అజినోమోటో ఎక్కువగా వాడితే ఎన్ని అనర్థాలో!

మోనో సోడియం గ్లుటామెట్ పేరు ఎప్పుడైనా విన్నారా… అర్థం కాలేదా అజినో మోటో…? ఆ ఇప్పుడు కొంత మందికి అర్థం అయి ఉంటుంది. టేస్టింగ్ సాల్ట్ అంటే అందరికీ అర్థం అవుతుంది. మోనో సోడియం గ్లుటామెట్ ను అహార పదార్దాల రుచిని పెంచటానికి వాడతారు.  దీనిని ప్రధానంగా చైనీస్ సంబందిత వంటకాల్లో ఎక్కవగా వాడుతుంటారు. ఇది అజినొమోటో ఆనే బ్రాండ్ పేరుతొ మార్కెట్ లో లభిస్తుంది. దీనిని 1909లో జపాన్‌కు చెందిన అజినొమొటో కంపెనీ అధికారికంగా మార్కెట్‌లోకి విడుదల చేసింది.
  • తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదులకు తోడుగా దీన్ని ఏడో రుచిగా చెప్పుకుంటారు. భారతీయ వంటకాల్లో దీని వాడకం ఎక్కువే. ఆహార పదార్థాల్లో వీటిని వాడితే రుచి పెరుగుతుంది. కొన్నాళ్లు చెడిపోకుండా నిల్వ ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మనం మనకు తెలియకుండానే దీన్ని ఆహారంలో తీసుకుంటూ అనర్థాలు కొనితెచ్చుకుంటున్నాం.
  • ఈ సాల్ట్ ను ప్రస్తుతం ప్రముఖ హోటల్స్ రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు బ్యాకరీలలో తయారు చేసే పదార్ధాలలో విపరీతంగా ఉపయోగిస్తున్నారు. సాస్‌లు, చిప్స్, ప్రిపేర్డ్ సూప్స్, హాట్ డాగ్స్, బీర్లు, క్యాన్డ్ ఫుడ్స్ తదితర ఆహారాల్లోనూ విరివిగా ఉపయోగిస్తారు.
  • ఈ సాల్ట్ వల్ల మనం తినే ఆహార పదార్థాలకు మంచి రుచి వస్తుందని ఈ సాల్ట్ తెగ వాడేస్తున్నారు. అయితే ఈసాల్ట్ తక్కువ మొత్తంలో మన శరీరంలోకి చేరితే సమస్య లేదు కానీ ఎక్కువ మొత్తంలో ఈ సాల్ట్ మన శరీరంలో చేరితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి అని అంటున్నారు నిపుణులు . ఈ సాల్ట్ వల్ల ఊబకాయానికి గుర్వడమే కాకుండా పలు మెటబాలిక్ సమస్యలు వస్తాయి. ఈ సాల్ట్ వల్ల హార్మోన్ల అసమతుల్యత, వికారం, నీరసం, ఛాతి నొప్పి తదితర సమస్యలు వస్తున్నాయి.
  • ఈ సాల్ట్ కలిసి ఉన్న పదార్ధాలను అతిగా తినే వారికి మన నాలుకపై ఉండే రుచి కళికలు మరింత ప్రభావితం అయి ఈ ఆహారాన్ని అతిగా తిని బరువు పెరిగే ఆస్కారం ఉంది. ఎంఎస్‌జీ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకుంటుంటే హైబీపీ, డయాబెటిస్, కండరాలు ముడుచుకుపోవడం, కాళ్లు, చేతుల్లో సూదులు గుచ్చినట్లు అనిపించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,750,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR