సప్తఋషులు నివసించిన యోగనరసింహస్వామి ఆలయం ఎక్కడ ?

0
3302

దేశంలో ఉన్న ఒక్కో ఆలయంలో ఒక్కో విశిష్టత అనేది ఉంటుంది. పురాతన కాలం నుండి ఈ ఆలయానికి వచ్చి ఒక ఘటిక కాలంలో స్వామివారి ధ్యానం చేస్తే ఆ స్వామి మోక్షం ప్రసాదిస్తాడని పురాణాలూ చెబుతున్నాయి. మరి మోక్షాన్ని ప్రసాదించే ఆ స్వామివారు ఎవరు? ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయంలోని ప్రత్యేకతలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ghatikaతమిళనాడు రాష్ట్రం, వెల్లూరు జిల్లా, వాలాజపేట ప్రాంతంలో ఘటికాచలం అనే దేవాలయం ఉంది. ఈ పుణ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్య తిరుపతులలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రహ్లద వరుధుడైన శాంత నరసింహస్వామి పద్మాసనంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. ఇక్కడ కొలువ ఉన్న స్వామివారిని అక్కరక్కన్, అమ్మవారిని అమృతవల్లి తాయార్ అని పిలుస్తారు.

ghatikaఘటిక అంటే సుమారు 20 నిముషాల కాలం అని అర్ధం. అయితే ఈ ఆలయంలో ఒక్క ఘటిక కాలంలో స్వామిని ధ్యానం చేస్తే చాలు మోక్షం ప్రసాదిస్తాడని పురాణాలూ తెలియచేస్తున్నాయి. అందువల్లనే ఈ క్షేత్రానికి ఘటికాచలం అనే పేరు వచ్చినది. అయితే ఇక్కడ ఉన్న రెండు కొండలలో పెద్ద కొండపైన యోగనరసింహస్వామి ఆలయం ఉంది. అయితే పూర్వం ఈ క్షేత్రంలో సప్తఋషులు నివసించేవారని, నరసింహస్వామి ఇక్కడ నివసించే మునులకు ప్రత్యేక్షమయ్యాడని తెనాలి రామకృష్ణ విరచితమైన ఘటికాచల మహత్యము వలన తెలుస్తుంది.

ghatikaఈ ఆలయం గ్రహపీడితులకు, దీర్ఘవ్యాధి గ్రస్తులకు, మానసిక రోగులకు ఈ క్షేత్రం విశేష ప్రార్థన స్థలంగా భాసిల్లుతున్నది. ఇక ఇక్కడ కొలువైన స్వామి వారు ఒకసారి ఆంజనేయస్వామికి ఇచ్చట ప్రత్యేక్షం అవ్వడం వలన చిన్న కొండపైన శ్రీ యోగాంజనేయస్వామి ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం లో కొలువై ఉన్న ఆంజనేయస్వామి వారు చతుర్భుజములతో, శంఖు చక్రములతో, యోగముద్రతో భక్తులకి దర్శనం ఇవ్వడం విశేషం.

ghatikaఇక ఈ ఆలయ ఉత్తరముఖంలో, యోగాంజనేయస్వామి పడమరముఖంలో ఉండి శ్రీ యోగానంద నరసింహస్వామిని కనులార చూస్తున్నట్లు కనిపించడం ఇక్కడ ప్రత్యేకత. ఈ స్వామివారిని కలియన్, పేయాళ్వార్ లు కీర్తించారు. ఇక్కడ యోగనాజనేయస్వామి ఆలయ గోడకు ఉన్న చిన్న రంద్రం ద్వారా యోగానంద నరసింహ ఆలయ గోపుర దర్శనం చేసుకోవచ్చు.
ఇలా ఎంతో మహిమ గల ఈ ఆలయానికి తమిళనాడు రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఎప్పుడు ఎక్కువ సంఖ్యలో ఆ స్వామి దర్శనం కోసం వస్తుంటారు.

ghatika