Home Unknown facts ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ పాతాళ భువనేశ్వర్ గుహ రహస్యం

ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ పాతాళ భువనేశ్వర్ గుహ రహస్యం

0

మన దేశంలో ఎన్నో గుహాలయాలు ఉన్నవి. అలాంటి గుహలలో పాతాళ భువనేశ్వర్ ఎన్నో రహస్యాలకు నిలయం అని చెప్పవచ్చు. శివుడు నరికిన వినాయకుడి తల ఇక్కడే ఉందని, 33 కోట్ల మంది దేవతలకు నిలయం ఈ గుహనే అని స్థల పురాణం చెబుతుంది. మరి ఎన్నో రహస్యాలకు నిలయమైన ఈ గుహ ఎక్కడ ఉంది? ఈ గుహలో దాగిఉన్న మరిన్ని ఆశ్చర్యకర విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Patal Bhuvaneshwar Cave Temple

ఉత్తరాంచల్, పిత్తోడాఘడ్ జిల్లా, భువనేశ్వర్ అనే గ్రామంలో పాతాళ భువనేశ్వర్ అనే గుహ ఉంది. ఈ గుహని చేరాలంటే సుమారు 3 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాలి. అయితే చాలా ఇరుకుగా ఉండే ఈ గుహలోకి వెళ్లాలంటే రెండు పక్కల ఉండే గొలుసులను పట్టుకుంటూ సుమారు 90 అడుగుల లోతుకు దిగాల్సి ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ఈ గుహలలో త్రిమూర్తులు, వేయి పడగల శేషుడు, శివుడి జటాజూటం, ఐరావతం, కల్పవృక్షం, 33 కోట్ల దేవతల ఆకారాలు దర్శనమిస్తుంటాయి.

ఈ గుహకి సంబంధించి పురాణానికి వస్తే, నలుడు తన భార్య అయినా దమయంతి చేతిలో ఓడిపోయి అరణ్యంలో సంచరిస్తుండగా నలుడికి తనకి సహాయం చేయమని ఋతువర్ణ మహారాజుని కోరుతాడు. ఆలా అరణ్యంలో ఒక చెట్టు కింద సేదతీరుతుండగా ఒక జింక నన్ను వేటాడకు రాజా అని అనగానే వెంటనే నలుడు నేను జింకని వెంటాడలేదు కదా అని చూడగా అక్కడ ఒక జింక పాతాళ గుహవైపు వెళ్లడం చూసి అక్కాడికి వెళ్లగా ఆ జింక లేదు. జింక అంతరార్థం అర్దమవ్వక అక్కడ స్థలానికి ఏదో ప్రత్యేకత ఉందని గ్రహించి చూడగా నలుడికి పాతాళ భువనేశ్వర్ గుహ కనిపించిందని స్థల పురాణం చెబుతుంది.

ఇంకా ఈ గుహలో శివుడు నరికిన వినాయకుని తల ఈ ప్రదేశంలోనే ఉన్నదని చెబుతారు. అయితే శివుడు వినాయకుని తలని నరకగా ఏనుగు మొండాన్ని తెచ్చేంతవరకు ఇక్కడ వినాయకుని మొండాన్ని ఉంచారని దానికి గుర్తుగానే ఇక్కడ ఒక శిలారూపాన్ని వదిలిపెట్టారని పురాణం. ఇది ఇలా ఉంటె, కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత పాండవులు ఈ గుహకి వచ్చి తపస్సు చేసి ఇక్కడ ఉన్న గుప్త ద్వారం గుండా కైలాసానికి వెళ్లారని చెబుతారు.

శివుడి జటాజూటం ఉన్న గుహలో మొత్తం పాపద్వారము, రణద్వారము, మోక్షద్వారము, ధర్మ ద్వారము అనే నాలుగు గుహలు ఉన్నవి. ఇందులో ప్రస్తుతం రెండు గుహాద్వారాలు తెరచి ఉన్నవి. ఇక్కడి నుండి కైలాసపర్వతానికి గుప్తమార్గం ఉన్నదని చెబుతారు. ఈవిధంగా ఎన్నో అద్భుతాలకు నిలయమైన పాతాళ భువనేశ్వర్ గుహ చూడటం మరువలేని అనుభూతుని ఇస్తుంది.

Exit mobile version