Home Unknown facts శివుడు ఖండించిన వినాయకుని తల ఇప్ప‌టికీ కనిపించే ప్రదేశం

శివుడు ఖండించిన వినాయకుని తల ఇప్ప‌టికీ కనిపించే ప్రదేశం

0

విజ్ఞనాయకుడైన వినాయ‌కుడికి ఎన్నో ఆల‌యాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మానవ నిర్మితాలు కాగా, మరి కొన్నిగణనాధుడు స్వ‌యంభువుగా వెల‌సిన‌వి. ఇంకా మరెన్నో పురాతన ఆలయాలు.. వాటిలో జీర్ణోద్ధరణ జరిపి పునః ప్రతిష్ట గావించనవి కొన్ని.. ఇలా చ‌రిత్ర‌కు సాక్ష్యాలుగా నిలిచిన వినాయ‌కుడి ఆల‌యాల‌కు ఒక్కో దానికి ఒక్కో స్థ‌ల పురాణం ఉంటుంది. అయితే తల్లి కోసం ద్వారకాపలిగా ఉన్న పార్వతి పుత్రుని శిరస్సు మహాశివుడు ఖండిస్తాడు.. తదనంతరం పార్వతి ద్వారా అతని పుత్రుడే అని తెల్సుకున్న శివుడు గజాననుడుకి ఇచ్చిన వర ఆచరణ లో భాగంగా తనతో తెచ్చిన గజ ముఖాన్ని వినాయకుడికి శిరస్సుగా ఉంచి తిరిగి ప్రాణప్రతిష్ట చేస్తాడు.. ఆ సమయంలో శివుడిచే ఖండింపబడ్డ వినాయకుడు తల పడిన చోటు తనే స్వయంగా కాపలా ఉంటాడట.. మ‌రి ఇంతకూ ఆ చోటు ఎక్క‌డ ఉంది, ఆ స్థల విశేషాలేంటి తెల్సుకుందాం..

Ganeshఉత్త‌రాఖండ్‌లోని పితోరాగ‌డ్ ప్రాంతం గంగోలిహ‌ట్ నుంచి సుమారుగా 14 కిలోమీట‌ర్ల దూరంలో భువ‌నేశ్వ‌ర్ అనే గ్రామం ఉంటుంది. అక్క‌డే ‘పాతాళ భువనేశ్వ‌ర స్వామి’ ఆల‌యం ఉంటుంది. ఇందులో వినాయ‌కుడు, ఆయ‌న తండ్రి శివున్ని దర్శించవచ్చు.. ఈ ఆల‌యంలోకి వెళ్లాలంటే సుమారుగా 100 అడుగుల లోతు, 160 మీట‌ర్ల పొడ‌వు ఉన్న గుహ‌లోకి కింద‌వరకు వెళ్లాలి. చాలా మంది భక్తులు ఈ గుహ‌లోకి వెళ్తుంటే క‌లిగే భ‌యానికి వెన‌క్కి వ‌చ్చేస్తారు. ఇక లోప‌లి దాకా వెళ్లి స్వామి ద‌ర్శ‌నం చేసుకుని రావటమంటే అద్భుతమని చెప్పాలి…

ఈ పాతాళ భువ‌నేశ్వ‌ర స్వామి ఆలయంలోనే ఒక‌ప్పుడు ప‌ర‌మ శివుడు న‌రికిన వినాయ‌కుడి త‌ల ఇప్ప‌టికీ మ‌న‌కు క‌నిపిస్తుంది. అయితే అది విగ్ర‌హ రూపంలో ఉంటుంది. దాని వద్ద ఒక ఎలుక‌ను కూడా మ‌నం విగ్ర‌హ రూపంలో చూడ‌వ‌చ్చు. సాక్షాత్తూ ప‌ర‌మ‌శివుడే ఈ గుహ‌కు కాప‌లా ఉంటాడ‌ని స్థ‌ల పురాణం చెబుతోంది.

వినాయకుడు త‌న కుమారుడ‌ని తెలియ‌క శివుడు వినాయ‌కుడి త‌ల‌ను న‌రికాక‌, ఆ త‌రువాత ఏనుగు త‌ల తెచ్చి అతికించాక‌, పార్వతి తన కుమారుని మొహాన్ని అలాచూసి ఏడుస్తుండటంతో.. లోకానికి గజముఖుడిగా కనిపించినా నీ కుమారుడు నీకు పూర్వరూపంలోనే కనిపిస్తాడని వరాన్ని ఇస్తాడు.. తరువాత ఖండించిన వినాయకుని త‌ల ప‌డిన ఈ గుహ‌కు వచ్చి ఆ తలను మహిమాన్వితం గావించి, పుత్ర వాత్సల్యంతో శివుడే కొంత కాలం ఆ గుహలో ఉన్నాడ‌ట‌. అప్ప‌టి నుంచి క్రీస్తుశ‌కం 1191వ సంవ‌త్స‌రంలో ఆది శంక‌రాచార్యుడి కాలం వ‌ర‌కు ఈ గుహ‌ను చూసిన వారు లేర‌ని చ‌రిత్ర చెబుతుంది..

ఇక ఈ ఆల‌యం ఉన్న గుహ కేవ‌లం ఒక్క గుహలా కాకుండా.. చాలా గుహలని కలిపే వరుసల స‌మూహంగా ఉంటుంది. ఇక ఈ ఆల‌యం దాటి వెళితే ఇంకా కింద‌కు మ‌రిన్ని గుహ‌లు ఉంటాయ‌ట‌. వాటి గుండా వెళితే నేరుగా కైలాసాన్ని చేరుకోవ‌చ్చ‌ని స్థ‌ల పురాణం చెబుతోంది. శివుడు ఆ గుహల గుండానే కైలాసానికి వెళ్లాడని పురాణప్రతీతి.. ఆ గుహ‌ల్లోకి వెళ్ల‌డంపై ప్రస్తుతం నిషేధం ఉంది.. ఎందుకంటే వాటిల్లో గాలి ఉండ‌దు. వెళ్లిన కాసేప‌టికే ఊపిరాడ‌క చ‌నిపోతారు. అయితే పాండవులు తాము చ‌నిపోయే ముందు ఈ గుహ‌కు వ‌చ్చి వినాయ‌కున్ని ద‌ర్శించుకుని ఆ లోతైన‌ గుహ‌ల గుండా నేరుగా కైలాసానికి వెళ్లార‌ని కూడా స్థ‌ల పురాణం చెబుతోంది.

Exit mobile version