Home Unknown facts ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైనా యాదాద్రి లో నరసింహస్వామి ఎలా వెలిసాడు?

ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైనా యాదాద్రి లో నరసింహస్వామి ఎలా వెలిసాడు?

0

పురాణాల ప్రకారం నరసింహస్వామి తేత్రాయుగంలో ఐదు రూపాల్లో సాక్షాత్కారించాడు. అవి జ్వాలా నరసింహుడు, యోగ నారసింహుడు, గండ బేరుండ నారసింహుడు, ఉగ్ర నారసింహుడు, శ్రీ లక్ష్మి నారసింహ రూపాల్లో యాదమహర్షికి దర్శనం ఇచ్చాడు. మరి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైనా యాదాద్రి లో నరసింహస్వామి ఎలా వెలిసాడు? ఎంతో ప్రతిష్టాత్మకంగా పుననిర్మిస్తున్న ఆలయ పనులు ఎలా ఉన్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా లోని భువనగిరి దగ్గరలో యాదగిరిగుట్ట మీద శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవాలయం ఉంది. నరసింహ అవతారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి నరసింహుడు వెలసిన పవిత్రక్షేత్రం యాదగిరి.

పురాణానికి వస్తే, హిరణ్యకశిపుని వధించిన తర్వాత ఉగ్రరూపం చల్లారని నరసింహస్వామిని బ్రహ్మాది దేవతలు,మహర్షులు ప్రసన్నుని చేసుకోలేకపోయారు. వారంతా లక్ష్మీదేవిని సేవించి ఆయనను శాంతపరచవలసినదిగా ప్రార్ధించారు. లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామి శాంతించిన క్షేత్రమిది. అందుకే ఇచ్చట ఆలయములో స్వామిపేరు శ్రీ లక్ష్మి నరసింహస్వామి అని అంటారు.

యాదగిరిగుట్ట కి సంబందించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలోని ఒక ఋషి కుమారుడు అయిన రుష్యశృంగుడు యొక్క కుమారుడు అయిన యాదురుషి. అతనినే యాదర్షి అని కూడా అంటారు. చిన్నప్పటినుండి నరసింహ భక్తుడైన అతడికి ఆ స్వామిని దర్శించాలని బలమైన కోరిక ఉండేదంటా. నరసింహుణ్ణి అన్వేషించడానికి అడవులు,కొండలు,కోణాలు తిరిగి ప్రస్తుతం ఉన్న యాదగిరి అరణ్య ప్రాంతానికి చేరుకొని బాగా అలసిపోయి ఒక రావి చెట్టు క్రింద నిద్రించగా కలలో ఆంజనేయ స్వామి కనిపించి నీ పట్టుదల నాకు నచ్చింది,నీకు తోడుగా నేను ఉంటాను కఠినంగా తపస్సు చేస్తే స్వామి తప్పక ప్రత్యక్షమవుతాడని చెప్పాడంటా.

నిద్రలేచిన యాదర్షి అక్కడే తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్ల తర్వాత ఉగ్ర నరసింహుడు ప్రత్యక్షమయ్యాడట. అప్పుడు యాదర్షి దేవుడిని తేజస్సు చూడలేక శాంత స్వరూపముతో కనిపించమని కోరాడట. అప్పుడు లక్ష్మి సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకో అని అడగగా,నీ దర్శనం కోసం ఇంత కఠినమైన తపస్సు సామాన్యులు చేయలేరు అందుకే నీవు శాంత రూపంతోనే ఇక్కడ కొలువై ఉండిపోవాలని కోరగా,అప్పుడు కొండా శిలమీద స్వామి ఆవిర్భవించాడు. అలా యాదర్షి తపస్సు వలన మనం ఈరోజు యాదగిరి గుట్టలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామినీ దర్శించుకుంటున్నాము.

ఇక తెలంగాణ వచ్చిన తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టారు. యాదగిరి చుట్టూ ఉన్న 8 గుట్టలను కలిపి నవ గిరులుగా తీర్చిదిద్దనున్నారు. గుట్టపైన 30 నరసింహుని రూపాలు ప్రతిష్టించనున్నారు. ప్రస్తుతం అర ఎకరంలో ఉన్న ప్రధాన ఆలయ స్థానంలో రెండు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో కొత్త ఆలయాన్ని కడుతున్నారు. ఇలా ఎంతో మహిమాన్వితమైన యాదగిరి గుట్టను తెలంగాణ తిరుపతిగా మహాదివ్య పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు