వారాహి అమ్మవారి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

వారాహి దేవి అమ్మవారి శక్తి స్వరూపాలలో ఒకరుగా చెప్తారు.. ఈమెను సప్త మాతృకలలో ఒకరుగా, అలాగే దశమహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితాసహస్రనామంలో కూడా ఉంటుంది. ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయమె ఉండదనీ, అపార జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ చెప్తారు.. వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలనూ పఠిస్తే సకలజయాలూ సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకం. మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికర విషయాలను మనం ఇపుడు తెల్సుకుందాం..

Lalitha Deviవారాహీ దేవి నల్లని కాంతితో, వరాహముఖంతో, మహిష వాహనం గలదై పెద్దపొట్టతో ఎనిమిది చేతులలో శంఖం,చక్రం,నాగలి,గునపం,అభయ వరదాలతో ఉంటుంది. ఈమెను లక్ష్మీ దేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహ స్వామి అర్ధాంగి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాణి, ఇలా వరాహ స్వామి నుండి వారాహి ఉద్భవించింది.. దేవీ మాహాత్మ్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే, ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుడ్ని సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. ఈమె వాహనం గేదెగా తెలుపబడింది. అయితే రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు, గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. తాంత్రికులకు ఇష్టమైన దేవత.. వారాహి దేవి మందిరాలలో ముఖ్యంగా , తాంత్రిక పూజ జరగపడం సర్వసాధారణం. వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు. ప్రతి మనిషిలోనూ వారాహీశక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర, స్వాధిష్ఠాన , మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది .

Varahi Deviవారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్టించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనో, తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, వారణాసి, మైలాపూర్లో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. వారాహి అమ్మవారు వారణాసికి గ్రామ దేవత. వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ రక్షగా ఉండే దేవత.. ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది. ఈ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడానికి వీలు పడదు. ఈ ఆలయం ఓ భూ గర్భ గృహంలో ఉంటుంది. తెల్లవారుజాము 4.30 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ సమయంలో గ్రామ దేవత అయిన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెలుతుందంట! అందువల్లే ఆ సమయంలో మాతరమే దర్శనానికి అనుమతిస్తారు. మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసి వేసి ఉంటారు. ఇక ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళితే నేల పై రెండు రంధ్రాలు కనిపిస్తాయి. వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి.. ఒక రంధ్రంలోనుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాద ముద్రలు కనిపిస్తాయి. వారాహి అమ్మవారు ఉగ్రరూపిని కాబట్టే ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాటు చేసినట్లుగా చెప్తారు.. ‘ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్ర కళ, లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది. ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది. ఈ శక్తి దుష్ట శక్తులను అనచడానికి వీలుగా రూపొందించబడింది. ఇలా ఉగ్రరూపధారిణి అయినా అమ్మవారిని చూడటంకేవలం ఉపాసన బలం ఉన్నవారికి మాత్రమే వీలవుతుందని, అది కూడా అమ్మవారు గ్రామ సంచారంకై వెళ్లినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతారు. వారణాసిలోని దశాశ్వమేథ ఘాట్ కు ఎడమ వైపున ఉంటుంది ఈ వారాహి అమ్మవారి ఆలయం..

Varahi Deviఈ వారాహి దీవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైన త్వరగా పూర్తీ అవుతాయి అని చెప్తారు.. అఘోరాలు తాంత్రిక సిద్ధులకై రాత్రివేళల్లో ఈ అమ్మవారిని పూజిస్తారు..

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR