సత్య యుగం నుండి జాంబవంతుడు నివసించిన గుహలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలుసా?

పురాణాల్లో భల్లూకమైన జాంబవంతుని చిరంజీవిగా చెబుతారు. త్రేతాయుగంలో రామదండుకి సహాయపడిన జాంబవంతుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడితో యుద్ధం చేసాడని, ఆ యుద్ధంలో ఓడిపోయి తన కూతురైన జాంబవతిని కృష్ణుడికిచ్చి వివాహం చేసాడని కథనం. అయితే సత్య యుగం నుండి కూడా జాంబవంతుడు ఈ గుహల్లోనే నివాసం ఉండేవాడట. మరి ఈ పురాతన గుహలు ఎక్కడున్నాయో తెలుసుకుందామా…

Zambavanthu Cavesసోమనాథ్ నుంచి ద్వారకకి వెళ్లే రోడ్డు మార్గంలో ఈ జాంబవంతుని గుహలు ఉన్నాయి. ఈ గుహలు పోర్ బందర్ 17 కి.మీ. దూరంలో రాజ్ కోట్ కి వెళ్ళే రహదారిపై రణ్ వావ్ గ్రామంలో వున్నాయి. ఊరికి దూరంగా కొండల మధ్య విశాలమైన ప్రదేశంలో వున్నాయి. ఇక్కడే శ్రీకృష్ణుడు జాంబవంతుల యుద్ధం జరిగినట్లు, జాంబవతిని వివాహం చేసుకున్న ప్రదేశం కూడా ఇదే అని చెబుతారు.

Zambavanthu Cavesకారణజన్ముడైన జాంబ వంతుడు యుద్ధం చేసి రాముడి చేతిలో ఓడిపోవాలని కోరుకుంటాడు. త్రేతా యుగంలో రామునితో యుద్ధం చేయాలనే కోరిక వున్న జాంబవంతుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడితో యుద్ధం చేసి తన చిరకాల వాంఛ నెరవేర్చుకుంటాడు. అడవిలో సింహము నోటిలో వున్న మణిని చూసి ఆ సింహమును చంపి ఆ మణిని తీసుకుని తన కూతురు జాంబవతికి ఆడుకోవటానికి ఇస్తాడు. తనపై మోపబడిన నింద రూపుమాప డానికై ఆమణి కోసం వెతుకుతూ శ్రీకృష్ణుడు ఈ గుహ వద్దకు వచ్చి జాంబవంతునితో యుద్ధం చేస్తాడు.

Zambavanthu Cavesమణికోసం వచ్చింది సాక్షాత్తు శ్రీరాముని అవతారమేనని గ్రహించని జాంబవంతుడు ఇరవై ఒక్క రోజులపాటు నిర్విరామంగా యుద్ధం చేసాడు. చివరకు ఇరవైఒక్కరోజుల తరువాత ఈ రూపములో వచ్చినది ఖచ్చితముగా రాముడే అని గ్రహించి రామున్ని స్తుతించాడు. మణితో పాటు తన కుమార్తె నిచ్చి శ్రీకృష్ణుతో వివాహం జరిపిస్తాడు జాంబవంతుడు.

Zambavanthu Cavesవిశాలమైన ఈ గుహలో లోపలి వెళ్తే ఇప్పటికీ అక్కడ జాంబవంతుడు శ్రీకృష్ణుడికి జాంబవతికి వివాహం చేస్తున్న పెయింటింగ్ చూడొచ్చు. గుహలోకి వెళ్ళిన వారు అక్కడి మట్టి రేణువులను సైతం ఎవరూ తీసుకు వెళ్ళకూడదు. ఒకవేళ తీసుకు వెళితే ప్రభుత్వం కఠిన శిక్ష వేస్తుంది. అంతేకాదు ఇక్కడి మట్టి రేణువులు తీసుకువెళితే ఇంట్లో కూడా గొడవలు వస్తాయని చెబుతారు.

Zambavanthu Cavesఈ గుహలో నుంచి రెండు దారులు వున్నాయి. ఒకటి ద్వారకకి వెళ్తే, రెండోది జునాగడ్ కి వెళ్తుంది. ఈ రెండు దారులూ రెండు, రెండున్నర గంటల్లో గమ్యం చేరుకోవచ్చు. గుజరాత్ ప్రభుత్వం వారు ఈ గుహలో ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేసి, అక్కడక్కడా లైట్స్ పెట్టారు. గుహలకి బయట చుట్టూ పెద్ద తోటలు ఉన్నాయి. గుహలు చూడడానికి వచ్చిన వారు సేద తీరి, పిక్నిక్ లా ఎంజాయ్ చేయొచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,630,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR