మహా శ్మశానం అని ఈ ఆలయాన్ని ఎందుకు అంటారో తెలుసా ?

0
2587

సతీదేవి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలు శక్తిపీఠాలుగా వెలిసాయి. వాటినే అష్టాదశ శక్తిపీఠాలు పీఠాలు అంటారు. శక్తిపీఠాల్లో కాశి విశాలాక్షిదేవి శక్తిపీఠం కూడా ఒకటి. మరి ఈ శక్తిపీఠం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Holy Kaashi Peetham

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, వారణాసి జిల్లాలో కాశి విశ్వేశ్వరాలయం ఉంది. ఈ ఆలయంలో శివుడు కాశి విశ్వేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడే విశాలాక్షిదేవి ఆలయం కూడా ఉంది. ఈ ప్రాంతంలో సతీదేవి మణికర్ణిక ఈ ప్రాంతంలో పడిందని చెబుతారు.విశాలాక్షి అంటే విశాలమైన కన్నులు కలదని అర్ధం. ఇక అష్టాదశ శక్తిపీఠాలలో ఇది 17 వ శక్తిపీఠంగా చెబుతారు. అయితే హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో కాశి ఒకటి. ఇక్కడ ప్రవహించే ఎంతో పవిత్రమైన గంగానదిలో వరుణ, అసి అనే రెండు నదులు కలుస్తాయి. దీంతో దీనికి వారణాసి అనే పేరు వచ్చిందని చెబుతారు.

Holy Kaashi Peetham

ఈ ఆలయ విషయానికి వస్తే, విశాలాక్షిదేవి ఆలయం చాలా చిన్నగా ఉంటుంది. గర్భగుడిలో అమ్మవారు భక్తులకి రెండు రూపాలలో దర్శనమిస్తుంటుంది. అర్చామూర్తి, స్వయంభువు రెండు రూపాల్లో అమ్మవారు ఉండగా భక్తులు ముందుగా అర్చామూర్తిని, ఆ తరువాత స్వయంభువు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు.

Holy Kaashi Peetham

అన్నపూర్ణ, విశ్వేశ్వర ఆలయాలు రెండు వీధులుగా ఉండగా ముక్తిని కోరుకునే భక్తులు వారణాసి లో మరణించి మోక్షాన్ని పొందాలని భావిస్తారు. ఎందుకంటే కాశీలో మరణించినవారు సరాసరి ఈశ్వర సాన్నిధ్యాన్ని చేరుకుంటారని ప్రతీతి. ఇక్కడ ఎప్పుడు శవ దహనం జరుగుతూనే ఉంటుంది. అందుకే ఈ ఆలయాన్ని మహా శ్మశానం అని కొందరు పిలుస్తారు. ఇక సాక్షాత్తు పార్వతీపరమేశ్వరులు ఈ నగరంలో నివసించారని, శివుడి త్రిశూలం పైన కాశీనగరం నిర్మించబడిందని పురాణం. శివుడికి ఈ ప్రాంతం అత్యంత ప్రీతి పాత్రమైనదని చెబుతారు. హిందువులు పవిత్రంగా భావించే ఏడు నగరాలలో వారణాసి ఒకటి. ఈ వారణాసి నగరం సుమారు 3 వేల సంవత్సరాల నుండి ఉన్నదని కొందరి భావన.

Holy Kaashi Peetham

ఇంతటి పుణ్య ప్రదేశం అయినా ఈ వారణాసిని చనిపోయేలోపు ఒకసారి అయినా దర్శించి పుణ్యం కట్టుకోవాలని భక్తులు భావిస్తుంటారు.

SHARE