ఆకలి పెరగాలంటే మనం తీసుకోవాల్సిన పదార్థాలు ఏమిటో తెలుసా ?

ప్రస్తుతకాలంలో ఆకలి లేకపోవడం అనేది చాలా మందిలో చూస్తూన్న సమస్య ఆకలిగా లేకపోవడం. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం. గ్యాస్, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం. వీటి నుంచి బయటపడేందుకు విపరీతంగా మందులు వాడటం. వీటివల్ల చాలా మందిలో ఆకలి నశిస్తోంది. అన్నం క‌డుపు నిండా పుష్టిగా తింటేనే ఆరోగ్యంగా ఉంటాం.

ఆకలి పెంచే ఇంటి చిట్కాలుఅయితే కొంత‌మందిలో ఆక‌లి బాగా ఉంటుంది. ఎదైనాస‌రే చాలా ఇష్టంగా తిన‌గ‌లుగుతారు. వీరికి ఆరోగ్యం బాగుంటుంది. మ‌రి కొంద‌రిలో ఆక‌లి వేయ‌దు. ఎదికూడా తినాల‌నిపించ‌దు. ఆక‌లి త‌గ్గితే ఆందోళ‌న ,డిప్రెష‌న్ , ఒత్తిడి, వంటి ఆనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. భ్యాక్టిరియా ఇన్ ఫేక్ష‌న్లు , కిడ్ని స‌మ‌స్య‌లు, డెమెంటియా, వంటి స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి.

ఆకలి పెంచే ఇంటి చిట్కాలుఅంతేకాదు ఆక‌లి లేక‌పోవ‌డం వ‌ల‌న బ‌రువుని చాలా త్వ‌ర‌గా కొల్పోతారు. ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డాల‌న్నా, ఇష్ట‌మైన‌వి తినాల‌న్నా కొన్ని పదార్థాలను తీసుకుంటే మన డైట్ లో భాగం చేసుకుంటే చాలు. ఆకలిని పెంచుకోవచ్చు. ఫలితంగా ఆహారం చక్కగా తినాలనిపిస్తుంది. మరి ఆకలి పెరగాలంటే మనం తీసుకోవాల్సిన ఆ పదార్థాలు ఏమిటో ఓసారి చూద్దాం.

ఖర్జూరం:

ఆకలి పెంచే ఇంటి చిట్కాలుఆకలి లేక ఇబ్బంది పడేవారు రోజూ 4, 5 ఖర్జూరాలను తింటే ఫలితం ఉంటుంది. లేదా ఖర్జూర రసం తాగినా మేలే.

న‌ల్ల మిరియాలు:

ఆకలి పెంచే ఇంటి చిట్కాలున‌ల్ల మిరియాల‌ను తీసుకొవడం వ‌ల‌న జీర్ణ‌శ‌క్తిని పెరిగేలా చేసి ఆక‌లి బాగా అయ్యెలా చేస్తాయి. వీటిలో ఔష‌ధ‌గుణాలు ఉండ‌టం వ‌ల‌న మ‌న‌కు రుచిక‌ళిక‌ల‌ను ప్ర‌భావితం చేస్తాయి. కాబట్టి జీర్ణాశ‌యంలో యాసిడ్ల ఉత్ప‌త్తిని పెంచుతుంది.

నిమ్మరసం:

ఆకలి పెంచే ఇంటి చిట్కాలుజీర్ణక్రియకు నిమ్మరసం చాలా మంచిది. ఇది శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ ను నివారిస్తుంది. దాంతో ఏదైనా తినాలనె కోరుక పెరుగుతుంది. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసాన్ని పిండి, కొద్దిగా ఉప్పు లేదా కొద్దిగా తేనె మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం తీసుకోవాలి.

యాల‌కులు:

ఆకలి పెంచే ఇంటి చిట్కాలుఇవి జీర్ణ ర‌సాల‌ను ఉత్పత్తి చేయ‌డ‌మే కాక, ఆక‌లి బాగా అయ్యేలా చేస్తాయి. రోజూ ఉద‌యం మ‌రియు సాయంత్రం స‌మ‌యంలో భోజ‌నానికి మందు ఒక‌టి లేదా మూడు యాల‌కుల‌ను అలాగే న‌మిలి మింగాలి. ఇలా చేయ‌డం వ‌ల‌న ఆక‌లి బాగా అవుతుంది.

ఫిగ్స్:

ఆకలి పెంచే ఇంటి చిట్కాలుపచ్చి మరియు ఎండిన ఫిగ్స్ రెండు కూడా ఆకలిని పెంచడంలో బాగా సహాయపడుతాయి. వీటని నేచురల్ గా తీసుకవాలి. లేదా జ్యూస్ లా చేసి తీసుకోవాలి . లేదా సలాడ్స్ లేదా డిజర్ట్స్ లో చేర్చుకోవాలి.

అల్లం:

ఆకలి పెంచే ఇంటి చిట్కాలు

అల్లం చాలా ఔష‌ధ‌గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఈ అల్లం మ‌న‌కు క‌డుపు నోప్పిని త‌గ్గిస్తుంది. అంతే కాదు ఆక‌లి పెర‌గ‌టంలోను కూడా ఇది చాలా అద్భుతంగా ప‌నిచేస్తుంది. అజీర్ణ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డేస్తుంది.

చింతపండు:

ఆకలి పెంచే ఇంటి చిట్కాలుఆకలి పెంచే మరో హోం రెమెడీ చింతపండు. ఆకలి పెంచడానికి, రుచి కలిగించడానికి దీన్ని చాలా వరకు మన భారతీయ వంటల్లో ఉపయోగిస్తుంటారు. ఆకలిని క్రమంగా పెంచుకోవడానికి చింతపండు మీ రోజూవారీ వంటల్లో చేర్చాలి.

సైంధ‌వ ల‌వ‌ణం:

ఆకలి పెంచే ఇంటి చిట్కాలుచిటేకేడు సైంధ‌వ ల‌వ‌ణం తీసుకోని అందులో ఒక అర టిస్పూను అల్లం ర‌సం క‌లిపి రోజూ భోజ‌నానికి ఒక అర గంట త‌రువాత తీసుకోవాలి. 10 రోజూల పాటు ఇలా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

ద్రాక్ష:

ఆకలి పెంచే ఇంటి చిట్కాలుద్రాక్షలో చాలా తక్కువగా యాసిడ్స్ ఉంటాయి మరియు పుల్లని రసం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు దాంతో ఆకలి పెరుగుతుంది. భోజనానికి భోజనానికి మద్య తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

దానిమ్మ:

ఆకలి పెంచే ఇంటి చిట్కాలుమరో హెల్తీ ఫ్రూట్ దానిమ్మ. ఆకలిని పెరిగేట్లు చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది.

ఉసిరి:

ఆకలి పెంచే ఇంటి చిట్కాలుఉసిరి జీర్ణ స‌మ‌స్య‌ల వ‌ల‌న ఆక‌లి త‌గ్గిన వారికి ఒక దివ్య ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. రెండు టీ స్పూనుల ఉసిరి ర‌సంను, ఒక టీ స్పూనుల తేనేను , మ‌రియు ఒక టీ స్పూను నిమ్మ‌ర‌సాన్ని, ఒక గ్లాస్ నీటిలో పోసి బాగా క‌లిపి ప్ర‌తి రోజూ ఉద‌యం ప‌రిగ‌డ‌పున తిసుకుంటే చాలా మంచిది. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే ఆక‌లి బాగా పెరుగుతుంది.

మెంతులు:

ఆకలి పెంచే ఇంటి చిట్కాలుమెంతి పొట్టలో గ్యాస్ ను వదిలించడానికి సహాయపడుతుంది. దాంతో ఆకలి పెరుగుతుంది . కాబట్టి, ఒక చెంచా మెంతి పొడిని ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం లేదా వంటకాల్లో జోడించడం వల్ల ఫలితం మరింత బెట్టర్ గా ఉంటుంది.

పుదీనా:

ఆకలి పెంచే ఇంటి చిట్కాలుకొద్దిగా పొదీనాను పెరుగులో మిక్స్ చేసి, రెండు మూడు చిటికెలు బ్లాక్ పెప్పర్ పౌడర్ చిలకరించడం వల్ల ఆకలిని క్రమంగా పెంచుతుంది.

వాము:

ఆకలి పెంచే ఇంటి చిట్కాలుఅన్ని జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించాడానికి వాము బాగా ప‌నిచేస్తుంది. జీర్ణాశ‌యంలోకి ప్ర‌వేశించే ఆహ‌రాన్ని స‌రిగా జీర్ణం చేసేందుకు అవ‌స‌రం అయ్యే ఎంజైముల‌ను, యాసిడ్ల‌ను ఉత్ప‌త్తి చేయడంలో ఈ వాము ఉప‌యోగ‌ప‌డుతుంది. రోజూ అర టీ స్పూను వామును బోజ‌నానికి ముందు నోటిలో వెసుకొని బాగా న‌మిలి మింగాలి. ఇలా చేస్తే ఆక‌లి బాగా పెరుగుతుంది.

కొత్తిమీర:

ఆకలి పెంచే ఇంటి చిట్కాలుకొత్తమీరను ఉడికించిన నీటిని ఒకటి లేదా రెండు టీబుల్ స్పూన్లను తీసుకోవడం ద్వారా వ్యక్తిలో ఆకలి కోరికలు క్రమంగా రోజురోజుకు పెరుగుతుంది.

వెల్లుల్లి:

ఆకలిఉడికించిన వెల్లుల్లి తిన్నా కూడా ఆకలి బాగా పెరుగుతుంది. ఆకలి పెరగడానికి ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR