గత వంద సంవత్సరాల నుంచి పాములతో సహజీవనం చేస్తున్న గ్రామం!

హిందూ సాంప్రదాయంలో పాములను దైవంగా భావించి పూజ చేస్తాం. శివుడి మెడలో సర్పం ఉంటుంది. సాక్షాత్తు విష్ణుమూర్తి శేషతల్పం మీద పవళిస్తాడు. కానీ మనకు పాము కనబడితే ఆమడ దూరం పరిగెడతాము. కొందరు మనకు పాము ప్రమాదం తల పెడుతుందని వాటిని చంపేయాలని చూస్తారు.

lord shivaమరి కొందరు పామును సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు స్వరూపంగా భావించి పూజలు చేస్తుంటారు. ఇలాంటి కోవకు చెందినదే దావణగెరె జిల్లాలో నాగేనహళ్లి గ్రామం.
ఈ గ్రామంలోని గ్రామస్తులు గత వంద సంవత్సరాల నుంచి పాములతో సహజీవనం చేస్తున్నారు.

snakesఅయినప్పటికీ ఆ పాములు గ్రామస్తులను ఎవరిని కరచవు, ఒకవేళ కరచిన ఆ గ్రామంలోని వారికి ఏమీ కాదు. ఎంతో విషపూరితమైన నాగుపాములతో ఈ గ్రామస్తులు సహజీవనం చేయటం విశేషం. పెద్ద వారు మాత్రమే కాకుండా చిన్న పిల్లలు కూడా ఆ పాములకు ఏ మాత్రం భయపడరు.

snakesగత వంద సంవత్సరాల నుంచి పాములతో సహజీవనం చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కరు కూడా పాముకాటుకు గురై మరణించలేదని గ్రామస్తులు చెబుతారు. ఈ విధంగా పాములు కరిచిన తమకు ఏమి కాకుండా ఆ గ్రామస్తులను ఆ శివయ్య కాపాడుతాడు అని భక్తులు విశ్వసిస్తారు.

templeముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాలలో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు ఎవరిని కూడా ఆ పాములు ఏమి అనవు. అదంతా కేవలం దైవానుగ్రహమేనని, ఒకవేళ పాముకాటుకు గురైన మూడు రోజులపాటు ఆంజనేయస్వామి ఆలయంలో ఉండి అక్కడ అందించే స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకోవటం వల్ల వారికి ప్రాణహాని ఉండదు అని గ్రామస్తులు చెబుతున్నారు.

snakesఅందుకే ఇక్కడ సంచరించే పాములను సాక్షాత్తు వారు ఆ పరమేశ్వరుడు ప్రతిరూపంగా భావిస్తారు. పాములు కనిపించినప్పటికీ వాటిని ఎవరు చంపరు. ఒకవేళ ప్రమాదవశాత్తు పాములు మరణిస్తే వాటికు మనుషుల మాదిరిగా అంత్యక్రియలను జరిపిస్తారు.
ఈ గ్రామంలో పాములను ఒక విషపురుగు మాదిరి కాకుండా దైవ స్వరూపంగా భావించి పూజ చేయటం ఆనవాయితీ.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR