రణపాల మొక్కతో ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలుసా?

మన పరిసరాలలో ఎన్నో మొక్కలు పెరుగుతుంటాయి. వాటిల్లో ఆయుర్వేద పరంగా ఉప‌యోగ‌ప‌డే మొక్క‌లు కొన్ని ఉంటాయి. కానీ వాటిని గ‌మ‌నించం. అవి మ‌న ప‌రిస‌రాల్లోనే పెరుగుతాయ‌ని తెలిసి ఆశ్చ‌ర్య‌పోతుంటాం. అలాంటి మొక్క‌ల్లో ర‌ణ‌పాల మొక్క ఒక‌టి. దీన్ని ఆఫీసుల వ‌ద్ద‌, ఇంటి ప‌రిస‌రాల్లో అలంక‌ర‌ణ మొక్క‌గా పెంచుతారు. కానీ ఆయుర్వేద ప‌రంగా ఈ మొక్క వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

సాధారణంగా ఒక మొక్క రెండు నుంచి మూడు రోగాలు నయం చేస్తుంది. మహా అయితే ఇంకొన్ని రోగాలను నయం చేస్తుందని చెబుతుంటారు నిపుణులు. కానీ ర‌ణ‌పాల మొక్క యొక్క ఆకులు,వేర్లు, కాండం ఇవన్నీ మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడి సుమారుగా 150 కి పైగా రోగాలను నయం చేస్తుందట.

2-Mana-Aarogyam-776ఈ రణపాల ఆకు కాస్త దళసరిగా ఉండి రుచిలో వగరు, పులుపు గా ఉంటుంది. ఈ మొక్క ఆకు ద్వారానే తిరిగి ప్రత్యుత్పత్తి కొనసాగిస్తుంది. అంటే ఆకు నాటడం ద్వారా తిరిగి మొక్క మొలుస్తుంది. దీంతో ఇంటి ఆవ‌ర‌ణ‌లో సుల‌భంగా పెంచుకోవ‌చ్చు. ఈ రణపాల ఆకు తినడం ద్వార, కషాయం సేవించడం ద్వార, ఆకు రుబ్బి కట్టు కట్టడం ద్వార చాల ఉపయోగాలు ఉన్నాయి.

రణపాల మొక్క లో ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్,యాంటీ హిస్టామైన్ తోపాటు అనాఫీలాక్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అధిక రక్తపోటు, తలనొప్పి, గడ్డలు, వాపు వంటి ఎన్నో రకాల రోగాలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ మొక్క యొక్క ఆకుల నుండి తయారైన టీ ని తిమ్మిరి, ఉబ్బసంతో పాటు సైనస్ సమస్యలతో బాధపడుతున్నవారు తాగడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.

1-Mana-Aarogyam-776ర‌ణ‌పాయ ఆకులు కిడ్నీల స‌మ‌స్య‌లు, కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి. ఈ రణపాల ఆకు ఉదయం రెండు రాత్రి రెండు ఆకులు తినడం ద్వారా కిడ్నీలో,బ్లాడర్ లో ఎర్పడ్డరాళ్ళను బయటకు పంపుతుంది. అంతేకాకుండా శారీరక దృఢత్వాన్ని పెంచుతుంది. మూత్రాశయాన్ని శుభ్రం చేయడంతో పాటు ప్రేగుల నుండి హానికరమైన వ్యర్థాలను వదిలించుకోవడానికి కూడా ఉపయోగిస్తారు.

4-Mana-Aarogyam-776మూత్రాశయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఐదు మిల్లీలీటర్ల రసం తాగాలి. ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ర‌ణ‌పాల ఆకుల‌ను తింటే ర‌క్తంలోని క్రియాటిన్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ఇది డ‌యాలసిస్ రోగుల‌కు మేలు చేస్తుంది. మూత్ర‌పిండాల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ర‌ణ‌పాల ఆకుల‌ను తిన‌డం ద్వారా జీర్ణాశ‌యంలోని అల్స‌ర్లు త‌గ్గుతాయి. అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

3-Mana-Aarogyam-776ఏదైనా గాయం అయినప్పుడు ఆకులను కొద్దిగా వేడి చేసి గాయం మీద కట్టాలి. ఇలా చేయడం వల్ల గాయం త్వరగా మానిపోతుంది. అలాగే మనకు ఒక్కోసారి రక్త విరేచనాలు అవుతుంటాయి. ఇందుకోసం మూడు నుంచి ఆరు గ్రాముల రణపాల ఆకుల రసానికి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కలిపి అంతే రెట్టింపు స్థాయిలో నెయ్యి కలపాలి. దీన్ని బాగా నూరి రోగికి రోజుకు మూడుసార్లు సేవిస్తే రక్త విరేచనాలు తగ్గుతాయి.

రోజూ ఉద‌యం, సాయంత్రం ఈ ఆకులను 2 చొప్పున తింటుంటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. రణపాల మొక్క రసాన్ని ఐదు నుంచి పది చుక్కల వరకు తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కామెర్లు ఉన్న‌వారు రోజూ ఉద‌యం, సాయంత్రం ఈ ఆకుల ర‌సాన్ని 30 ఎంఎల్ మోతాదులో తీసుకోవాలి. దీంతో వ్యాధి న‌యం అవుతుంది.

రణపాల ఆకు రసాన్ని కళ్ల చుట్టూ పలుచటి లేపనంగా రాయడం వల్ల కంటి నొప్పుల నుంచి బయటపడవచ్చు. రణపాల ఆకులను చూర్ణం చేసి నుదిటిపై పట్టులాగా వేయడం వల్ల తల నొప్పి త్వరగా తగ్గుతుంది. ర‌ణ‌పాల ఆకుల ర‌సం ఒక్క చుక్క‌ను చెవిలో వేస్తే చెవిపోటు త‌గ్గుతుంది. ఈ ఆకుల‌ను తింటే జుట్టు రాల‌డం త‌గ్గుతుంద‌ది. తెల్ల వెంట్రుక‌లు రావ‌డం ఆగుతుంది.

అంతేకాదు ర‌ణ‌పాల ఆకుల‌ను పేస్ట్‌లా చేసి క‌ట్టు క‌డుతుంటే కొవ్వు గ‌డ్డ‌లు, వేడి కురుపులు త‌గ్గుతాయి. శ‌రీరంలో వాపులు త‌గ్గుతాయి. స్త్రీలలో ఎక్కువగా యోని సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. ఇలాంటి వారికి రెండు గ్రాముల తేనె ను 40 నుంచి 60 మిల్లీ లీటర్ల కషాయం లో కలిపి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. రణపాల ఆకు రసాన్ని తీసుకోవడం వల్ల పైల్స్ నుంచి విముక్తి కలుగుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR