Vinayakudu aa kondapaina swayambuga endhuku velisado thelusa?

0
10807

వినాయకుడుకి దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయితే అయన ఇక్కడ కొండపైన స్వయంభుగా వెలిశాడని స్థల పురాణం చెబుతుంది. సాధారణంగా వినాయకుడి ప్రతి ఆలయం భూమి మీదే దర్శనం ఇస్తుంది. కానీ ఇలా కొండపైన వినాయకుడు దర్శనం ఇచ్చే ఏకైక ఆలయం ఇదే అవ్వడం విశేషం. మరి వినాయకుడు అలా కొండపైన స్వయంభుగా కొలువై ఉండటానికి స్థల పురాణ గాధ ఏంటి? ఆ ఆలయం ఎక్కడ ఉంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. vinayakuduతమిళనాడు రాష్ట్రము, తిరుచిరాపల్లి జిల్లా, టెప్పాకులం అనే ప్రాంతంలో రాక్ ఫోర్ట్ దేవాలయం ఉంది. ఈ ఆలయంలోనే వినాయకుడు కొండపైన స్వయంభుగా వెలిసాడు. తిరుచిరాపల్లినే ట్రిచీ అని అంటారు. అయితే రాక్ ఫోర్ట్ క్రింది భాగమున బ్రహ్మాండమైన కోనేరును నిర్మించారు దీన్ని తెప్పకుళం అంటారు. ఈ రాక్ ఫోర్ట్ కొండ భూమట్టం నుండి సుమారు 272 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ కొండకి దక్షిణ దిక్కున రాతిమెట్లు కట్టబడ్డాయి. ఇచట ఒక రాతి లింగం ఉంది భక్తులు దీనిని ‘మలైకొళుందిశ్వరర్’ అని పిలుస్తారు. ఒకే ఒక పెద్ద శిల నుండి పల్లవ శిల్పులు ఈ దేవాలయాన్ని అధ్బుతంగా మలిచారు. vinayakuduఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, సీతను బందీగా ఉంచడాన్ని రావణుని సోదరుడు విభీషణుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. అప్పుడు వెంటనే రాముని వద్దకు వెళ్లి ఆశ్రయం పొందుతాడు. అయితే యుద్ధంలో రావణుడిని శ్రీరాముడు సంహరించిన తరువాత విభీషణుడు తనకు చేసిన సాయానికి గుర్తుగా రంగనాథుని విగ్రహాన్ని రాముడు ప్రదానం చేస్తాడు.vinayakuduఅయితే విభీషణుడు అసురుడు. దీంతో దేవతలు రంగనాథ విగ్ర‌హం శ్రీలంకకు చేరుకోకుండా అడ్డుకోవాలని నిర్ణయిస్తారు. ఇందు కోసం గణపతిని ప్రార్థిస్తారు. స్వామి ప్రత్యక్షమై వారి కోరికను తీరుస్తానని మాట ఇస్తారు. విభీషణుడు తిరుచ్చి సమీపంలో విగ్రహాన్ని తీసుకువెళుతుండగా కావేరి నది కనిపించడంతో పుణ్యస్నానం చేయాలని భావిస్తాడు. అయితే విగ్రహాన్ని నేల మీద పెడితే శాశ్వతంగా అక్కడే ఉండిపోతుంది. దీంతో అక్కడే పశువుల కాపరియైన బాలుడిని సాయం కోరుతాడు. కొద్ది సమయం మాత్రమే తాను విగ్రహాన్ని పట్టుకుంటానని సమయం ముగిసిన తరువాత భూమిపైన పెట్టివేస్తానని బాలుడు చెప్పడంతో అందుకు అంగీకరించిన విభీషణుడు విగ్రహాన్ని అతనికి అందజేస్తాడు. vinayakuduబాలుని రూపంలో ఉన్నది సాక్షాత్తు వినాయకుడు అయితే కొద్ది సేపటికే గణపతి శ్రీరంగనాథ‌ స్వామి విగ్రహాన్ని భూమిపైన పెట్టడంతో నదిలో ఉన్న విభీషణుడు ఆగ్రహించి పరుగున ఒడ్డుకు వచ్చాడు. అప్పుడు స్వామి విగ్రహాన్ని అక్కడ నుంచి తీయడం సాధ్యం కాలేదు. దీంతో ఆగ్రహంతో బాలుడిని పట్టుకోవాలని చూస్తాడు. ఆ సమయంలో బాలుడు వెంటనే పారిపోతాడు.vinayakuduఅతన్ని పట్టుకోవాలని విభీషణుడు పరుగెత్తడం ప్రారంభించాడు. చాలాదూరం పరుగెత్తిన వినాయకుడు ఒక కొండపైకి వెళ‌తాడు. చివరకు అతన్ని పట్టుకున్న విభీషణుడు నుదుటిపై గట్టిగా కొట్టడంతో స్వామి నవ్వుతూ అసలు రూపంతో దర్శనమిస్తాడు. విభీషణుడు వెంటనే క్షమాపణలు కోరుకోవడంతో గణపతి అతనిని ప్రసాదించి శ్రీరంగనాథ‌స్వామి కావేరి తీరంలోనే ఉంటారని వెల్లడిస్తాడు. అనంతరం వినాయకుడు అక్కడే స్వయంభువుగా వెలసినట్టు స్థల పురాణం.vinayakuduఈ విధంగా వినాయకుడు రాక్ ఫోర్ట్ దేవాలయంలో స్వయంభూగా వెలిసి భక్తుల పూజలందుకొంటున్నాడు.