చింత చెట్టు తొర్రలో వెలసిన వెంకటేశ్వర స్వామి!!! ఆలయం ఎక్కడంటే..?

తిరుమలలో ఏడూ కొండల పైన వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం సందర్శించాడనికి ప్రపంచం నలుమూల నుండి లక్షల సంఖ్యల్లో భక్తులు వస్తుంటారు.
ప్రపంచంలోనే ఎక్కువ మంది హిందువులు దర్శించుకునే ఆలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి అని చెప్పవచ్చు.

tadipatri venkataramana swamyఈ ఆలయంలో వెలసిన వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. కేవలం తిరుపతిలో ఉండే వెంకటేశ్వరస్వామిని మాత్రమే కాకుండా మనదేశంలో వివిధ ప్రాంతాలలో ఉండే వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు కలియుగ దైవంగా భావించి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు. ఈ విధంగా ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో అనంతపురంలోని తాడిపత్రిలో ఉన్నటువంటి చింతల వెంకటరమణ స్వామి ఆలయం ఒకటని చెప్పవచ్చు. ఈ ఆలయం విశిష్టత ఏమిటో తెలుసుకుందాం…

tadipatri venkataramana swamyఅనంతపురం జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన చింతల వెంకటరమణ స్వామి దేవాలయం విజయనగర రాజులు నిర్మించినది. దీనిని క్రీ.శ.1460 – 1525 లో నిర్మించారు. ఎంతో అద్భుతమైన శిల్పకళతో రూపొందించిన ఈ ఆలయం ప్రపంచ వారసత్వం పొందింది.

పెన్నా నది ఒడ్డున దాదాపు 5 ఎకరాల స్థలంలో ఈ ఆలయం విస్తరించి ఉంది. పూర్వం ఈ ప్రదేశంలో ఎక్కువగా చింత చెట్లు ఉండేవి. ఈ క్రమంలోనే ఓ పెద్ద చింత చెట్టు నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించడంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా ఆ చింత చెట్టు తొర్రలో విష్ణువు విగ్రహం కనిపించింది.

tadipatri venkataramana swamyఆ విధంగా చింత చెట్టు నుంచి లభించిన విగ్రహానికి విజయ నగర రాజులు ఆలయం నిర్మించడం వల్ల ఇక్కడ వెలసినటువంటి స్వామి వారిని చింతల వెంకటరమణ స్వామిగా భక్తులు పూజిస్తారు.

tadipatri venkataramana swamyఈ ఆలయంలో కొలువై ఉన్న స్వామివారు చింతచెట్టు తొర్రలో దొరకడం వల్ల ఇక్కడి స్వామిని చింతల తిరువేంగళ నాథ స్వామి అని పిలిచే వారు. క్రమంగా చింతల వేంకటేశ్వర స్వామి లేదా చింతల వేంకటరమణ స్వామి అని పిలుస్తున్నారు. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు దాగి ఉన్నాయి.

ఈ ఆలయంలో సూర్య కిరణాలు గర్భ గుడిలోని స్వామి వారి పాదాలను తాకుతాయి. గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారి మూలవిరాట్ దాదాపు పది అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని మూడు రోజులపాటు వరుసగా సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాగడం ఈ ఆలయ ప్రత్యేకత అని చెప్పవచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR