Vaayudevunni edurkoni nilabadina mahimagala Chandravadhana Shikaram

0
4261

చంద్రవదన శిఖరం పైన గాలి ఎంతో అధికంగా ఉంటుంది అయినా కూడా అమ్మవారి ఆలయం చెక్కు చెదరకుండా ఉండటంతో అమ్మావారు వెలసిన ఈ ఆలయం ఎంతో మహిమగలదని భక్తులు విశ్వసిస్తారు. మరి మహిమ గల ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న మరిన్ని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. chandravadhanaఉత్తర హిమాలయాల్లో తెహరీ నుండి దేవప్రయాగ వెళ్లే మార్గంలో ఒక పెద్ద అరణ్యంలో కుచకార శిఖరం పైన చంద్రవదన ఆలయం ఉంది. ఉత్తరకాశి నుండి గంగోత్రి వెళ్లే మార్గం ద్వారా ఈ ఆలయాన్ని దర్శించవచ్చు. ఈ ఆలయం సతి దేవికి సంబంధించిన శక్తి పీఠాలలో ఒకటిగా చెబుతారు. శిఖర ఉపరితలంపైన చాలా చదునుగా ఉన్న ప్రదేశంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇది హిందువుల యొక్క పవిత్ర పుణ్యక్షేత్రం. అయితే ఈ ప్రాంతంలో అధికంగా ముస్లింలు నివసిస్తుంటారు. chandravadhanaఇక ఆలయ విషయానికి వస్తే, చంద్రవదన శిఖరం పైన గాలి అధికంగా ఉంటుంది. ఆ గాలి ఎలా ఉంటుంది అంటే నిలబడి ఉన్న ఒక మనిషిని అమాంతంగా గాలిలోకి లేపివేయగలిగేంత ఉదృతంగా ఉంటుంది. ఇంతటి గాలి ఇక్కడ ఉన్నపటికీ తట్టుకొని ఈ ఆలయం అలానే ఉండటం తో ఈ ఆలయం మహిమ గల ఆలయం అని భావిస్తారు. chandravadhanaఈ ఆలయం రెండు గదుల్లా ఉంటుంది. ఇక్కడ గర్భగుడిలో విగ్రహం ఉండదు. కానీ మందిరం పైభాగంలో వ్రేలాడుతున్న ఓ యంత్రానికి ఒక వస్త్రము చుట్టి మూటల కట్టి పైన వ్రేలాడుతూ ఉంచారు. ఈ యంత్రాన్ని ఎవరి కంట పడనీయకుండా ఉంచుతారు. ఒకవేళ కనుక ఈ యంత్రాన్ని ఎవరైనా చూస్తే వారికీ హఠాన్మరణం సంభవిస్తుంది అని చెబుతారు. అందుకే ఈ యంత్రానికి కట్టిన వస్ర్తాన్ని మార్చేప్పుడు కూడా ముందు కొత్త వస్రం చుట్టి తరువాతే పాతవస్ర్తాన్ని మార్చేస్తారు. ఇక్కడ జగద్గురు శంకరాచార్యుల వారే ఈ యంత్రాన్ని చంద్రవదన మందిరంలో ప్రతిష్టించాడని తెలియుచున్నది. chandravadhanaఆలయ స్థల పురాణానికి వస్తే, ఆకాశమార్గంలో ప్రయాణిస్తున్న సతి దాక్షాయణి కుచద్వయంలో నుండి ఒకటి జారీ పోయి ఇచట పడి నేలను తాకి చంద్రవదన శిఖరంగా మారిందని చెబుతారు. ఇందుకు నిదర్శనంగా స్థనాకారంలో ఉండే ఒక శిల మనకి ఈ ఆలయం ముందు కనిపిస్తుంది. 5 vayudevunni edhurkoni nilabadina mahimagala chandravadhana shikaramఇలా ఎంతో మహిమ గల ఈ ఆలయానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి మధురానుభూతిని పొందుతారు.6 vayudevunni edhurkoni nilabadina mahimagala chandravadhana shikaram