పెద్దలు “దాన ధర్మం చేయకపోయిన దక్షిణం తల పెట్టి పడుకోవాలి” అంటారు. ఎందుకు?

నిద్ర అనేది ప్రతి మనిషికి ఎంతో అవసరం. అయితే మనం పడుకునేటప్పుడు ఎటువైపు తల పెట్టాలి, ఎటువైపు కాళ్లు ఉండాలన్న విషయం కొందరికి తెలియకపోవచ్చు. ఎలా పడితే అలా నిద్ర పోయేవారు చాలా మంది ఉంటారు.

3-Rahasyavaani-1098అయితే పెద్దలు ఉత్తరం దిక్కున తల పెట్టి పడుకుంటే మంచిది కాదని చెబుతుంటారు. ఇంతకీ ఉత్తరం దిక్కు తలపెట్టి నిద్రపోకూడదా…ఎందుకు? అనే సందేహం మనకు కలుగుతుంది. ఉత్తరం వైపు తల పెట్టు కొనీ నిద్రపోకూడదు అని తరచు పెద్దలు చెప్పె మాట ఇది. అలా పడుకుంటే ఆయుక్షీణం అని పురాణ ఇతిహసలలో అనేక కధలు ఉన్నాయి .

కొంతమంది పురాణాలలలో చెప్పిన విషయాలను కొట్టి పడేస్తుంటారు. కానీ వైద్య శాస్త్రం చెప్పే విషయాలు తప్పక అందరూ పాటించాల్సిందే…వైద్య శాస్త్రం ఈ విషయంలో కొన్ని శాస్త్రీయ ఆధారాలను చూపుతుంది. ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే ఆ ఆయస్కాంత తరంగాల వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుందని వారి పరిశోధనలలో తేల్చి చెప్పారు.

5-Rahasyavaani-1098ఎందుకు అంటే భూమధ్య రేఖ నుండి 40 డిగ్రీల అక్షాంశం వరకు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది.
ఉత్తర దృవం సమీపించే కొద్ది తగ్గుతుంది .మనదేశం 40 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ మధ్య ఉంది. కాబట్టి ఈ ఆకర్షణ శక్తి ప్రభావం ఇంకా ఎక్కువుగా ఉంటుంది .ఈ సూత్రం ప్రకారం దక్షిణం నుంచి ఉత్తరం దిశ వరకు ఆకర్షణ శక్తి ప్రవహిస్తుంటుంది .

2-Rahasyavaani-1098ఇందు వల్ల శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. దీని వల్ల కొన్ని రసాయనాలు తయారయ్యి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ప్రకృతి సిద్దమైన నిరంతర ప్రక్రియ. మన శరీరంలో ఇనుము ,నికేల్ ,కోబాల్ట్ వంటి లోహ పదార్ధాలు ఉంటాయి .వీటిపై గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఎక్కువుగా ఉంటుంది .
ఈ పదార్ధాలు ఉత్తర,దక్షిణ ద్రువాలలో కేంద్రీకృతం అవుతాయి . అంటే ఉత్తరం దిశగా తల పెట్టినప్పుడు మెదడు , అరికాళ్ళ దగ్గర ఈ పదార్ధాలు ద్రువాలుగా ఏర్పడతాయి. దీనితో సహజ సిద్దమైన ఆకర్షణ శక్తి శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుపడతాయి .
దీని వల్ల శరీరంలో బాక్టీరియా వృద్ధి చెందడమే కాకుండా రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ కారణాల వల్ల మనిషి తొందరగా రోగాల బారిన పడుతాడు .

1-Rahasyavaani-1098వాస్తుశాస్త్ర రిత్యా తూర్పు, దక్షిణ దిశలలో మాత్రమే తల పెట్టి పడుకోవాలని నియమం ఉంది. పురాణలలో కూడా దీనికి కారణాలు ఉన్నాయి. సూర్యుడు మనకు ప్రత్యక్షదైవం కాబట్టి ఆయనవైపు కాళ్ళు పెట్టి నిద్రించ కూడదనేదీ ఒక కారణం. నిద్రలేవడం ఆలస్యమైతే సూర్యకాంతి కళ్ళపై పడుతుందనేది మరో కారణం. ఉత్తరం వైపు తలపెడితే లేస్తూనే దక్షిణ దిశాధిపతి అయిన యముడి దర్శనం చేసుకున్నట్టు అవుతుంది. అందు వల్ల ఉత్తరం వైపు తల పెట్టకూడదనే నియమం ఏర్పడింది .

6-Rahasyavaani-1098వినాయక జన్మ వృతాంతంలో కూడా ఈ విషయం వివరించబడింది. మరణించిన తన పుత్రునికి ఈశ్వరుడు ఉత్తర దిక్కుకు తలపెట్టుకొని నిద్రిస్తున్న వారి తలను తీసుకురమ్మని ప్రమధ గణాలను అదేశించడం గజాసురుని తల తెచ్చి వినాయకునికి అతికించడం అనే విషయం మనకు తెలిసిందే.

7-Rahasyavaani-1098దీనికి శాస్త్ర సంబంధమైన విశేషాలు కూడా ఉన్నాయి. తూర్పు నుండి వచ్చే ప్రకృతి బద్ధమైన కాంతులు శరీరానికి మేలు చేసే ఆరోగ్యదాయిని. దక్షిణ ,నైరుతి దిక్కుల నుండి వచ్చే శీతల పవనాల వల్ల సుఖ నిద్ర కలుగుతుందని ఆరోగ్య సూత్రాలు చెబుతున్నాయి. అందుకే పెద్దలు దాన ధర్మం చేయకపోయిన దక్షిణం తల పెట్టి పడుకోవాలని అంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR