Home Unknown facts రతీదేవికి శివుడు ఇచ్చిన వరం కారణంగా మన్మధుడు జన్మించాడా ?

రతీదేవికి శివుడు ఇచ్చిన వరం కారణంగా మన్మధుడు జన్మించాడా ?

0

పూర్వం ఒకరోజు పార్వతీపరమేశ్వరులు కలిసి ఒక మేడమీద కూర్చుని వుండగా కొందరు మహామునులు అక్కడికి చేరుకున్నారు. శంకరుడు వారితో సత్ప్రసంగములు చేయడం మొదలుపెట్టాడు. అదే సమయంలోనే మన్మథుడు కూడా రతిదేవితో కలిసి అక్కడికి వచ్చాడు.

Sri Krishnaసమయాసమయములు గుర్తించకుండా అక్కడికి చేరుకున్న మన్మథుడిని చూసి శంకరుడు తన మూడవకన్నుతో అతనిని కాల్చివేశాడు. అలా నిర్జీవుడైన తన భర్తను చూసి రతీదేవి, పార్వతీపరమేశ్వరులను దీనంగా ప్రార్థించి తన భర్తను సజీవంగా మార్చమని కోరుకుంటుంది.

గౌరీశంకరులు ఆమెను ఓదార్చి.. ‘‘మన్మథుడు ఇంకా శరీరంతో బతికేవున్నాడు. కాని అనంగుడై కూడా అతడు తన పని చేస్తూనే వున్నాడు. శ్రీమన్నారాయణనుడు భూమిపై యాదవవంశంలో వాసుదేవుడై జన్మిస్తాడు.

ఆ శ్రీకృష్ణునకు పట్టమహిషియైన రుక్మిణికి ప్రద్యమ్యుడు అనే పేరుతో నీ భర్త జన్మిస్తాడు. అప్పుడు నువ్వు అతనిని మానవకాంతవై పెళ్లాడతావు. విచారాన్ని వదిలిపెట్టు అని ఆమెను అక్కడి నుంచి పంపివేస్తారు.

 

Exit mobile version