మర్మ కళ అనే యుద్ధవిద్య భారతీయ ప్రాచీన రహస్య యుద్ధవిద్యలలో ఒకటి

కళరి అనే పదం మనలో చాలా మంది వినే ఉంటాం. కళరి అంటే పాఠశాల లేదా వ్యాయామశాల అని అర్థం. పయట్టు అంటే యుద్ధం, వ్యాయామం, లేదా కఠిన శ్రమతో కూడిన పని అర్థం. కళరిపయట్టు అనే పదం ఈ రెండు పదాల కలయిక వల్ల ఉద్భవించింది.

పరశురాముడు ఈ యుద్ధక్రీడకు ఆధ్యుడిగా భావిస్తారు. కలరి నిర్మించేటపుడు వాస్తుశాస్త్ర పద్ధతులను కచ్చితంగా పాటించాలి. మంత్ర శాస్త్రం, తంత్ర శాస్త్రం, మర్మ శాస్త్రం(మర్మ కళ) మొదలైన వాటిని కలరిలో శక్తులను బ్యాలన్స్ చెయ్యడానికి వాడతారు.

4-Rahasyavaani-1097ఈ మూడింటిలో మర్మ కళ చాలా ప్రత్యేకమైనది. ఈ మర్మ కళ విశిష్టత ఇప్పుడు తెలుసుకుందాం…మర్మ కళ అనే యుద్ధవిద్య భారతీయ ప్రాచీన రహస్య యుద్ధవిద్యలలో ఒకటి. ఈ యుద్దవిద్య ఎక్కువుగా కేరళలో అక్కడక్కడ కనిపిస్తుంది. ఈ విద్యకు మూలపురుషుడు పరమశివుడు. దీనిని వర్మ కళ అని మరొక పేరుతో కూడా వ్యవహరిస్తున్నారు.

3-Rahasyavaani-1097మనిషియొక్క శరీరంలో ప్రాణశక్తి అనేది పది మార్గాలనుంచి పైనుంచి క్రిందకి , క్రింద నుంచి పైకి ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ మార్గాలను “దశ నాడులు ” అని పిలుస్తారు. ఈ ప్రాణశక్తి ప్రవహించే మార్గాలలో ఎటువంటి అడ్డు ఏర్పడినా మనుషికి రోగాలు సంభవిస్తాయి. శరీరంలో రక్తం ప్రవహించడానికి రక్తనాళాలు ఎలా ఉన్నాయో అదేవిధంగా వాయువు శరీరం అంతా పరిభ్రమించడానికి కొన్ని ప్రత్యేక మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలనే నాడులు అని పిలుస్తారు .

7-Rahasyavaani-1097ఈ నాడులలో వాయవు ఉంటుంది. ప్రాణశక్తి అనేది వాయవు రూపంలో ఉంటుంది. మర్మస్థానం గురించి వివరించాలి అంటే అదొక ట్రాఫిక్ జంక్షన్ లాంటిది. జంక్షన్ లో సమస్య లేనంతవరకు వాహనాలు ఎటు వెళ్ళేవి అటు ప్రశాంతముగా వెళతాయి. ఏదైనా సమస్య వస్తే ఒకదాని వెంట ఒకటి ఆగి సమస్య ఎలా వస్తుందో అదేవిధంగా మర్మస్థానం పైన దెబ్బ తగిలిన వెంటనే శరీరంలో ఒక్కసారిగా మార్పు వస్తుంది.

చచ్చుబడి, కోమా .. ఆపై మరణం అవయవాలు చచ్చుబడటం , కోమాలోకి వెళ్లడం , మరణించడం ఈ మూడు రకాల సమస్యలు సంభవిస్తాయి. సమస్య అనేది ఏ మర్మస్థానం మరియు మర్మస్థానం పైన దెబ్బ ఎంత బలంగా తగిలింది అనేదానిని బట్టి ఉంటుంది.
శరీరంలోని సిరలు గురించి చెప్పాలంటే వాత , పిత్త , కఫ , రక్త వాహకాలు అని నాలుగు రకాలుగా ఉంటాయి.

2-Rahasyavaani-1097ఇవి మొత్తం 700 సిరలు శరీరంలో ఉంటాయి. ఈ సిరలను ఆశ్రయించి మర్మస్థానాలు ఉంటాయి. ఈ మర్మ స్థానాలలో దెబ్బ తగిలినప్పుడు లేదా గాయం అయినపుడు ప్రాణానికి ముఖ్యమైన రక్తం అధికంగా స్రవిస్తుంది. రక్తం వలనే మిగిలిన ధాతువులు అన్ని వృద్ధిచెందుతూ ఉంటాయి. గాయం వల్ల రక్తం అధికంగా పోతే శరీరంలో మిగిలిన ధాతువులు క్షీణిస్థాయి.

ఎప్పుడైతే ధాతుక్షయం జరుగుతుందో వాతం ఒక్కసారిగా వృద్దిచెంది తేజోరూపమైన పిత్తమును ప్రేరణ చెందిస్తుంది. దీనివల్ల గాయం అయిన మర్మస్థానంలో తీవ్రమైన మంట, పోటు లాంటి బాధలు కలుగుతాయి. తీవ్రమైన దప్పిక, శోష , భ్రమ కలుగుతుంది. ఆ తరువాత శరీరం పైన తీవ్రంగా చెమట పట్టి అవయవాలు చచ్చుబడుతూ నరకాన్ని మరణిస్తారు మరణిస్తారు .

చెప్పిన లక్షణాలన్నీ మర్మస్థానం పైన దెబ్బ తగిలినప్పుడు సంభవిస్థాయి. ఈ అత్యంత ప్రాచీన రహస్యమైన మర్మకళని సంపూర్ణంగా అభ్యసించిన వ్యక్తికి మాత్రమే శరీరంలో మర్మ స్థానాలు ఎక్కడ ఉంటాయో చక్కగా తెలుస్తుంది. ఈ మర్మస్థానాలనే తెలుగులో ఆయువుపట్లు అంటారు.

5-Rahasyavaani-1097శరీరం మొత్తం మీద 107 మర్మస్థానాలు ఉంటాయి. తొడలు, చేతులు ఈ నాలుగు అంగాలలో ఒక్కోదానిలో 11 మొత్తము 44 . ఉదర భాగములో 3 , రొమ్ము భాగము నందు 9 , వీపున 14 , కంఠము పై భాగములో ౩౭ ఉంటాయి. ఇవన్నీ కలిపి మొత్తం 107 ఉంటాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR