగం ఉంటుంది. శివలింగం పక్కన పార్వతీదేవి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR