శని వదలాలంటే ఈ ఆలయాలను ఒక్కసారైనా దర్శించండి

0
2142

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలున్నా శనీశ్వరుడి స్థానం ప్రత్యేకం. జనం ఆయన్ను తలచుకున్నంతగా మరే గ్రహదేవతనీ తలుచుకోరు. అయితే, శనీశ్వరుడు యమధర్మరాజుకి సోదరుడు. సూర్యుడికి కొడుకు. న్యాయబద్ధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించడం ఆయన వంశంలోనే ఉందని అంటారు. అయితే సాధారణంగా నవగ్రహాలతో పాటు శనీశ్వరుణ్ణీ దర్శనం చేసుకుంటాం. మరి మన దేశంలో శనిదేవుడు దర్శనమిచ్చే ప్రసిద్ధ ఆలయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. శనైశ్చరాలయం:

shivaఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లి అనే గ్రామంలో శనైశ్చరాలయం ఉంది. ఈ ఆలయాన్ని మందేశ్వరాలయం అని కూడా అంటారు. ఈ ఆలయానికి దగ్గరలోనే దధీచి మహర్షి ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలోనే దధీచి మహర్షి తపస్సు చేసి శక్తులని పొందాడని పురాణం. అన్తగేకాకుండా ఇక్కడే దధీచి మహర్షి తన వెన్నముక్కను ఇంద్రుడికి వజ్రాయుధంగా ఇచ్చాడని స్థల పురాణం. ఈ స్వామికి శని త్రయోదశి రోజున తైలంతో అభిషేకాలు చేస్తే బాధలన్నీ తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. అందుకే ఈ ఆలయానికి శని త్రయోదశి రోజున ఎంతో మంది భక్తులు వచ్చి శనేశ్వరునకు తైలాభిషేకాలు జరిపి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతారు.

2. శ్రీ శనేశ్వరస్వామి ఆలయం: 

Shaniతెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, మోమిన్ పేట మండలం కేంద్రానికి 6 కీ.మీ. దూరంలో ఎన్కతల అనే గ్రామంలో అత్యంత మహిమ గల శ్రీ శనేశ్వరస్వామి వారి దేవాలయం ఉన్నది. ఈ ఆలయంలో 22 అడుగుల శనేశ్వరుడి విగ్రహం భక్తులకు దర్శనం ఇస్తుండటం విశేషం. ఈ ఆలయంలో సప్తవృక్షాలు, సప్తదేవాలయాలు ఉండటం మరో విశేషం.  గ్రహపీడ, దుష్టశక్తులు, మానసిక ఆందోళన, దీర్ఘవ్యాధులతో బాధపడుతున్నవారు సప్తదేవాలయాలకు, సప్తవృక్షాల చుట్టూ 41 రోజులు ప్రదిక్షణలు చేస్తే, మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా గ్రహపీడ నివారణ జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

3. తిరునల్లూరు శనిగ్రహ దేవాలయం: 

Shaniతమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, తిరునల్లూరు అనే గ్రామంలో శనిగ్రహ దేవాలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడే నలమహారాజుకు శని పట్టుకొని పీడించడం ప్రారంభించాడని పురాణం. ఇక్కడకి నల తీర్థంలో స్నానం చేస్తే సర్వపాపాలు హరించుకుపోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో వెలసిన స్వామివారి పేరు దర్బరణ్యేశ్వరుడు. ఈ దేవుడికి గరిక అంటే చాలా ఇష్టం. అందుకే ఈ ఆలయంలో గరిక మొక్కని అతి పవిత్రంగా భావిస్తారు. అందువల్ల ఈ స్వామిని దర్బాధిపతి అని కూడా అంటారు. ఇక్కడ దేవాలయాన్ని దర్శించినప్పుడు భక్తులు దర్భల కొసలు ముడివేస్తారు. ఇలా ముడివేస్తే తమ కష్టాలన్నీ గట్టెక్కుతాయని భక్తుల నమ్మకం. ఇక ఈ ఆలయంలోని శనీశ్వరుడికి బంగారు కాకి వాహనంగా ఉంది. అయితే ప్రత్యేకంగా శనివారం నాడు మరియు ఉత్సవాల సందర్భంగా మూలా విగ్రహానికి బంగారు కవచం తొడుగుతారు. శనిదేవుకి ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి శనిపీయేర్చి అనే ఉత్సవం జరుగుతుంది.

4. ఆదికేశవ పెరుమాళ్ ఆలయం:

Shaniతమిళనాడు రాష్ట్రము, కాంచీపురం జిల్లా, శ్రీ పెరంబదూర్ అనే పట్టణంలో ఆదికేశవ పెరుమాళ్ ఆలయం ఉంది. ఈ దేవాలయం శనిదేవునికి అంకితం చేయబడింది. తులసిమాలను సమర్పించి ఇక్కడి శని భగవంతుడిని ఆరాధిస్తారు. ఈ దేవాలయంలో వందలకొలది భక్తులు ప్రతినిత్యం స్వామి దర్శనానికి వస్తారు. విశేషమేమిటంటే ఈ దేవాలయానికి వచ్చేభక్తులు తులసిమాలను స్వామికి సమర్పించి భక్తి,శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే ఏలినాటిశని ప్రభావం నుంచి బయటపడుతారని నమ్ముతారు. అంటే జీవితంలో ఉత్తమమైన అభివృద్ధిని శనిదేవుడు కరుణిస్తాడని భక్తుల నమ్మకం.

5. శింగణాపూర్ శని ఆలయం: 

Shaniమహారాష్ట్ర, షిరిడి కి 60 కిలోమీటర్ల దూరంలో శింగణాపూర్ గ్రామంలో శనిదేవుని ఆలయం ఉంది. ఇక్కడ శని దేవుడికి ఆలయం అంటూ ఉండదు. ఒక పెద్ద శిల లింగరూపంలో వెలసి ఉన్నది. ఇక్కడ శనిదేవుడు స్వయంభువుగా వెలిశాడని ఇది శనిదేవుడి నివాసప్రాంతంగా చెబుతారు. ఇక ఎక్కడ వెలసిన ఈ నల్లని రాతి విగ్రహం ఏ కాలానికి చెందినది అనేది సరిగ్గా ఎవరు చెప్పలేకపోయారు. ఇలా శనిభగవానుడు పెద్ద స్థంభం లాగా శివలింగం వలె ఉండే నల్లరాతి విగ్రహం దాధాపుగ ఐదున్నర అడుగుల ఎత్తు ఉంటుంది.   ఇక ఈ గ్రామంలో విశేషం ఏంటంటే, ఏ ఇంటికి కూడా తలుపులు అనేవి ఉండవు, వాహనాలకు కూడా తాళం అంటూ వేయరు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి దొంగతనాలు జరగగకుండా ఆ శని దేవుడి వీరిని రక్షిస్తాడని గ్రామస్థులు నమ్మకం. ఒకవేళ ఎవరైనా ఇక్కడ దొంగతనం చేస్తే వారికీ ఆ రోజే ఆ శనిభగవానుడు శిక్షిస్తాడని, గుడ్డివారవుతారని నమ్మకం. అందుకే వాహనాలకు, ఇంటికి ఈ గ్రామస్థులు తాళం వేయకూడదనే ఒక నియమం ఉంది.

SHARE