బిగుతుగా ఉండే బట్టలు వేసుకుంటున్నారా? సమస్యలు తప్పవట!

ఆరోగ్య సంరక్షణలో మనం ధరించే బట్టలు కూడా ఒక భాగమే. అయితే బట్టల విషయంలో ఒక్కొక్కరి అభిరుచి ఒక్కోలా ఉంటుంది. కొందరు సీజన్ తో సంబంధం లేకుండా కాటన్ వస్త్రాలు ధరించడానికి ఇష్టపడతారు. కొందరు సిల్క్, మరి కొందరు ఇంకోరకం. ఏ బట్టలైనా మనకు నప్పేలా వేసుకుంటేనే మరింత అందంగా కనిపిస్తారు. కొంత మంది లూస్ గా ఉండే బట్టలే వేసుకుంటారు కానీ చాలా మంది బాగా బిగుతుగా ఉండే బట్టలు వేసుకోవడానికి ముందుంటారు.

loose trouserఇలాంటి వాటిలో శరీరాకృతి చక్కగా కనిపించి అందంగా ఉంటామన్నా అపోహతో ఇలాంటి దుస్తులు వేసుకోవడానికి ఇంట్రెస్ట్ గా ఉంటారు. అయితే బిగుతు బట్టలు మీ ఆరోగ్యానికి హానికరమని తెలుసా?అది నెమ్మది గా మీకు ఎంత నష్టాన్ని కలిగిస్తాయో తెలుసా? బిగుతుగా పట్టి ఉండే బట్టల వల్ల ఎక్కడపడితే అక్కడ కూర్చోవడానికి వీలుండదు. ఏ పని చేయాలన్న చాలా కష్టం గా ఉంటుంది. నడవాలన్న, కింద కూర్చోవాలి అన్న కూడా చాలా ఇబ్బంది ఉంటుంది.

tight apparelsఇలాంటి బట్టలు వలన కాళ్ళ మధ్యలో రాపిడి జరిగి ఇబ్బంది గా మారుతుంది. టైట్ గా ఉన్నవి వేసుకుంటే తొడ భాగంలో నొప్పి రావడం, కండరాల పై ఒత్తిడి పడటం వంటి సమస్యలు ఏర్పడతాయి. కండరాలు పట్టేసి ఇబ్బంది పడతారు. ఈ ప్రభావం వెన్నుపూస పై కూడా పడి వెన్ను నొప్పి పుట్టుకొస్తుంది. ఇంత టైట్ గా ఉండే దుస్తులు వలన సంతానానికి సంబంధించిన సమస్యలు కూడా మొదలవుతాయి.

muscle painఈ సమస్యలు ఆడవారికి మాత్రమే కాదు, మగవారిలో కూడా బిగుతుగా గా ఉండే జీన్స్ వేసుకోవడం వలన సంతాన సమస్యలు వస్తాయి. క్రోమోజోముల సంఖ్య చాలా వరకు తగ్గుతుంది. అలాగే లో దుస్తులు కూడా మరీ బిగదీసి ఉండేది వేసుకోకూడదు. దీనివల్ల అవయవాలపై తీవ్ర ప్రభావం పడి క్యాన్సర్ కి దారి తీస్తుంది. బిగుతైన లోదుస్తుల వేసుకోవడం వల్ల అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని మరియు క్యాన్సర్ వంటి సమస్యల సంభావ్యతను పెంచుతుందని కొన్ని అధ్యయనాలు నిర్ధారించాయి.

cancerమెడికల్ స్టేట్మెంట్ ప్రకారం, బిగుతైన లోదుస్తులు ధరించడం పురుషులలో పునరుత్పత్తి సమస్యలను కలిగిస్తుంది. ఎక్కువసేపు బిగుతైన లోదుస్తులు ధరించడం వల్ల సరైన రక్త ప్రసరణ జరగదు. దీని వల్ల హైపర్ పిగ్మెంటేషన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మెలనిన్ ఎక్కువ అవ్వడం వల్ల ఇలా జరుగుతుంది. మెలనిన్ వల్లే ఒక వ్యక్తి బాడీ కలర్ ఉంటుంది. టైట్ గా ఉండే ప్రదేశంలో నరాలు మొద్దుబారిపోతాయి. తగినంత రక్త ప్రసరణ లేనప్పుడు, కణజాలాల పనితీరు నిలిచిపోతుంది.

blood circulationకార్టిసోల్ వల్ల శరీరానికి మేలే జరిగినా, అది కొంత హాని కూడా కలుగచేస్తుంది. బిగుతుగా ఉండే దుస్తులు ఎక్కువగా ధరించి శరీరానికి వేడి పెంచితే కార్టిసోల్ స్థాయిలు కూడా పెరుగుతాయి. దానివల్ల జరిగే కొన్ని నష్టాలు జరుగుతాయి. అవేంటంటే.. శరీరంపై ఏవైనా గాయాలు అయితే.. ఆలస్యంగా తగ్గుతాయి, రోగనిరోధక శక్తి తగ్గుతుంది, రక్తపోటు పెరుగుతుంది – ఇవి కార్టిసోల్ పెరగడం వల్ల జరిగే నష్టాల్లో కొన్ని మాత్రమే. కార్టిసోల్ స్థాయిలు పెరగకుండా ఉండాలంటే వదులుగా ఉండే దుస్తులు ధరించి నిద్రించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

cortisolబిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం వల్ల ఛాతీ మంట కూడా వస్తుంది. లోదుస్తులు ధరించడం వల్ల ఉదరం గట్టిపడుతుంది. అన్నవాహికలో ఆమ్ల నాణ్యత పెరిగుతుంది. ఇది ఛాతీ మంటకు కారణమవుతుంది. బిగుతైన లోదుస్తులు శరీరంలోకి గాలి ప్రవాహాన్ని నిరోధిస్తాయి. దీనివల్ల అధిక చెమట వస్తుంది. అవాంఛిత తేమ కారణంగా కొన్ని ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. అదనంగా, బ్యాక్టీరియా దాడి పెరుగుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR