వెల్లంగిరి పర్వతం మీద ఉన్న ఆదియోగి విగ్రహం గురించి కొన్ని నిజాలు

0
3659

శివుడు ఆదియోగిగా దర్శనమిచ్చే 112 అడుగుల నల్లని రంగులో ఉండే అద్భుత విగ్రహం చూడటానికి భక్తులకి రెండు కళ్ళు అనేవి సరిపోవు. దేశంలో ఈ అతిపెద్ద విగ్రహం గిన్నిస్ బుక్ లో చోటుసంపాదించింది. మరి ఆదియోగి అంటే అర్ధం ఏంటి? సరిగ్గా ఇక్కడ 112 అడుగుల శివుడి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టించారు? ఈ ప్రాంతంలో దాగి ఉన్న మరిన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

112 Ft Adiyogi Statue

తమిళనాడు రాష్ట్రం, కోయంబత్తూర్ కి దగ్గరలో, వెల్లంగిరి పర్వతం మీద ఆదియోగి విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని ప్రముఖ ఆద్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ గారు స్థాపించిన ఈశా ఫౌండేషన్ వారు వారి యోగ కేంద్రంలో శివుడిని ఆదియోగిగా కొలుస్తూ 112 అడుగుల అతిపెద్ద విగ్రహాన్ని రూపుదిద్దగ, స్టీల్ తో చేయబడిన ఈ విగ్రహాన్ని 2017 లో ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. దాదాపుగా ఈ విగ్రహం బరువు 500 టన్నులు ఉంటుందని ఒక అంచనా. ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దెందుకు 8 నెలల సమయం పట్టిందని చెబుతున్నారు.

112 Ft Adiyogi Statue

ఆదియోగి విగ్రహం విషయానికి వస్తే, ఆదియోగి అంటే మొట్టమొదటి యోగి. మనిషి కంటే ఎంతో ఉన్నతుడని, అందుకే యోగాశాస్రంలో శివుడిని దేవుడిగా కాకుండా ఒక యోగిగా, గురువుగా చూస్తారు. అందుకే ఇక్కడ శివుడిని ఆదియోగిగా పిలుస్తారు. ఇక 112 ముక్తి మార్గాలకు ప్రతీకగా ఇక్కడ శివుడి విగ్రహం 112 అడుగుల ఎత్తులో నిర్మించడం విశేషం. పూర్వము శివుడు ఇక్కడ సంచరించారని, మునులు, సిద్దులు, యోగులు ఇక్కడ తపస్సు చూసుకునేవారని అందుకే సద్గురు గారు ఇలాంటి ప్రశాంత వాతావరణంలో కేంద్రాన్ని ఏర్పాటుచేశారని చెబుతారు. ఇక్కడ ఉన్న పర్వతాలు మానస సరోవరం దగ్గర ఉన్న పర్వతాల మాదిరిగా ఉంటాయని అందుకే ఈ ప్రాంతాన్ని దక్షిణ భారత కైలాస పర్వతం అని అంటరాని చెబుతారు.

112 Ft Adiyogi Statue

ఇక్కడ మరొక విశేషం ధ్యాన లింగం. దాదాపుగా మూడు సంవత్సరాల పాటు సద్గురు గారు సాధన చేసిన తరువాత ధ్యాన లింగాన్ని ప్రతిష్టించారు. ఈ శివలింగం 13 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉంటుంది. ఏడూ చక్రాలుగా కనిపించే అత్యంత శక్తివంతమైన ఈ శివలింగం గర్భగుడిలో ప్రతిష్టించారు. అన్నిటికి భిన్నమగా విశాలమైన గర్భగుడిలో, పై కప్పుకి స్థంబాలు అనేవి లేకుండా ధ్యాన లింగ దర్శనం ప్రతి ఒక్కరికి అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకా ఈ గర్భగుడి ముందు భాగంలో సర్వ ధర్మ స్థంభం ఏర్పాటుచేశారు. దీని అర్ధం ఏంటంటే, ప్రపంచంలో అన్ని మతాలు సమానమే అని చెప్పేవిధంగా ఈ స్థంభం పైన అన్ని మతాల కి సంబంధించిన గుర్తులు చెక్కబడి ఉంటాయి. ఇక్కడి ధ్యానలింగం ఎదురుగ సప్త ఋషుల జీవిత విశేషాలు అనేవి ఉన్నాయి. ఇక్కడే ధ్యానలింగం ఆలయం పక్కన లింగభైరవి అనే ఆలయం ఉంది.

112 Ft Adiyogi Statue

ఇక్కడ పదివేలమంది కుర్చునేవిధంగా ఆడిటోరియం అనేది ఉంది. అయితే నలుపు రంగులో ఉండే బారి విగ్రమైన ఆదియోగికి సుమారు ప్రతి సంవత్సరం ఒకసారి రెండు లక్షల ఎనిమిది రుద్రాక్షలతో మాలను వేస్తుంటారు. వీరు రాబోయే రోజులో దేశంలో ప్రతి రాష్ట్రంలో ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నారని చెబుతున్నారు. ముఖ్యంగా ముందు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ వద్ద, కన్యాకుమారి వద్ద, రాజస్థాన్ లో ఇలా మూడు ఆదియోగి విగ్రహాలను ఏర్పాటుచేయాలని అనుకుంటున్నారట.

ఇలా పవిత్ర స్థలంలో, ప్రకృతి అందాల నడుమ ఉన్న 112 అడుగుల ఆదియోగి అద్భుత అతిపెద్ద విగహం ఒకవైపు, అత్యంత 112 Ft Adiyogi Statueశక్తివంతమైన ధ్యాన లింగం మరొక వైపు, సద్గురు స్థాపించిన యోగ కేంద్రం ఇలా వీటి అన్నిటి దర్శనం మహా అద్భుతమని చెప్పవచ్చు.

SHARE