విటమిన్ సి చర్మ ఆరోగ్యానికి చేసే మేలేంటో తెలుసా ?

సిట్రస్ ఫలాల్లో ఉండే విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని మనందరికీ తెలిసిందే. బత్తాయి, నారింజ, నిమ్మ మొదలగు వాటిల్లో ఉండే విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే విటమిన్ సి ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికీ మేలు చేస్తుంది. విటమిన్ సి చర్మ ఆరోగ్యానికి చేసే మేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సిట్రస్ ఫలాలువిటమిన్ సి ని ఆస్కార్బిక్ ఆమ్లం అని కూడా అంటారు. సిట్రస్ ఫలాల్లో ఉండే ఈ విటమిన్, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సాయపడుతుంది. దెబ్బతిన్న చర్మ కణాలని ఆరోగ్యవంతం చేయడానికి, వాతావరణ మార్పుల వల్ల చర్మంపై వచ్చే మార్పులని నిరోధించడానికి, నల్ల మచ్చలని తగ్గించడానికి సాయపడుతుంది. ఇంకా స్కిన్ టోన్ ని బయటకి తీసి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది.

సిట్రస్ ఫలాలుకొల్లాజెన్ అనేది ఒక ప్రోటీన్. చర్మం తయారు కావడంలో కొల్లాజెన్ పాత్ర కూడా ఉంటుంది. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా మారి అందంగా ఉంటుంది. సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల వల్ల కొల్లాజెన్ దెబ్బతిని చర్మం అనారోగ్యంగా తయారైనప్పుడు విటమిన్ సి కొలాజెన్ కి హాని కలగకుండా చూస్తుంది. అంతే కాదు చర్మానికి రంగునిచ్చే మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ మెలనిన్ అధికంగా ఉత్పత్తి అయితే చర్మం నల్లగా మారుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR