Home Unknown facts Vasavi ane kanya Parameshwarideviga ela avatharinchindho thelusa?

Vasavi ane kanya Parameshwarideviga ela avatharinchindho thelusa?

0

దేవతలు లోకకల్యాణం కోసం అవతారాలు ఎత్తుతారని పురాణాలూ చెబుతున్నాయి. అయితే ఇక్కడి ఆలయంలో మాత్రం ఒక కన్య పరమేశ్వరి దేవిగా అవతరించి అక్కడి వైశ్యులకి కులదేవతగా మారింది. మరి ఈ వాసవీ అనే కన్య ఆ అవతారం వెనుక పురాణం ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.parameshwari deviఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, గుంటూరు జిల్లా, పొన్నూరు పట్టణం నందు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ఎన్నో ప్రాచీన ఆలయంలో ఇది కూడా ఒకటిగా చెబుతారు. ఈ ఆలయం పొన్నూరు ఆర్యవైశ్యులచే క్రీ.శ. 1899 లో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా పొన్నూరు ఆర్యవైశ్యులే నిర్మించారు.ఈ ఆలయ పురాణానికి వస్తే, పచ్చిమగోదావరి జిల్లాలో పెనుగొండ అనే గ్రామం కలదు. ఆ గ్రామంలో కుసుమ శ్రేష్టి కౌసుంబి అనే వైశ్య దంపతులుండేవారు. ఆ దంపతులకు వాసవీ అనే కన్య జన్మించింది. ఆమె ఎంతో గుణవంతురాలు, సౌదర్యవతి. అయితే ఆమెని విష్ణువర్డనుడను రాజు చూసి మోహితుడై ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.ఇదే విషయం ఆమె తల్లితండ్రులకి చెప్పగా వారు, మా కులమువారందరు అంగీకరించినచో ఆమెను తమకిచ్చుట అభ్యంతరము లేదని వారు రాజుకి తెలియచేసారు. కానీ వైశ్య కులస్థులు ఎవ్వరు అంగీకరించలేదు. అప్పుడు రాజుకి కోపం వచ్చి తన సైన్యంతో వారందరిపై దండెత్తి వచ్చాడు. రాజుని ఎదురించి పోరాడలేని వైశ్యులు అందరు కుసుమ శ్రేష్ఠితో కలసి అగ్నికి ఆహుతై తమ ప్రాణాలని వదిలారు.అప్పుడు వాసవీ కన్య తన నిరసనను తెలియచేసి, అగ్నికాహుతైనది. ఆమెయే తరువాత పరమేశ్వరిగా అవతరించింది. ఈ పరమేశ్వరిని మిగిలిన వైశ్యులు తమ కులదేవతగా భావించి ఆరాధించసాగారు. తరువాత వైశ్యులు అధికంగా ఉన్న ప్రతిచోట ఆమె ఆలయాలు నిర్మించారు. ఈవిధంగా ఏర్పడిన ఆలయాలలో పొన్నూరులో ఏర్పడిన ఈ ఆలయం కూడా ఒకటి.ఇక ఆలయ విషయానికి వస్తే, ఈ ఆలయం పశ్చిమ ముఖంగా ఉండి, గర్బాలయం, అంతరాలయం, మండపం అను మూడు భాగాలతో ఉన్నది. ఈ ఆలయంలో గర్భగృహమునందు వాసవీ కన్యకా పరమేశ్వరితో పాటు ఈశాన్యదిశ యందు వినాయక విగ్రహం కలదు.
ఇలా వెలసిన ఈ ఆలయంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజున గొప్ప ఉత్సవాలు జరుగును.

Exit mobile version